ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

Showing posts with label Sports etc.. Show all posts

"నిఝంగా క్రికెట్టేనా??" కి స్పందన. : Complete post.

7:50 AM
హమ్మయ్య. ఒలింపిక్స్ మత్తు దిగింది. మైకేల్ ఫెల్ప్స్ అష్ట స్వర్ణాల సంబరమూ దిగింది. నాదల్ కి ఒలింపిక్ స్వర్ణం వచ్చిన ఆనందమూ వదిలింది. విలియమ్స్ సిస్టర్స్ డబుల్స్ స్వర్ణం నెగ్గారనే సంతోషమూ తగ్గింది. భారత్ కి మూడొచ్చిందన్న ఖుషీ గాయబ్ అయింది. ఇహ ఎమోషన్స్ వదలటంతో ఈ టపాని హాయిగా మొదలెట్టాను.

ఈ ఉపోద్ఘాతం దేనికంటే... ఆ పైన వివరించిన ఆనందాలని అనుభవిస్తూ వ్రాస్తుంటే మన ఎమోషన్స్ డామినేట్ చేసి అసలు విషయాన్ని ప్రక్కద్రోవ పట్టిస్తాయి. అది నాకు ఇష్టం లేదు. వీలైనంత బ్యాలన్సుడ్ గా వ్రాయాలన్నదే నా అభిమతం.

సరే! విషయానికి వద్దాం. ఇంతకూ ముందు చెప్పిన మాటనే ఇక్కడా చెబుతున్నాను. "మనకి ఐదు వేళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని పొడుగువి. కొన్ని పొట్టివి. కొన్ని లావుగా ఉన్నాయి. మరికొన్ని సన్న గా ఉన్నాయి. సన్న గా ఉన్న వేళ్ళు లావు వేళ్ళని, లావు వేళ్ళు సన్న వేళ్ళని శత్రువులుగా చూస్తే మన చేతి పరిస్తితి ఏమిటి? అలాగే లైం లైట్ లో లేని వాళ్లు ఉన్నవాళ్ళని తిట్టుకుంటే ఏమొస్తుంది?"

"సాక్షి" పత్రిక లో "డబుల్ ధమాకా" అని ప్రతి ఆదివారం ఇస్తుంటారు. అందులో ప్రముఖుల్ని కొనదరిని ఇద్దరిద్దరుగా Interview చేస్తుంటారు. అందులో ఒక సారి పుల్లెల గోపీచంద్, వీ వీ ఎస్ లక్ష్మణ్ ని Interview చేశారు. అందులో... గోపీచంద్ ని ఈ విషయమే అడిగితే ఎంత చక్కగా సమాధానం చెప్పాడో చూడండి.

ప్రశ్న: "క్రికెట్ కీ, క్రికేతర్లకీ ఇచ్చే ఆదరణ వేరే క్రీడలకీ, క్రీడాకారులకి ఇవ్వకపోవడం న్యాయమేనా?"

గోపీచంద్: "న్యాయంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఒక్కో దేశం లో ఒక్కో స్పోర్ట్ ని ఎక్కువగా ఆదరిస్తారు. ఇండోనేషియాలో, మలేషియాలో బ్యాడ్మింటన్ నెంబర్ వన్ క్రీడ. ఇండియా లో కూడా అలానే ఉండాలని రూల్ లేదే. ప్రపంచం లో ఎక్కడైనా ఏ రెండు ఆటలూ, ఆటగాళ్ళూ సమానం కాదు. దానికో ఉదాహరణ చెబుతాను. నేనోసారి జర్మనీ వెళ్ళినప్పుడు రోయింగ్ లో 48 ప్రపంచ, మరియూ ఒలింపిక్ టైటిళ్ళు గెలిచిన 40 ఏళ్ల మహిళను కలిశాను. ఆమె అక్కడ కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.మరి అదే దేశానికి చెందినా మైకేల్ షూమేకర్ ఎంత పాప్యులర్. అతని ఒక్క వారం సంపాదన ఆమె ఆజీవన సంపాదనకి సమానం. ఇద్దరికీ పోలికేక్కడ? నా దృష్టిలో పోలిక ఉండాల్సిన అవసరం కూడా లేదు. అందరూ నా లాగా అనుకోక పోవచ్చు. అలాంటి వారికి నేనొక్కటే చెబుతాను. 'బాగా కష్ట పదండి. మీ గేమ్ కి మంచి గుర్తింపు తీసుకు రండి. వాతన్నిటితో పాటూ మీ స్పోర్ట్ ని సరిగా మార్కెట్ చేసుకోండి,' అని. సానియా సక్సెస్ టెన్నిస్ కి పాప్యులారిటీ ని తీసుకుని రాలేదా? ఏ ఆటైనా అంతే. Others should also get their act together instead of cribbing."

దీనికి లింక్...
http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=5787&categoryid=11&subcatid=25

ఏమంటారు?

ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఒలింపిక్స్ వచ్చిందాకా మనకి బాక్సింగ్ గుర్తుకు రాదు. రెస్లింగ్ అసలే తెలీదు. (పిల్లలు WWE చూస్తారు. అది వేరే విషయం). ఒలింపిక్ క్వాలిఫైయింగ్ మ్యాచుల దాకా ఎవరికీ హాకీ పట్టదు. కానీ ఒలింపిక్స్ లో స్వర్ణం కావాలి. అదేమంటే క్రికెట్ మీద పడి ఏడుపు ఒకటి. 1983 దాకా క్రికెట్ అంతే ఎవరికీ ఇప్పటంత పిచ్చి లేదు. ఇంకో మాట చెప్పు అంటారా? సరే అంతగా పాప్యులర్ కాదు. కానీ ఒక్క విజయం ఆ ఆట గతినే మార్చేసింది. దాన్ని సరిగా మార్కెట్ చేసుకోగలిగారు.

ఇప్పుడు బింద్రా షూటింగ్ లో స్వర్ణం గెలిచాడుగా... మార్కెటింగ్ చేసుకో గలిగితే గతం కన్నా నయం గానే ఉంటుంది పరిస్తితి.

ఆయినా హాకీ హాకీ అంటుంటారు. అందులో ఏమి సాధించారు? అష్ట స్వర్ణాలంటారా? అది ancient history. కోపం వద్దు. 1975 తర్వాత తరం వాళ్ళకి హాకీలో ఘన విజయాలేమి తెలుసు? అదే క్రికెట్ అంతే... 1983 world cup, 1985 world series cup, madhyalo Sachin, Ganguly, Dravid, Kumble, ఇప్పటి Dhoni, అప్పట్లో Kapil, Srikanth, Gavaskar... ఎంత మంది superstar లని? మన టెన్నిస్ ని బ్రతికించింది Leander, Bhupathi లు కాదా? వ్యక్తులే ఆయా ఆటలని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కపిల్ కొట్టిన 175 మన క్రికేర్ చరిత్రనే మార్చింది. మరి అంత రేంజ్ లో గ్లామర్ ఉన్న superstar లు ఇతర క్రీడలలో ఎవరొచ్చారు? Prakash Padukone తరువాత గోపీచంద్ వరకూ బ్యాడ్మింటన్ లో ఎవరు వచ్చారు? Dhanaraj Pillai, Mukesh Kumar కాకుండా వేరే హాకీ స్టార్ ల పేర్లు మూడు తడుముకోకుండా చెప్పండి? పాపం వాళ్లు మాత్రం ఎన్నాళ్ళని లాగ గలరు? 'అంగట్లో అన్నీ ఉన్నాయ్ హాకీ పెద్దేమో గిల్' అన్నట్టు ఉన్న పరిస్థితి.

Leander Paes లేకుంటే 1990 ల తరం వారికి భారత్ లో టెన్నిస్ గురించి ఆసక్తి ఉండేదేనా?

Note: ఇంతటితో వ్యాసం పూర్తి కాలేదు. అందుకే కొన్ని విషయాల్లో ప్లస్ లగురించే, కొన్ని విషయాల్లో మైనస్ ల గురించే ఎక్కువ చెప్పాను. పూర్తి వ్యాసం అయితేనే complete balanced nature వస్తుంది. త్వరలోనే మొత్తం పూర్తి చేస్తాను.

సత్యమేవ జయతే!
Read On 4 comments

"నిఝంగా క్రికెట్టేనా??" కి స్పందన.

5:56 AM
ముందు ఒక విషయం గమనించాలి. మనకి ఐదు వేళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని పొడుగువి. కొన్ని పొట్టివి. కొన్ని లావుగా ఉన్నాయి. మరికొన్ని సన్న గా ఉన్నాయి.

సన్న గా ఉన్న వేళ్ళు లావు వేళ్ళని లావు వేళ్ళు సన్న వేళ్ళని శత్రువులుగా చూస్తే మన చేతి పరిస్తితి ఏమిటి? అలాగే లైం లైట్ లో ఉన్న వాళ్లు ఉన్నవాళ్ళని తిట్టుకుంటే ఏమొస్తుంది?

క్రికెట్ ఆ స్తాయి లో ఉండటానికి కారణం... 1983 ప్రపంచ కప్పు గెలవడమే. అలాంటి విజయాలు ఈ మధ్య కాలం లో ఎవరు సాధించారు ఇతర క్రీడలలో? సానియా టెన్నిస్ లో రాణించినా టెన్నిస్ కి అది చేడుపే అయింది. కొందరు స్ఫూర్తి పొందినా ఎక్కువ గా తన పధ్ధతి తో ఆటకి అగౌరవం తీసుకొచ్చింది. జెండా గొడవ, డ్రెస్సుల గొడవ... ఓడితే గాయాల మాట! (విమర్శించట్లేదు. జరుగుతోంది అదే. నిన్న ఒలింపిక్స్ లో మరో సారి.) హాకీ వాళ్లు గుర్తించలేదని ధర్నాలు చేశారు కానీ ఆ శ్రద్ధ ఆట మీద పెడితే ఒలిమ్ప్క్స్ లో ఆడే వారేమో కదా! ఇతర ఆటలకి అంత ఆదరణ లేక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చెపితే అది కామెంతవాడు. ఒక బ్లాగు అవుతుంది. అసలే మహేష్ గారికి ఒక బ్లాగు బాకీ పడ్డాను.

క్రికెట్ ని మన వాళ్లు ఇష్ట పడటానికి ప్రధానమైన రీజన్... మన వాళ్ల బద్దకమే. నిజం. అలా ఎనిమిది గంటలు చూడొచ్చు కదా ఏ పనీ చేయకుండా. మార్కెటింగ్ కి ఆ ఆటే అనుకూలంగా ఉంది. వికెట్ పడితే ఓ యాడ్, ఓవర్ ఐతే ఒక యాడ్, ఆట ఆగితే మధ్యలో ఒక యాడ్. ఆ సౌకర్యం మరో క్రీడలో లేదు. టెన్నిస్ లో మూడు గేమ్స్ అయితే కానీ యాడ్ వేసేందుకు వీలు లేదు. ఫుట్బాల్ లో కనీసం అరగంట వెయిట్ చేయాలి. ఎవరాగుతారు మన దేశం లో.
క్రికెట్ కి కపిల్ వచ్చినట్లు, ప్రతి ఆటకూ ఎవరో ఒకరు రావాలి. అంట దాకా తప్పాడు మరి.
వీటికి తోడు రాజకీయాలు ఉన్నాయి. "అంగట్లో అన్నీ ఉన్నా హెడ్ రూపం లో గిల్ ఉన్నాడు." హాకీ సామెత.
టెక్నాలజీ ని అన్దోకో లేక పోవడం, మొదటి నుంచీ మన వాళ్లు శ్రద్ధ పెట్టక పోవడం.... ఇలా చెపుతూ పొతే ఎన్నో, ఎన్నో ఉన్నాయి.

కాక పొతే ఇందుకు ఎవరినో అనే బదులు ఆల్రేడి పాపులర్ అయిన ఆటగాళ్ళు తమ తమ ఆటల్ని ప్రొమోట్ చేయ వచ్చు. కరణం మల్లీశ్వరి ఒక కాంస్యం గెలవగానే కోతి తీసుకుని హాయిగా సెటిల్ అయింది. గోపీ చందూ అంతే. కాకపొతే సైనా ని తయారు చేశాడు.

ఉష కి ఉన్న పట్టుదల మిగతా వాళ్ళకి లేదు. తన అకాడెమీ నుంచీ అయినా ఒలింపిక్ హీరో/హీరోయిన్ వస్తుందని ఆశిస్తున్నాను.

ముందున్న వాడిని పడేసి మనం గెలవడం కాదు. వాడికన్నా శక్తివంతంగా తయారు కావాలి. ఈ ఆలోచన ఎవరికీ లేదు.

చెప్పాల్సింది చాలా ఉంది. సిస్టం టైం అయిపోయింది. మరో సారి ఇంకొంచం లాజికల్ గా వ్రాస్తాను. ఇది ఒక కామెంటే. కంప్లీట్ బ్లాగ్ కాదు. అలాగే చూడండి.

కామెంట్ అనుకుని వ్రాస్తే బ్లాగు లెంత్ వచ్చింది అందుకే బ్లాగేస్తున్నాను. లింక్ చూసి మీరు కామెంట్ వ్రాస్తారో లేక బ్లాగుతారో మీ ఇష్టం.

సత్యమేవ జయతే!
Read On 10 comments

ఆరో నెలలో అన్న ప్రాశన, ఆరో ఏట సాంప్రాసన.

3:57 AM
వింబుల్డన్ విలేజ్ బ్లాగు will be started by Monday/Thursday.

నాకు అన్న ప్రాశన 9 వ నెలలో జరిగినా అంతకుముందే 6 వ నెలలో మా అక్కే చేసేసింది ఉప్మా ప్రాశన. అందుకేనేమో నాకు ఉప్మా అంటే అంత నచ్చదు. (ముందొచ్చిన చెవులకన్నా ... సామెత తెలుసు కదా).

అలాగే నా ఆరో ఏట పీట్ సాంప్రాస్ గురించి నాకు తెలిసింది. "సాంప్రాస్ సంచలనం" అంటూ 1989 ఆగస్ట్ నెలాఖరులో ఆంధ్ర జ్యోతి డైలీలో హెడింగ్ చూశాను. సంచలనం అనే మాట నాకు బాగా గుర్తుంది. ఎందుకో అది నాకు నచ్చిన మాట కూడా. ఆటోమాటిక్ గా సాంప్రాస్ కూడా నచ్చేశాడు. అయితే మనకేం తెలీదుగా అంతగా పట్టించుకోలేదు. అన్నప్రాసన లాగే నా తొమ్మిదో ఏట, అంటే 1992 లో టెన్నిస్ గురించి బాగా తెలిసింది. నన్ను బాగా ఆకట్టుకున్న గేమ్ అది. అందులోనూ వింబుల్డన్ అంటే చాలా ఇష్టం.

ఈ సంవత్సరం తో 16 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ సందర్భంగా నేను వింబుల్డన్ విలేజ్ అనే బ్లాగుని ప్రారంభిస్తున్నాను. అందులో ఈ పదహారేళ్ళ విశేషాలూ, టెన్నిసేనాకు నచ్చటానికి కారణాలూ, గొప్ప గొప్ప ఆటగాళ్ళ గురించి విశ్లేషణలూ , మంచి ఫోటోలూ, ఇంకా ఎన్నెన్నో సంగతులూ ఉంటాయి. ఎనీవే ఆజ్ యూజువల్ గా సత్యమేవ జయతే!

బ్లాగు అడ్రస్: wimbledonweekly.blogspot.com

నచ్చితే ఆదరిస్తారనీ తెలుసు, నచ్చక పోతే మళ్ళీ చూడరనీ తెలుసు. So, I go ahead. Wimbledon village starts from Monday or Thursday.

అదికాక క్రికెట్, ఫుట్బాల్, మొదలైన ఆటల గురించి నా మామూలు బ్లాగులోనే Sports etc., లేబెల్ తో రాస్తుంటాను.

బై.

P. S.:

My bet for asia cup is Srilanka, because ఇండియా ఎవరినైతే తన చివరి మ్యాచ్ లో ఓడిస్తుందో ఆ జట్టు చేతిలోనే ఫైనల్లో నాలుగు సార్లు ఒడి పోయింది. (మొన్నటి బంగ్లాదేశ్ టోర్నీ, 1998 pepsi cup, 2004 asia cup, 2005 zimbabwe టోర్నీ.. అదే గంగూలీ కెప్టెన్ గా చివరి టోర్నీ. అలా అలా....).

సెంటిమెంట్ తప్పితే ఐ ఫీల్ వేరి హ్యాపీ.
Read On 5 comments

నా ఇంట్లో వాళ్లెఁవరంటే...

11:00 PM
అమ్మ, నాన్న, రెండు విలియమ్సూ, ఒక సాంప్రాసూ.

ఇంకా ఒక డోనాల్డూ, ఒక అగస్సీ, ఒక గ్రాఫూ. మరి నేనో! నేను కూడా. బాందా! నాకు చిన్నప్పటి నుంచీ స్పోర్ట్స్ అంటే ఇష్టం. సహజంగా మా వాళ్ళలో ఆటలా పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. మా నాన్న మాత్రం ఎప్పుడన్నా రేడియోలో క్రికెట్ వ్యాఖ్యానం వినే వారట. అది నాకు తెలీదులెండి. ఎందుకంటే అప్పటికి నేను పుట్టలేదు కదా.

మాది సంప్రదాయ కుటుంబం కావటంతో ఆటలూ, అవీ నిషిద్ధం. మా నాన్నా వాళ్ల కాలంలో బయట అలగా వాళ్ళతో ఎక్కడ తగువులు వస్తాయో అని ఆటలకు పంపేవారు కాదు. అందుకే ఐదు కిమీ స్కూలుకి నడిచి వెళ్ళే దారిలో ఎవరు ముందు వెళ్తారు అని తనూ, వాళ్ల అన్నయ్యా పందెం వేసుకునే వారట. అదే వాళ్ల ఆట. తరువాత క్రమంగా పెద్ద వాలయిన తరువాత అన్నీ పోయాయి. అందరికీ తెలిసిందేగా. 1986 లో టీవీ కొన్న తరువాత అప్పుడప్పుడూ వచ్చే లైవ్ కార్యక్రమాలు చూసేవారు. ఎలా మొదలయిందో నేనూ అడగలేదు, ఆయనా చెప్పలేదూ మా నాన్నకి వచ్చే ఆటలలో టెన్నిస్ బాగా నచ్చింది. అందులోనూ ఇవాన్ లెండిల్ ఆటతీరు నచ్చటంతో ఎప్పుడయినా టెన్నిస్ వస్తే ఆయన మిస్ కాకుండా చూసేవారు.

అలా ఒక రోజు చూస్తుండగా నేను బజారు నుంచీ వచ్చాను. నాకు ఏడేళ్ళు. విడిగా ఉంటే హోంవర్క్ చెయ్య మని చెపుతారేమో అని బుద్ధిగా నాన్న ఒళ్లో కూర్చుని "అది ఎవరు?" అని అడిగాను. వాడి పేరు మైకేల్ స్టిచ్, ఎదుటి వాడి పేరు బెకెర్ అని చెప్పారు. బెకేర్ అనే పేరు నాకు తమాషాగా అనిపించింది. అంటే వాడు కప్పలాగా బెక్ బెక్ అంటాడా అని అడిగాను. నాన్న నవ్వి బెకేర్ గూర్చి చెప్పారు. అది 1991 వింబుల్డన్ మెన్స్ ఫైనల్. నాకు ఇంట్రెస్ట్ గా అనిపించి మొత్తం మ్యాచ్ చూసాను.
అలా మొదలైన నా టెన్నిస్ ప్రయాణం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. 1991 లో స్టిచ్, 92 లో అగస్సీ, 93 లో సాంప్రాసూ ... ఇలా ఫేవరిట్ ఆటగాళ్ళు మారి పోయారు. కానీ నాకు రాను రాను సాంప్రాస్ అంటే ఇష్టం పెరిగింది. ఎంత ఇష్టం అంటే రోజువారీ మాటల్లో వాడే అంతగా. మా నాన్న గారికి అగస్సీ అంటే అభిమానం. అందుకే నాతో పోట్లాడే వారు సరదాగా. నేను సాంప్రాస్ ఆట ని సీరియస్ గా చూస్తుంటే ఆయన వచ్చి అగస్సీ గెలవాలనే వారు అయితే మేము మాటల యుద్ధమే కాదు ఎ రకమయిన యన్టీ కామెంట్స్ చేసు కునే వారము కాదు. నేను జస్ట్ చూడు నాన్నా సాంప్రాస్ గెలుస్తాడు అనే వాడిని. ఆయన నవ్వి ఊరుకునే వారు.
అఫ్కోర్స్ మన కోసం సాంప్రాసే ఎక్కువ సార్లు గెలిచాదనుకోండి. ఇలా యాంటీ గా 2000 వరకూ గడిచినా తరువాత మా స్పోర్టివ్ నెస్ చూసి దేవుడికి ముచ్చట వేసిందేమో విలియంస్ని పంపించాడు. వారి విషయంలో మా ఇద్దరికీ నో యాంటీ.
ఒక రోజు మా అమ్మ నన్ను అన్నానికి పిలవటానికి వచ్చింది. నేను కలిపి పెట్ట మన్నా. తినొచ్చు కదా అని అమ్మ అంటే నేను సీరియస్ గా విలియమ్స్ మ్యాచ్ వస్తోంది అన్నా. సరే అని అమ్మ అన్నం కలుపుకుని వచ్చి తినిపిస్తోంది. ఇంతలో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్ 2000 టైటిల్ గెలిచింది. (నేను హైలైట్స్ చూస్తున్నా).
"ఎవరా నల్ల ముండ అట్టా ఎగురుతోంది?" అమ్మ అంది. "ఆ అమ్మాయి పేరు విలియమ్స్. భలే ఆడుతుంది," అన్నా. అమ్మకి కొంచం ఇంట్రెస్ట్ కలిగి ట్రోఫీ ఇచ్చిందాకా కన్నార్పకుండా చూసింది. అప్పటి నుంచీ సిస్టర్స్ సిస్టర్స్ అంటూ అమ్మ ఎప్పుడయినా వాళ్ల మ్యాచ్ వస్తే చూడటం మొదలు పెట్టింది. ఇంట్లో ఆడవాళ్ళంతా సీరియళ్ళు చూస్తున్నా నేను టెన్నిస్ చూడాలి అంటే అమ్మా విలియమ్స్ మ్యాచ్ వస్తోంది అంటే అమ్మ నాకు సప్పోర్ట్ వస్తుంది.
మొత్తానికీ టెన్నిస్ రోజులలో సీరియళ్ళ బాధ తప్పిందన్న మాట. విలియమ్స్ వల్ల ఇంకో ఉపయోగం ఉంది. ఎప్పుడూ వంటింటిని పట్టుకునే ఉండే అమ్మ ఆ రోజుల్లో మాత్రం హాయిగా ఎవరికన్నా పనులు అప్పగించి కొంసేపు కూర్చుంటుంది. అమ్మా మీ పెద్ద సిస్టర్ ఆడుతోంది, చిన్న సిస్టర్ ఆడుతోంది అని పిలిస్తే పాపం తను ఇంట్రెస్ట్ గా వచ్చి కొంసేపు విశ్రాంతిగా కూర్చుంటుంది. అలా మా ఇంట్లో విలియమ్స్ కూడా ఒక భాగం అయినారు. గ్రాండ్ స్లాంస్ డేట్లు గుర్తు ఉంచుకుని ఎప్పుడయినా ఊరికి వెళ్తే ఫోనులో సిస్టర్స్ ఏమయ్యారు? అని వివరాలు అడుగుతుంది. అక్క చెల్లెళ్ళు లేని మాకు విలియమ్స్ వెరైటీ సిస్టర్స్ అయ్యారు.
మా అన్నయ్యకి ఆటలంటే అంత ఇంట్రెస్ట్ లేదు. వదినా పిల్లలు అంతే. పిల్లకి పద్మ వ్యూహం, పిల్లవాడికి jetix లో ప్రపంచాన్ని రక్షించడం. అంతే! ఎన్నయినా విమ్బుల్డనే వింబుల్డన్.
అందుకే నా ఇంట్లో వాళ్లెఁవరంటే... అమ్మ, నాన్న, రెండు విలియమ్సూ, ఒక సాంప్రాసూ. ఇంకా ఒక డోనాల్డూ, ఒక అగస్సీ, ఒక గ్రాఫూ. నేను కూడా.

వసుధైక కుటుంబం కదా!

సత్యమేవ జయతే!
Read On 7 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి