ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

"జమీల్య"

6:00 AM
ఆ మర్నాడు నన్ను నేను సెల్లు లో కనుగొన్నాను. అలా ఎందుకయ్యిందో తరువాత చెపుతాను. అంతకు ముందు ఓ పడి గంటల క్రితం నేను ఆ దయ్యం తో అన్నాను. "నీ పేరు నాకు నచ్చలా."

"ఎందుకు?"

"పున్నమి, 'పున్నామ నరకం' లాగా ఉంది. అందులోనూ నాకు పున్నమి చంద్రుడు నచ్చడు."

ఎవరో కిసుక్కున నవ్వినట్టు అనిపించింది. ఎవరా అని తల త్రిప్పి చూశాను. ఒక తలలేని ఆకారం. ఆడ దయ్యమే అనుకుంటా. "ఓరబ్బీ! నీగ్గానీ దిమాక్ఖరాబ్ గానీ ఐతున్నదా? అట్లగైతే నిన్ను ఎర్రగాద్దకి పంపాలె!" అంటూ నా మీదకి వచ్చింది. ఎంత చావాలనిపించినా ఆ తల లేని దయ్యాన్ని చూసి వెన్నులో ఒణుకు వచ్చింది. "బాబోయ్!" అని కేక వేయబోయా. "ఏయ్! సోనియా గాంధీ నువ్వూరుకో! తను నా ఫ్రెండ్." పున్నమి అంది.

తను కూచింది తన శవ పేటికలో. "ఎందుకట్టా లేచావ్?" అడిగాను. భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ.

"పున్నమి సెంద్రుడు నచ్చట్లేదంటవ్? ఎర్రి నా కొడుకల్లె ఉన్నవ్ బిడ్డా!"

"ఓరి నాయనోయ్! నువ్వు తెలంగాణా దయ్యానివా? యాస సరిగ్గానే ఉందా?"

"అదా! నేను ఆ యాసని ట్రై చేస్తున్నాను. 'మళ్ళీ తెలంగాణా దయ్యం' అనకు. కేసీయార్ ఎగిరి తంతాడు." అంది సదురు సోనియా గాంధీ. "తను ఎక్కువ గా పున్నమి రోజుల్లోనే లేచి తిరుగుతుంది. అందుకే ఆ పేరు పెట్టాము."

"అంటే పూర్వ నామదేయాలు కూడా ఉంటాయా మీకు?"

"ఉన్నాయి అమ్మా నాన్నా పెట్టిన పేర్లు. ఇక్కడ మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాము."

పున్నమి మా సంభాషణని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అందుకే మేలి ముత్యాలు ఒలక పోస్తున్నట్టు చిరు నవ్వులు చిందిస్తోంది. నెల రాజు 'తిండి తిని నెల రోజులయ్యింది' అన్న టైపులో మొహం పెట్టాడు. ఆమె ముందు వెల వెల పోతున్నందుకు.

"మరి నీ పేరు సోనియా గాంధీ ఎందుకు?" వినాశ కాలే విపరీత బుద్ధి అనుకుంటూ. ఎక్కడ అది నా మీద పడుతుందో అన్న భయం ఉన్నా నా చావు ఎప్పుడొచ్చినా ఏమిటి నష్టం అనుకుంటూ ధైర్యంగా ఉన్నా.

"దానికి బుర్ర లేదని ఆ పేరు పట్టాము కానీ, రా చంటీ! మనం మాతాడుకుందాం," అంది పున్నమి.

"నిన్ను నేను ఏమని పిలవను?"

"పున్నమి నచ్చలేదన్నావుగా! నువ్వే పేరు పెట్టు."

"జమీల్య!"

"చాలా బాగుంది. దాని అర్ధం తెలుసా?"

"తెలుసు. అరబ్బీలో 'అందమనది' అని అర్ధం."

"అబ్బో! చంటి బాబు కి అరబ్బీ కూడా వచ్చే?"

"రాదు." ఏడుపు మొహంతోఅన్నాను. "ఆ పేరు చిన్ఘిజ్ ఐత్మాతోవ్ వ్రాసిన ఒక నవల లోది. హీరోయిన్ పేరు. నాకుబాగా నచ్చిన పేరు అది."

"అబ్బో! అయ్యగారు కళా పోషకులే!" కళ్లు పెద్దవి చేస్తూ ఎక్కిరించింది.

"నీకా కథ తెలుసా?"

"చదివాను. ఈ మధ్యే! ఒక శాపులోనుంచీ కొట్టేసి. ఆ హీరోయిన్ నాకూ బాగా నచ్చింది. నాకూ తనలా ఉండాలనిపించింది."

"ఐతే ఆ కథ చెపుతావా?"

"చదివానన్నావ్?"

"నీ మాటల్లో వినాలనీ..."

"సరే! విను" అంటూ మొదలెట్టిందికాదు కానీ ఆ కథ గురించి చెపుతాను. అయినా ఇది చెప్పు. నీకు పున్నమి అన్న నా పేరు ఎందుకు నచ్చ లేదు?"

"నాకు పంచమి చంద్రుడంటే ఇష్టం."

"గురుడికి తిక్కేమన్నా ఉందా?"

"కాదు పంచమి చంద్రుడు ఎలా ఉంటాడు?"

ఇలా అంటూ గాల్లో చూపించింది. నిజంగానే అక్కడ ఆ ఆకారం నాకు గాల్లో కనిపించింది. సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను.

"ఇలా కదా! అలా చూడు. నవ్వుతున్నట్టు లేదూ! అదే పున్నమి చంద్రుడు అదోలా నోరు తెలుచుకుని నిద్దరోతున్న న్యాయం లా ఉంటాడు. అదీ కాక కొంచం ఏడుపు సింబల్లా!"

"నీలోనూ విషయం ఉందబ్బాయ్! ;-) కానీ ఏడుపు సింబల్ సరిగా లేదేమో! కథ విను." ముగ్ధ మనోహరంగా నవ్వింది.

ఆ కలకూజిత స్వరం లోనుంచీ ఆ కథ గురించి ఇలా విన్నాను.

(సశేషం)
Read On 2 comments

ఝుమ్మంది నాదం...

7:41 AM
గురు శిష్యుల స్వాతికి'రణం'

గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న అంశాన్ని శోధించే నా ఈ చిరు ప్రయత్నం లో ఇది మొదటి అడుగు. ఇంతకు ముందర నేను శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? అని నా ప్రయత్నానికి పీఠికని వ్రాశాను. ఇది అసలు విషయం.

Ayn Rand వ్రాసిన The Fountainhead అనే నవలలో మనుషుల మనస్తత్వాలని విశ్లేషిస్తుంది. అవి నాలుగు రకాలంటూ. ఆ నాలుగు రకాలలో ఎంతో గొప్ప generalization ఉంది. ఆమె ఆరోహణ క్రమంలో వివరించింది.

అలాగే కే విశ్వనాధ్ సృజియించిన అద్భుత చిత్రరాజాలైన

౧. "శంకరాభరణం"

౨. "సాగర సంగమం"

౩. "స్వర్ణ కమలం"

౪. "స్వాతి కిరణం"

లలో గురువుల గురించి అవరోహణ క్రమం లో చెప్పారు. కానీ నేను ఆరోహణ క్రమం లోనే వాటి గురించి పరిచయం చేస్తాను. ముందుగా "స్వాతి కిరణం".

కే విశ్వనాధ్ అద్భుతమైన పరిశీలనా శక్తికీ, సునిసిత దృష్టికీ, ఈ సినిమాలు గొప్ప ఉదాహరణలు. ఆయన తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ నాలుగు సినిమాలూ ఒక ఎత్తు. ఈ నాలుగింటినీ ఒక quadrulogy (పదం కరెక్ట్ కాదేమో. తెలిసిన పెద్దలు చెప్పండి) అనుకోవచ్చు.

ఇక్కడే నా కేస్ స్టడీ మొదలవుతుంది.

"శృతి నీవు ద్యుతి నీవు... ఈ నా కృతి నీవు భారతీ..." అంటూ ఆ శిష్యుడు కుతూహలం గా మొదలు పెడితే ఆ గురువు గారికి అసూయ మొదలైంది. విశ్వనాధ్ ఇక్కడే తన గొప్పతనాన్ని బయట పెట్టుకున్నారు. ఎలా అంటే...

ముందు ఆ గురు శిష్యుల పాత్రలకి ఎంపిక చేసిన పాత్ర దారుల ద్వారా? నిజంగా మమ్ముట్టీ ని ఎంపిక చేయటం masterstroke. ఏ కమల్ నో, సోమయాజులనో, ఎంపిక చేయ వచ్చు. కానీ వారిని ఇద్దరు గురువుల కోసం వాడేశారు. మూడో గురువు ఎవరో సస్పెన్స్. అందులోనూ వారిద్దరికీ తెలుగు ప్రేక్షకులలో ఒక రకమైన ఇమేజ్ ఉంది. అందువల్ల కథ మీద అంచనాలతో వచ్చే ప్రేక్షకులకి నిరాశ కలుగ వచ్చు. ఇక్కడ విషయ ప్రధానమే కానీ నట ప్రధానం కాదని ఆయన తన ఎంపిక తోనే చెప్పారు. మమ్ముట్టీ ఎంత మాత్రం నిరాశ పరచకుండా నటించి (మాట తప్పేమో...), ఆయన ఆశీస్సులని అందుకున్నారు. ఆ పిల్లాడూ అంతే బాగా నటించాడు. Selection of actors is of top class. K. Vishwanath is a master in it. (Some more about this aspect in the next post)

రామాయణం లో పిడక వేట అనుకోకుంటే... సినిమాలో మమ్ముట్టీ కి "పద్మ..." అవార్డు వస్తుంది. దానిని అతను తిరస్కరితాడు. (ఇక్కడ విశ్వనాధ్ టెక్నిక్, సింబాలజీ ని మనం తప్పకుండా తలుచుకోవాలి. ఈ విషయాలూ చెప్పుతాను.). కానీ తన నటనతో విశ్వనాధ్ ఆశీస్సులని అందుకున్న మమ్ముట్టీ తరువాత కాలం లో ఆ అవార్డుని అందుకున్నారు.

"అసూయ" మనిషి భావాలలో అతి ఏహ్యమైన భావం. మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది. అందులోనూ ఒక గొప్ప శిష్యుని చూసి అసూయ పడ్డ గురువు ఆ గురుత్వానికే అనర్హుడు. (అసూయ ఉండవచ్చు. అది ఎలాంటి అసూయో నేను తరువాత నా బ్లాగు thinkquisistor.blogspot.com లో చెపుతాను. http://annisangathulu.blogspot.com బదులు నేను మొదలెట్టిన క్రొత్త బ్లాగు. మా నాన్న గారిని ఒప్పించి ఆయన చేత రామాయణాన్ని వ్రాయించే ప్రయత్నంలో కొత్తదైతే బాగుంటుందని మొదలెట్టాను).

అలా అసూయ చేతిలో చిక్కి తన జీవితాన్ని కోల్పోవటమే కాక ఇద్దరికి కడుపు కోత మిగిల్చిన ఒక గురువు కథే "స్వాతి కిరణం". అసూయ ప్రభావాన్నే కాదు మనుషుల సైకాలజీని ఇంత అద్భుతంగా స్టడీ చేసిన సినిమాలు చాలా అరుదు.

Ayn Rand తన The Fountainhead లో మనుషులని

౧. "a man who never could be, but doesn't know it."

౨. "a man who never could be, knows it too."

౩. "a man who could have been."

౪. "The man as he should be and ought to be." అని విభజిస్తుంది.

మరి విశ్వనాధ్ సినిమాల్లో... మొదట అసూయ వల్ల ఎంత పతనమవుతారో చెప్పే "స్వాతి కిరణం". ఇక్కడి నుంచే నా పయనం మొదలు.

(సశేషం)

"స్వాతి కిరణం" గురించి బాగానే ఆలోచించాను కనుక దాని మీద వ్యాసాలు త్వరగానే వ్రాస్తాను. నవంబరు మొదటి వారం లోపలే.

The Fountainhead గురించి కొందరు అడిగారు. లింకులు దొరుకుతాయి కానీ నా వ్యాసాలకి అనుగుణంగా నేనే రెండు రోజుల్లోనే http://thinkquisistor.blogspot.com లో వ్రాస్తాను. బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది.
--------------------------------------------------------------------

పెద్దల గురించి, తప్పొప్పుల గురించి (ఇక్కడ తప్పులు లేవు లెండి.) చెప్పే ముందు మన గురించి చెప్పుకోవటం సంప్రదాయం.

నా గురించి చెప్పుకునేటందుకు ఏమీ లేదు. అంతా నార్మల్. ప్రొఫైల్ లో ఉన్నది కొంచమే. Dual nature. (But both are positive.). కొన్ని సార్లు అద్భుతంగా వ్రాస్తాను.

{SRINIVASA RAMANUJAN : THE CONJECTURE OF MATHEMATICS (Some of my best writing in english. ippudinkaa improve ayyaanu.)

వయ్యంటే బిడ్డే (My best in telugu)

కత వింటారా మాట కదా ఒకటుందీ. (బాబు ఆకుల గారి 'తెలుగు వెలుగు' లో ప్రచురితమైంది)

"నిఝంగా క్రికెట్టేనా??" కి స్పందన. : Complete post... (నిజంగానే బాగుంది)

http://wimbledonweekly.blogspot.com లోని దాదాపు అన్ని టపాలూ. మరీ అద్భుతమైనవి అని కాదు. బాగా కుదిరాయి. నాకు తృప్తిని ఇచ్చాయి. ఇంకా బాగా వ్రాయగలను.}

కొన్ని సార్లు అంతే అద్భుతంగా చెడ గొడుతాను.

పున్నమి - ఏ'కాంత'వేళ (ఎంతో భావుకత తో వ్రాయాల్సినది. మరీ dry స్టైల్ వచ్చేసింది. చెప్పాలనుకున్న దానిని చెప్పలేక పోయాను. నాలుగైదు ఆలోచనలని పెట్టుకుని చివరకి ముగింపుని కష్టం చేసుకున్నాను. నాకా genre సూటు కాలేదు. నేర్చుకోవాలి.).

వెంట్రుక ∏ శర్మా మాస్టరు. (ఇంకా బాగా వ్రాయగలను. కానీ అప్పుడు మనసు పెట్టలా.ఇంకొంచం క్రిస్ప్ గా వ్రాసి ఉండాల్సింది.).

ప్రియ గారిచ్చిన "దొర్లే బఠానీ గింజ" (My worst పోస్ట్. మళ్ళీ వ్రాస్తే సరిగానే వ్రాస్తాను.).

అది నాకు బాగా తెలుసు. నా dual nature లో ఉన్న ఇబ్బందే అది.

"విజయ విశ్వనాథం" సీరీస్ ని చాలా లేటు చేసింది అందుకే. చెప్పాలనుకున్న దానిని సరిగా చెప్పగలను అనుకున్నప్పుడే వ్రాస్తాను.

ప్రయత్నం నాది. ఫలితం ఆ 'శ్రీకృష్ణ భగవానుడికే' వదిలేశాను.

"విజయోస్తు" అని ఆశీర్వదిస్తారో... లేక

ఇది నా గురించి.

హరే కృష్ణ!
Read On 2 comments

పున్నమి - ఏ'కాంత'వేళ

7:45 AM
చిక్కని చీకటిలో నాకు వెన్నల మాత్రమే తోడుంది. వెండి వెన్నెల పిండార బోసినట్లు నన్ను కౌగిలించుకుని గిలిగింతలు పెడుతున్నా నా మనసు పౌర్ణమి చంద్రుని వలె విషాదంగా ఉంది. నేనప్పుడు ఏకాంతంగా లేను. ఒంటరిగా ఉన్నాను. తుంటరి పిల్లగాలి నిదురించే తోటలో అల్లరి చేస్తూ నా ముంగురులని కవ్విస్తోంది.

ఆకాశం లో నక్షత్రాలు బొంతకేసిన కుట్లు లాగా ఉన్నాయి. చిక్కి పోయి. పున్నమి చంద్రుడు నోరు తెరుచుకుని చూస్తున్నాడు నా కష్టాన్ని. ఇంతలో సెలయేటి గల గల లా నవ్వు వినిపించింది. ఎవరా అని మబ్బుల్లోంచీ తొంగి చూసిన చందమామలా బింకంగా ఆ వైపు చూశాను. దిక్కు కూడా నాకు గుర్తులేదు.

నిశ్శబ్దం తన శ్రుతిని సరి చేసుకుంది. ఆ గొంతుతో పాటూ తనూ పాదాలని. ఓనిడా సేల్ల్ఫోన్లో కాల్ చేసేటప్పుడు వచ్చే సిగ్నల్ లాగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు ని చూసి చంద్రుడు దాక్కున్నాడు మబ్బుపిల్ల వెనుక. సిగ్గు పడి. అంతందంగా నేను లేనే అని.

మళ్ళీ చిమ్మ చీకటి. మరో సారి అదే నవ్వు. పంచమి కాంతుల రాకేశుడు సరిగమల సప్త స్వరాలాలపించినట్టుగా ఆమె నా ముందు నిలిచింది. చేతిలో ఒక క్రొవ్వొత్తి. నా ఎదలోని చీకట్లని తరిమివేసేందుకు. నా ముందునుంచీ తనలా సాగిపోతుంటే నేను అనుసరించాను. ఆమె నావైపోకసారి చూసి నవ్విందలా మళ్ళీ. ఎద పొంగి గండి పడటంతో నేను కాసేపలా ఆగి కొంచం దూరంగా ఆమె వెనుకే వెళ్లాను. ఎంతసేపు గడిచిందో తెలీదు. రేతుంటరి కళ్ళప్పగించాడు ఆ వదనారవిందానికి. నాకూ నవ్వొచ్చింది. పైన ఉన్న చలువ భామలనొదలి ఈ కలువ భామ వెంట పడ్డాడే అని.

ఆమె ముందుకి సాగుతూనే ఉంది. సెలయేటి అలలా. దారిలో రెండు నల్లని గండు పిల్లులు. మీసం మెలేస్తూ ఆమె ని చూచారు. నేనలా గుడ్లప్పగించాను. ఏమి చేస్తుందో ఈ సోయగాల పసిడి చిన్నది. చేతిలోని క్రొవ్వొత్తిని అలాగే పట్టుకుంది. చంటి పాప అమ్మ రొమ్ముని పట్టుకున్నట్లు. చంద్రుడు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు తన ప్రయాణాన్ని ఆపేశాడు. చుక్కలన్నీ పెద్దవైనై. ఆ దృశ్యాన్ని చూద్దామని. ఉత్కంఠత తో.

తను ముందు కెళ్ళింది. వారూ ఆమెని అనుసరించారు. పాల ధార వెనుక దొంగ పిల్లిలా. ఆమె నడిచింది. చిన్నగా... వెళ్ళింది ఒక ఇంటిలోకి. వారూ అనుసరించారు. నేనలా ముందుకి దుమికాను. కాపాడుదామని. తలుపులు మూసుకున్నాయి. ఐదు నిమిషాలు గడిచాయి. తన్నలా ఒదిలేశానే అని బాధ.

తలుపులు తెరుచుకున్న గుదిలోంచీ వచ్చిన దేవతలా ఆమె నా ముందుకి వచ్చింది. ముఖంలో మెరుపుల వెలుగులు. ఏమైందో? వారేమి చేశారో? "ఏమయ్యారు?" అడిగాను. "కోరిందిదొరికి వెళ్ళారు అలా ముందుకు" అంది. ఆ మాటలు కోకిల కూతలు. తోడు రానా అన్నాను. నీకిష్టమా అంది. అవును అన్నాను నేను. సరే! అంది. తన వెంట సాగాను. అలా అలా నడిచాము. ఊరు దాటాము. పొలాలనీ దాటాము. తనతో మాటల్లో పడి నా దారిని నేను మరిచాను.

"మీ ఇల్లెక్కడ?" అడిగాను. నవ్వింది సమాధానం గా. "రాగలవా?" అన్నట్లు.

"రాగాలనేమో!" అన్నాను. ఉత్సుకతతో. ముందుకు సాగామలా. అలా. అలా. తల తిప్పి చూశాను రాత్ కా బాద్శాహ్ ని. ఏడువ లేక నవ్వాడు. "నీకు దొరకదుగా" అన్నట్టు నేను ఒక చూపువిసిరి ఆ చుక్కలు నీకు అందనివి. ఈ పంచమి కాంతుల జాబిలమ్మ నాకే అన్నాను. మౌనంగానే. ఇంతలో తను ఎటో తిరిగింది. నేనూ తననే అనుసరించాను. నాకాశ్చర్యం ఎక్కడకెళ్తోందని.

తను వెళ్ళింది. నేనాగాను. రమ్మని పిలిచింది. కమ్మగా నవ్వింది. నేనూ నవ్వాను చాలా కాలం తరువాత. సహజంగా. నాలుగాడుగు వేశానో లేదో...

ఒక పెట్టె తెరుచుకుంది. తనలా వెళ్లి అందులో పడుకుంది. కళ్లు పెద్దవయ్యాయి. పౌర్ణమి చంద్రునిలో మచ్చలలా.

నవ్వో నిట్టూర్పో తెలీదు. నాలోంచీ ఒక శబ్దం వచ్చింది. "నా పేరు చెప్పనే లేదు కదూ. 'పున్నమి'"

"నాపేరు...."

"ఒద్దులే. ముద్దుగా ఉన్నావు. చంటీ అంటాను సరేనా?"

"సరే!"

"నేనెవరో చెప్పనా?"

"చెప్పు."

"నేనొక దెయ్యాన్ని." మళ్ళీ నవ్వింది. చల్లగా. ఆత్రంగా చూసింది. నేను భట పడుతానని. లేదు. కొన్ని గంటల క్రితం చావు గురింది ఆలోచించిన వాడిని కదా!

అక్కడే కూల పడ్డాను. "ఏమిటి వెళ్ళవా?" అంది.

లేదన్నాను. "కథ చెపుతావా" అడిగాను.

సరే! అంది. అప్పుడే నాకు బ్రతకాలనే కోరిక ఉదయించింది.

ఆ దయ్యం చెప్పిన కథలు నాలో ఒక ధైర్యాన్ని పెంచాయి. ఆ కథలు "పున్నమి చెప్పిన కథలు."
Read On 1 comments

ఇంద్రధనస్సు - The Rainbow

8:37 AM
"CHAMPIONS ARE COLORFUL"

Andre Agassi... ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది.

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులుంటాయి.

ఏడు రంగులనూ కలిపితే నే మనకు తెలుపు రంగు వస్తుంది. అంటే తెలుపులోనే ఏడు రంగులూ ఉంటాయి.

అందుకే "వింబుల్డన్" లో తెల్లని దుస్తులనే వాడాలని నియమం పెట్టి ఉంటారు. Agassi Black and White photo ఇది. అయినా ఎంత Colorful గా ఉన్నాడో చూడండి.

ఇప్పుడు రంగు రంగుల దుస్తుల్లో. ఆ glamor వేరు. అందుకే అతనంటే అప్పట్లో అమ్మాయిలకి ఆరాధన. సిసలైన యువకుడు.

అందుకే నన్నాకర్శించాడు తోలి చూపులోనే. అలా మైకేల్ స్టిచ్ తరువాత నాకు నచ్చిన మరో స్టార్. నిజమైన స్టార్. ఎందుకంటే తళుక్కున మెరుస్తాడు కదా!

1991 Photo అనుకుంటాను.




Practice చేస్తూ. ఆ ఎర్ర రంగు జుట్టూ, చింపిరి గడ్డం. ఇవి చాలవూ ఒక పిల్లవాడి మనస్సు ని కొల్ల గొట్టటానికి?

అందుకే "Champions are colorful." అలా ఉంటేనే అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. అందులోనూ చిన్న పిల్లలని.



Bad boy Agassi. ఆఆ నల్ల కళ్ళజోడూ... పొడుగు జుట్టూ... చెవి పోగూ... ఒక నిజమైన Fashion icon.
ఆ backhand కొట్టే stylke చూడండీ. Glamor magic.

నా మనసు కొల్లగొట్టింది ఇప్పుడే...
1992 Wimbledon Trophy తో.
తెల్ల బట్టల్లో ఇంద్రధనస్సు.
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! దశాబ్ద కాలం లో ఏమైనా జరగొచ్చు.
ఆటలో పదను ఏమాత్రం తగ్గలేదు. Pegion Toes Agassi.

అపుడెపుడో చిన్నప్పుడు.
విషాదం లో నవ యువకుడు. ఏడుపులోనూ ఉందోయ్ glamor.

గుండునే Fashion చేసిన మొనగాడు.
అందం చెక్కు చెదరలేదు సరి కదా అందరూ గుండె మందనుకున్నారు.
వంద మిలియన్ డాలర్ల నవ్వుల్ నవ్వుల్.


అగస్సి గురించి మరో బ్లాగ్ లో ఇంకా... ఇంకా...
అప్పటి దాకా...సెలవ్!
వింబుల్డన్ సామెత: "గ్లామరున్నోడు ఎన్ని డ్రెస్సులు అయినా వేయొచ్చు."
నెక్స్ట్ పోస్ట్ ఈజ్ "అందరికీ వైరల్ ఫీవెర్... నాకు అగస్సీ ఫీవెర్!"
మన పంథా: "Winning is a fashion. Victory is a passion."
Read On 5 comments

"రామాయణం"

7:04 AM
నాకు అంతర్జాలంతో పరిచయం శూన్యం. ఎప్పుడన్నా పిల్లలు చెప్పి చూపిస్తే చూడటమే. ఈ మధ్య మా అబ్బాయి బ్లాగులనే పేరుతో అంతర్జాలంలో ఏవేవో వ్రాస్తున్నానని చెప్పాడు. వాటిని పరిశీలిస్తే కొన్ని బాగానే అనిపించాయి. కొందరు బ్లాగ్గర్లు వ్రాసిన వాటిని తెచ్చి చూపగా అంతర్జాలంలో తెలుగు బాగానే వెలుగుతున్నదన్న ఆశ కలుగుతున్నది.

కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖం
వందే వాల్మీకి కోకిలం

నన్ను సంక్షేప రామాయణాన్ని వ్యాఖ్యాన సహితంగా వ్రాయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అయితే ఓపిక లేక ఉపేక్షిస్తూ వచ్చాను. అయితే తన వాదనతో నన్ను మొత్తానికీ ఉత్సాహ పరిచి నన్ను ఒప్పించాడు. అంతర్జాలం లో పెడతానని అనటం తో, ఆ మధుర కావ్యాన్ని మరలా తలుచుకునే భాగ్యం నాకు కలిగింది.

ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుతూ నా వీలుననుసరించి 'రామాయణం' అనబడే ఆ మధుర కథను నా శైలిలో అనువాదము చేసే పనిని చేపడుతాను.

సెలవ్.

వేదాల రాజగోపాలాచార్య.
Read On 4 comments

వాన్ టూ త్రీ... FedEx కి నో ఎంట్రీ!

12:27 AM
Rafael Nadal ఈ సంవత్సరాన్ని number one గానే ముగించటం ఖాయమైంది. తన క్రీడా జీవితం లో రికార్డులని బద్దలు కొత్తతమే కానీ మిస్ అవటం తెలీని FedEx తొలిసారిగా ఒక అద్భుతమైన రికార్డుని మిస్ అవుతున్నాడు. :-((
అది వరుసగా ఎక్కువ సార్లు Tennis Season ని number one గా ముగించటం.

Pete Sampras వరుసగా ఆరు సంవత్సరాలు ఆ రికార్డుని సాధించగా, Jimmy Conners ఆ రికార్డుని ఐదేళ్లు సాధించాడు. ఇప్పటికి 2004-07 season లలో number one గా ఉన్న FedEx ఈసారి తన rank ని కోల్పోవటం ద్వారా ఆ అరుదైన రికార్డుని Pete Sampras నుంచీ అందుకునే అవకాశాన్ని కోల్పోవటం బాధగానే ఉన్నా Pete Sampras రికార్డు అలాగే ఉండటం నాకు personal గా ఆనందం కలిగించింది. Theoretical గా అసాధ్యం కానప్పటికీ అవకాశాలు బహు స్వల్పం.

World Men's Rankings Top ten: (tennis magazine news letter సౌజన్యంతో)
Rank
Name
Country
Ranking Pts
1
Rafael Nadal
ESP
7000
2
Roger Federer
SUI
5930
3
Novak Djokovic
SRB
4960
4
Andy Murray
GBR
2995
5
Nikolay Davydenko
RUS
2400
6
David Ferrer
ESP
2315
7
David Nalbandian
ARG
1975
8
Andy Roddick
USA
1970
9
Juan Martin del Potro
ARG
1685
10
Stanislas Wawrinka
SUI
౧౬౭౦
----------------------------------------------------------------------------------------

ఇందాకన వీరేంద్ర సెహ్వాగ్ 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రేపు దూరంగా పోతున్న బంతిని వేటాడి ఔట్ అయ్యాడంటారు జనం. కానీ అదే బంతికి ఫోర్ వస్తే? ;-)
----------------------------------------------------------------------------------------

Lance Armstrong మళ్ళీ సైక్లింగ్ బరిలో దిగుతున్నాడు. Kudos. రా రా రా రారా Armstrongoo.
----------------------------------------------------------------------------------------

ఈసారి Oliver Kahn గురించి వ్రాస్తాను.
Read On 1 comments

గెలిచే వాడే మనిషి - 2

6:51 AM
అబ్బ! ఈ పేరు గురించైతే ఈ మధ్యనే నాకు గంటసేపు తలంటి పోయటం జరిగింది. అదెలాగో మీకు త్వరలోనే తెలియవచ్చు. కానీ నేనే గెలిచాను. :-)) హ హ హ.  

సరే విషయానికి వద్దాం. ఎక్కడ ముగించాం? అంతే దెబ్బకు నేను మైకేల్ స్టిచ్ కి అభిమానిని అయిపోయాను. ఎక్కడికెళ్ళినా నేను స్టిచ్ మంత్రమే. ఐతే అది కొంత కాలమే! తరువాత మనకి 'మహాకాళాన్ని మట్టుపెట్టిన ఇవాన్' దొరికాడు. వాడు టెన్నిస్ ఆటగాడు కాదు. (ఆ స్టోరీ వేరే చెప్తాను). కానీ నా మీద మైకేల్ స్టిచ్ వేసిన ఎఫ్ఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఎక్కడో ఔట్ సైదర్ అయిన తను బెకేర్ అంతటి మొనగాడి మీద గెలవటం? గ్రేట్. ఎన్ని గట్స్ ఉండాలి? అందులోనూ మూడే మూడు సెట్ లలో గెలవటం?  

నేను బడికి (కొత్త బడి. నేను పది క్లాసులని ఏడు బళ్ళలో చదివాను. బళ్లంటే ఎద్దు బండీలు కాదు. ఇస్కూలు బడి అన్న మాట. సారీ తమ్ముడి మాట.) వెళ్ళగానే శర్మా మాస్టరు మీ నాన్న గారి పరువు నిలబెట్టాలంటే మొదటి రాంకు రావాలని వార్నింగ్ ఇచ్చాడు. నాకేమో ఆయనంటే చచ్చేంత భయం. అస్సదురు మొదటి పిల్ల ఎవరా? (ఖచ్చితంగా నాకు అమ్మాయిలకే మొదటి రాంకు వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఆ రాంకు విషయం లో అమ్మాయిలతోనే ఎక్కువ పోటీ పడింది) అని వెతుకులాట మొదలెట్టాను. అబ్బాగా చదివే అమ్మాయి పేరు ఐశ్వర్య అని కర్తవ్యం విజయశాంతి లెవెల్లో నాకు సుబ్రహ్మణ్యం సారు (శర్మ గారి అన్నయ్య) చెప్పారు. మొదటి రాంకు రాకుంటే తాట తీస్తానన్న శర్మా మాస్టరు వార్నింగు, సుబ్రహ్మణ్యం గారి కర్తవ్య బోధనా కలిసి నన్ను ఇరకాటంలో పడేశాయి. ఇంతలో చిన్నమామయ్య పెళ్లి కావడంతో వెళ్లి వచ్చాను. అదో పది రోజులు రక్షించింది. 

ఈ గొడవ ఎట్టా తీరునా అనుకుంటుంటే ఇదో ఇలా స్టిచ్చి అనగా కొండ చిలివ గెలిచాడు. వాడేదో నెంబరు వానను ఆటగాడనుకుంటే... బెకేర్ కి ఉన్న చరిత్ర లేదని నాన్న చెప్పాడు. అద్గదీ అప్పుడే నాకూ ఒక ధైర్యం వచ్చింది. బెకేర్ లాంటి ఆటగాడినే స్టిచ్చి ఓడించగా లేంది మనకప్ఫలానా కర్తవ్యం ఐశ్వర్య ఒక లెక్కా అనుకుంటూ బరిలోకి దూకాం. చూశారా చిన్న వయసులోనే గెలుపంటే ఎంత ప్యాషనో! ఎవరికుండదు చెప్పండి? 

"When odds are against you, you have to prove yourself to others. But when the odds are in favor of you, you have to prove only to yourself. But I don't prove to others. Because I never felt yhe odds are against me." - Pete Sampras.  

వింబుల్డన్ సినిమా టైటిల్: గెలుపు - దీనికి రుచెక్కువ.  

మరో విషయం. ఇదే కాదు. చాలా ఉదంతాలు చెప్పాలి. మొన్నీ మధ్య యూఎస్ ఓపెన్ గెలిచే రోజుల్లో FedEx మొహం చూశారా? ఒక రకమైన కసి. ప్రతి పాయింట్ నూ కొండని పిండి చేసేటంత కసి తో ఆడాడు. ఎందుకు? పాపం ఈ సంవత్సరం మొదట్లో ఉదార సంబంధమైన వ్యాధితో తను బాధ పడ్డాడు. గత సీజన్ ధాటికి అలిసిపోయాడు. మూడోసారి ఫ్రెంచ్ మిస్సయే సరికి కొంచం డీలా పడ్డాడు. దానికి తోడు వింబుల్డన్లో రాఫా ఐదు సెట్లకి స్ట్రెచ్ చేయటం తనకు కొంచం ఇబ్బంది పెట్టే విషయం. మళ్ళీ యూఎస్ లో జొకోవిక్ స్కోరు చూస్తె తేలిక గానే ఓడినా, తనని కంగారు పెట్టాడు. 

అందుకే ఈసారి తను అలసటగా సీజాన్ని మొదలెట్టాడు. అంతే మన విమర్శకులకి మేత దొరికింది. వీళ్ళకి పనేమీ ఉండదు.  

వింబుల్డన్ సినిమా టైటిల్: విమర్శకులు - వీళ్ళకి మేత కావాలి.  

ఎలాగెలగా? ఫెదెరెరు ఆట్టం లేదు. ఇక ఇతని పని అయిపోయింది. దీనికితోడు జొకోవిక్ Australian Open గెలవటం తోనే ఇక ఇతనే నెంబరు వన్ను అన్నారు. మధ్యలో రాఫా ఉన్నాడనే సంగతి మర్చిపోయి. "ఇక నేనే నెంబరు వన్ను. కురుక్షేత్రమే ఎదురైతే.... మోసగాళ్ళకు మొసగాణ్ణీ రా" అంటూ వచ్చిన "నానీ" సినేమా గతే జొకోవిక్ కీ పట్టింది. రాఫా రెచ్చి పోయి నెంబరు వన్ను నేనే అని చెప్పలేదు, అయి చూపిస్తే... ఇక FedEx విషయానికి వద్దాం. ముందు Australian Open తర్వాత కొంత ఫాం కోల్పోయాడనేది నిజమే. జనానికి కావాల్సింది అదేగా. (నాక్కావాల్సిందీ అదే. విషయం తరువాత టపాల్లో వస్తుంది). అంత మాత్రాన అతని పనైపోయినట్లేనా? 

కొంత కాలం గడిచింది. విమర్శల జడివానలో తడిసి ముద్దయ్యినందువల్ల పడిశం పట్టిందో, లేక నిజంగానే అలసి పోయాడో ఏమో కానీ FedEx కొంచం డీలా పడ్డాడు. పైకి కాదు. దాంతో ఫ్రెంచ్ లో ఆటను ఆడాడు అదీ పెద్ద తేడాతో. మేత గాళ్ళకి ఇక టైము వచ్చింది. ఫెదరర్ శకం ముగిసినట్టేనా? అని ఊహాగానాలు మొదలెట్టారు. అందరి గొంతులూ బాగోవుగా! అందుకే పాటలు అంత హిట్ కాలేదు. అయినా వాళ్లు పాడిందే పాత్రా... అన్న చందాన రెచ్చి పోతూనే ఉన్నారు. వింబుల్డన్ లో ఓడగానే ఇక బహిరంగంగానే కచ్చేరీలు మొదలెట్టారు. దుబాయి స్టేజ్ షోలూ వగైరా వగైరాలూ.  

వింబుల్డన్ సామెత: చాంపియన్లు నడుస్తుంటే విమర్శకులు మొరిగినట్టు.  

ఒలింపిక్స్ లో పేస్ ని ఓడించి డబుల్స్ గెలవడమే కాదు. కావాలంటే ఏదయినా నేను చేయగలనని తనకు తానూ నిరూపించుకున్నాడు FedEx . చామ్పియన్లకి ఎవరికో నిరూపించుకునే పని ఉండదు. కేవలం తమకు మాత్రమె బాధ్యులు. ఈ విషయాన్ని సాంప్రాస్ బాగా చెప్పాడు. ఆ నమ్మకంతోనే యూఎస్ ఓపెన్ లో రెచ్చి పోయి ఆడాడు. ఆ కసి గురించి Olympic Tennis - 2 లో చెపుతాను. గెలిచేవాడే మనిషి ఇక్కడికి పూర్తయింది. నా ఈ టైటిల్ గురించి ప్రశ్నించిన రొమాంటిక్ కామెడీ హీరోయిన్ గారికి టైటిల్ ఎందుకు పెట్టానో అర్ధం అయి ఉంటుంది.  

మన పంథా: Winning is a fashion. Victory is my passion.


కొస మెరుపు: నాకు స్టిచ్చి ఇన్స్పిరేషన్ తో మొదటి రాంకు వచ్చింది. ఆ మర్నాడే కుమారి పిన్ని నాకు ఆడ పిల్ల వేషం వేసి ఫోటో తీయించింది. చూశారా విధి ఎంత బలీయ మైనదో!

Next post is 'Champions are colorful'.
Read On 8 comments

'గన్'గూలి : ది లాస్ట్ ఎయిమ్.

7:18 AM
మొత్తానికీ అందరూ కలిసి గంగూలి ని దించేశారు. The pride of India has hung up his boots.

భారత కెప్టెన్ గా గుబాళించిన సౌరభం తన సువాసనలని మన కందరికీ వదిలేసి తను మాత్రం అంతర్జాతీయ యవనిక మీద నుంచీ తొలగి పోతున్నాడు. Pure and stylish తరహా క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు ఆ భాగ్యం లేకుండా చేసి, 'దాదా'పుగా గెంతెయబదకుండానే గౌరవం గా తప్పుకుంటున్నాడు.

సౌరవ్ గంగూలీ గురించి నేను వ్రాయాలని అనుకున్నాను. కానీ ఇలా అని మాత్రం అనుకోలేదు. సరే! మనమందరం ఆ కలకత్తా రాకుమారునికి దసరా శుభాకాంక్షలతో వీడుకోలు చెబుదాం. ఆస్సీస్ సీరీస్ లో గంగూలీ విజయవిహారం చేయాలని అందరం కోరుకుందాం. అతని శిష్యుడు సెహ్వాగ్ అన్నట్టుగా కనీసం 3-1 తేడాతో మన వాళ్లు గెల్చి 'గన్'గూలి కి విజయానందం తో వీడుకోలు చెప్పాలని... మన విజయ సారధి... సగర్వంగా తన కేరీయర్ ని ముగించాలి అని కోరుకుంటూ.

మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు.
Read On 5 comments

తొలి వందనం అమ్మకే.

5:07 AM

అమ్మకి నేను సెల్ఫోను కొనిచ్చాను. స్టేట్మెంట్ లో ఏదో లోపం ఉంది కదూ! "అమ్మ నన్ను తనకు సెల్ఫోను కొననిచ్చింది." ఇప్పుడు బాగుంది.

"పదిమంది ఉపాధ్యాయులుకంటే, ఒక ఆచార్యుడు (గురువు) గొప్పవాడు. వందమంది గురువులకంటే ఒక తండ్రి గొప్పవాడు. వేయి మంది తండృల కంటే ఒక తల్లి గౌరవనీయురాలు." ఓహ్! ఎంత బాగుంది చెప్పుకునేందుకు. అసలు అమ్మ గొప్పతనాన్ని చెప్పటానికి వేరొకరితో పోల్చాలా? అమ్మ కి పోలికా? అసలు అమ్మంటే? అవును అమ్మంటే?

నిజం! నాకేమీ తెలీదు. అందుకే నేను ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాను. చెప్పలేక బాధగా ఉన్నాను. బాధతో కళ్లు మూసుకున్నాను. నాకప్పుడు భారంగా శ్వాస పీల్చటం తెలుస్తోంది. ఆ ఊపిరినే గమనించాను. మరికొంచెం సేపు. ఇంకొంచంసేపు. అప్పుడు అమ్మ నాకు కనిపించింది. అప్పుడు నాకు అర్ధమైంది. అమ్మంటే నా ఊపిరి. నా ప్రాణం. నా జీవనం. నా జీవనాధారం. నా శ్వాసని వేరెవరైనా నా కోసం పీల్చగలరా? నా శ్వాసకి నేను ఎవరితోనైనా పోలిక చెప్పగలనా? అంతే. అమ్మ కూడా అంతే. అమ్మకి పోలిక చెప్పటం మన ఫూలిష్నెస్స్.

నవమాసాలూ మోసి, కని పెంచి, ఎంత మంది చెప్పలేదీ కబుర్లు? ఇక చాలు. ఆపుదాం. కని పెంచటం కాదు. ఆ రెండే కాదు. ఇంకా చాలా! అమ్మంటే మనము తీసుకునే ఆహారం. మనం నివసించే ప్రకృతి. చూశారా? ఇప్పుడే అమ్మంటే తెలుసు కున్నాను అనుకున్నాను. కానీ ఏమీ తెలీదు. ఏదేదో చెప్పేస్తున్నాను. అమ్మని పొగుడుదాం అనుకుంటే నేను భావుకుడిని కాదు. అమ్మ గురించి కవిత్వం చెపుదాం అనుకుంటే నేను కవినీ కాదు. మరి నువ్వెవరివి అంటారా? అద్గదీ... ఇప్పుడు దొరికింది.

నేను.
C/o amma.

మనిషి.
C/o అమ్మ.

అసలు సృష్టికే మూలకారణం అమ్మ. అందుకే అమ్మ నా ఊపిరి. నీ ఊపిరి. మనందరి ఊపిరి.

దేవుడు అందరి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. నాకు మళ్ళీ అర్ధం కాలేదు. అసలు దేవుడంటే సర్వ శక్తిమంతుడు అంటారు కదా? మరి ఆయన అందరి వద్దా ఉండలేడా? ఆలోచనే ఫూలిష్నెస్స్. మరి అమ్మ ఎందుకు? ఆలోచించాల్సిన ప్రశ్నే!

నాకిప్పుడు భయం వేస్తోంది. మళ్ళీ కళ్లు మూసుకున్నాను. కరంట్ పోయింది. భయంకరమైన చీకటి. ఏంచేయాలో తోచలేదు. ఏమిచేయాలి? చీకటిని తొలగించాలంటే వెలుతురు కావాలి. మరి ఆ వెలుగెవరు? ఆ వెలుగు అమ్మే!

ఎందుకంటే నీ బ్రతుకుని నిర్దేశించేది అమ్మే!

ముందొక మాట చెప్పాలని ఉంది.

రాముడు అడవికి వెళుతున్నాడు. సీతమ్మనీ తనతో తీసుకుని వెళుతున్నాడు. లక్ష్మణ స్వామీ బయలు దేరాడు. సుమిత్రాదేవి ఏమి చెప్పిందో తెలుసా?

"रामं दशरथं विद्धि
माम विद्धि जनकात्मजा
अयोध्याम अटवीम विद्धि
गाच्छ तातयथा सुखं"

రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజా!
అయోధ్యాం ఆటవీం
విద్ధి
గచ్ఛ తాత యథా సుఖం.

అంటే...

"నాయనా! రాముణ్ణి దశరథుని వలె భావించు. సీతమ్మని నన్ను వలె భావించు. ఆటవిని అయోధ్య వలె భావించు. ఇక్కడి వలెనె సుఖంగా ఉండు."

నాయనా! నువ్వు వెళ్లొద్దు, అనలేదు. నాయనా నీవు లేనిదే నేను ఉండలేను, అనలేదు. కొడుకు గురించి అధైర్య పడలేదు. రాముని గూర్చి అపోహ పడలేదు. అడవిలో నా బిడ్డ ఎలా బ్రతుక గలదు? అనే భయమే లేదు. లక్ష్మణ స్వామి మీద అంత నమ్మకం. తమ్ముడిని తనతో సమానంగా చూసుకుంటాడని రాముని మీద అంత నమ్మకం. అంత ధైర్యం కలది కాబట్టే సుమిత్రాదేవి అంత గొప్ప అమ్మ.

కైక లా అసూయ లేదు. కౌసల్య లా ఆవేశం లేదు. చేయాల్సిన పని మీద దృష్టి అంతే! She lead Lakshmana swami from the front with those cool words.

ఈ మాటలని వ్రాయ గలిగినందుకు వాల్మీకి ఎంత అదృష్టవంతుడు?

ఒక్క మాటలో తన బిడ్డకి లక్ష్య నిర్దేశం చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలా ఆలోచించగాలగాలో చెప్పింది.
"నాయనా! అతవినే అయోధ్య అనుకో. ఆహాహా! అంటే? నువ్వు ఎక్కడ ఉంటే అదే నీ ఊరు. అదే నీ ఇల్లు. నిన్ను నడిపించే అన్నే నీకు పితృ సమానుడు. అన్నా భార్యే నీకు తల్లి లాంటిది. అంటే? అడవి దాటారు. జనపదాల్లోకి వెళ్ళారు. అప్పుడు జనపస్డమే నీకు ఇల్లు. దాటారు. నగరానికి వెళ్ళారు. అదే నీ ఇల్లు. ఎక్కడికైనా వెళ్ళు. ప్రదేశం నీదే! ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఉంటుంది కనుక. ఎలా? అమ్మంటే నీ ఊపిరే కదా! నీ ఊపిరి ఎక్కడ ఉంటే అక్క అమ్మ ఉన్నట్లే! ఎలా? శ్వాసని నీకు ఇచ్చింది అమ్మే కదా!"

ఎంత బాగా చెప్పింది? వసుధైక కుటుంబం.

అంతేనా?

అమ్మ చేతి ముద్ద కమ్మన అంటారు. ఛా! నిజమా?

ఒకటి మాత్రం నాకు తెలుసు. మనం తినే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో వాటి ప్రభావం ఆ ఆహారం మీద ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు వండింది తినకూదదంటారు. అలాగే నా మాటేంటంటే, తినే వారి ఆలోచనలు కలిపే వారి చేతి ద్వారా ఆహారం లో ప్రవేసిస్తాయి. మనం తినేటప్పుడు అందుకే అన్నం మీదే దృష్టి పెట్టాలి. కానీ మనం ఆ పని చేయలేం. అదే
అమ్మ మనకి కలిపి పెడుతుంటే? అమ్మంటే నీ శ్వాసే! అమ్మ దృష్టి నీ మీదే! బిడ్డ ఆకలి మీదే! అంటే తనలో అప్పుడు ప్రేమ ప్రొంగి ప్రవహిస్తుంటుంది. ప్రేమ తన చేతుల మీదుగా నీ ఆహారం లోనికి వెళుతుంది. ప్రేమే నీలో కలిసి పోతుంది. ప్రేమే నీ రక్తంలో కలసి పోతుంది. ప్రేమే నువ్వు అవుతుంది. నీ లో నుంచీ ప్రవహిస్తుంది. నీ ప్రేమ అందరినీ చేరుతుంది. ప్రపంచాన్నే ప్రేమ ముంచెత్తుతుంది. అప్పుడు అందరూ నీకు నీ లాగే కనిపిస్తారు. నిన్ను నీవు ద్వేషించ లేవు. అంతటికీ కారణం... 'అమ్మ చేతి ముద్ద'.

ఇప్పుడు చెప్పండి! అమ్మ చేతి ముద్ద కమ్మన అంటూ అమ్మ ప్రేమకు ఒక రుచిని అంటగట్టగలమా? అమ్మ ప్రేమకీ అమ్మతనానికీ ఒక పరిధి నిర్ణయించగలమా?

అమ్మ ప్రేమకి ఒక పరిధి లేనట్టే అమ్మ గురించి చెప్పుకునేందుకు అంతం లేదు. అందుకే మళ్ళీ కలుద్దాం.

అమ్మ కరుణ కలిగింది. క అంటే బ్రహ్మ. రుణ = ఋణం. కలిగింది. బ్రహ్మ ఋణం కలిగింది. అంటే? బ్రహ్మే అమ్మకు రుణ పడి ఉన్నాడు. అమ్మని చేసిన బ్రహ్మే అమ్మకి రుణ పడి ఉన్నాడు.



గీతాచార్య.

Read On 3 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి