ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

Showing posts with label Books and Gal friends. Show all posts

బాబు ఆకుల "తెలుగు వెలుగు" లో నా కత చూస్తారా?

7:39 AM

"దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు." ఈ సామెత మనందరికీ బాగా తెలుసు. ఇప్పటికి సరిగ్గా ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియా మాస పత్రిక 'తెలుగు వెలుగు' లో నేను వ్రాసిన ఒక టపా ప్రచురితం ఐంది. ఇంతకీ నేను దొంగనా? లేక కుక్కనా?

కత వింటారా మాట కదా ఒకటుందీ అని నేను వ్రాసిన ఆ juvenile come technique ని "శ్రీ బాబు ఆకుల గారు" ప్రచురించారు. అందుకు వారికి మరొక్కసారి నా కృతజ్ఞతాభివందనాలు.
అప్పుడు నేను "సత్యమేవ జయతే" అనే పేరుతో ఉన్న బ్లాగ్ నడిపాను. అప్పట్లో వ్రాసిన పోస్ట్ అది. నా టపాలలో ఎక్కువ వ్యాఖ్యలు పడిన టపా కూడా. (అక్షరాలా తొమ్మిది).
ఇంత అయినా నాకు ఎన్నో చేదు జ్ఞాపకాలని మిగిల్చిన టపా కూడా అది. నాకు బాబు ఆకుల గారు ఆ కాపీని పంపుతానన్నారు. ఎంచేతనో నాకు ఆ కాపీ అందలేదు. దాంతో కొందరు నా ఫ్రెండ్స్ (అనుకునేవారు) అదంతా నా సృష్టేననీ, ఏదో సాఫ్ట్వేర్ ద్వారా నేనే వాటిని క్రియేట్ చేశాననీ కొంచం టాక్ పుట్టించారు. బస్. థాంక్యూ బాస్. అలా సాఫ్ట్వేర్ ని తయారు చేయగలిగితే అదీ నా ఘనతేగా! :-) అనుకుని వదిలేసినా కొందరు ఇంకొంచం ముందుకెళ్ళి నా పైన చేసిన వ్యక్తిగత దాడుల వల్ల నేను సాంతం నా ఐడీనీ మార్చివేసి The Inquisistor - సత్యాన్వేషి ప్రారంభించాను.
ఇంతకాలం ఎందుకు బ్లాగ్ లో పెట్టలేదంటారా? నేను అదో ఘనతగా భావించలేదు. నా గురి అంతా ఇంకా పైనే ఉంది. పైగా ఈ మధ్య మన బ్లాగ్మిత్రులు చాలా మంది గురించి 'ఆంధ్రజ్యోతి' లో రావటం, మరియూ నా స్నేహితురాలు ఈ మధ్య తగు మాత్రముగా 'ఉపదేశామృతం' చేయటం మూలానా, పోన్లే అని తన బర్త్డే ముచ్చటని కాదనటం ఎందుకులే అని, నాకూ కొంచం ఆశ పుట్టటం మూలానా ఇలా.
నిజం చెప్పమంటే అవీ కారణాలు. అబద్ధం చెప్పమంటే మా నాన్నగారు ఇంతకాలం చూడలేదు. నేను The Inquisistor - సత్యాన్వేషి ప్రారంభించే దాకా ఊళ్ళో లేరు. ఆయనకి నేను చూపినవి కేవలం "వింబుల్డన్ విలేజ్" మాత్రమే. నవతరంగం లో వ్రాసినవి చూపించినవి రెండే. త్యాగయ్య , శ్రీ లక్ష్మీ కళ గారి వ్యాఖ్యల కోసం ఒక టపా... అంతే. ఇవాళ ఎక్కడో మూలనున్న పుస్తకాలను దులుపుతుంటే పాత black and white ప్రింటు లో కనిపించాయట. మా అన్నని తరిమి ఇదో ఈ కలర్ ప్రింటు తీయించి స్కాన్ చేయించి సాయంత్రం నేను రాగానే నాకిచ్చి, ఇది పెట్టితేనే నేను నీ బ్లాగ్లో రామాయణం వ్రాస్తాను. లేకుంటే లేదు అన్నారు.
సరే ఆయన పుత్రోత్సాహాన్ని ఎందుకు కాదనాలి అనుకుంటూ అలా నెట్టుకి వచ్చి ఓ రెండు గంటలు తంటాలు పడ్డాక ఇదిదో (కత లో చూడండి) ఇలా.
నిజాన్నీ అబద్దాన్నీ వదిలేసి ఆ టపా సత్యం. అది బాగుందా లేదా అనే మీ స్పందన సత్యం. ఏమంటారు? దొంగలు పడ్డ ఆరు నెలలకి... చందాన... పోస్ట్ వచ్చిన ఆరు నెలలకి... అనరు కదా?
MANY HAPPY RETURNS OF THE DAY CHAITHI.
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను. మన వాళ్లంతా లేరు కదా. అందుకే క్రితం సారి పుట్టిన రోజులా నీ ఈ కొత్త పుట్టిన సంవత్సరం సాగిపోవాలని... మన్ స్ఫూర్తి గా ఆకాంక్షిస్తూ...
భారంగా ఉందా? ఐతే ఇది విను, నీ చెక్క మొహం కనీసం టేకు చెక్కలా అన్నా ఉపయోగ పడాలని కోరుకుంటూ...
విన్నపం: మీరూ చైతన్య కల్యాణి (నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు) కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పండి.
P. S. : మరో టపా కూడా ఆ తరువాత నెలలో ప్రచురితం ఐంది. దాన్ని ... ఆ (అంతొద్దు) ఇది చాలు అని ఎవరూ అనక పోయినా నేనే అనుకుంటున్నాను.
Read On 2 comments

మన గురించి మనకే తెలిపే దమ్మున్న పుస్తకం ఇది.

1:03 AM

చాలా కష్టపడి సంపాదించిన పుస్తకం. దానికి తగ్గ మజానే, అనుభూతినే, ఆలోచనలే నాకు కలిగించింది.

ఆ పుస్తకం పేరు 'పెంట్ హౌస్ లెజెండ్'. అది రచయిత పెట్టుకున్న, మనసు పడ్డ పేరు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒక తలుస్తాడు అనేది మనకందరికీ తెలిసిందే. అలా ఆ పుస్తకం పేరు 'Night of January 16th' గా మారి పోయింది. చివరికి అలాగే స్థిరపడి పోయింది.

ఆ కథ కూడా ఇంకో క్రొత్త కథ. దాని గురించి తెలుసుకోవాలన్నా ఈ పుస్తకాన్ని చూడాల్సిందే.

'Night of January 16th' ఒక డ్రామా. కోర్ట్ రూమ్ లో నే ప్రారంభం అయి అందులోనే కొనసాగి అందులోనే ముగిసే అద్భుతమైన డ్రామా. దీనికున్న ప్రత్యేకత ముగింపు మనకిష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. మన మనసుకి ఎలా అనిపిస్తే... కాదు కాదు. మన మనోఫలకం పైన ఎలాంటి భావాలున్తాయో అలాంటి ముగింపుని మనం ఇవ్వవచ్చు. అందుకే ఇది మన మనసి చిత్రాన్ని మనకే గీసి చూపే చిత్రకారుని వంటి పుస్తకం.

కథ ఏమిటంటే... (డ్రామా ప్రధానాంశం) Bjorn Faulkner అనే ఒక bussinessman తన ఇన్వెస్టర్లని ముంచేస్తాడు. ఇంతలో అతను ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ అది ఆత్మహత్య కాదు. అతనిని అతని మాజీ priyuraalu Karen Andre చంపిందని ఆమెని accuse చేస్తారు. ఆ murder trial trial ఈ డ్రామా ప్రధానాంశం.

డ్రామా అంతటిలోనూ హీరో/విలన్ (మన మనసుని, మన జీవిత దృక్కోణాన్నీ అనుసరించి) ఐన Bjorn Faulkner కనపడదు. కానీ కథాంశం అంతా అతని మీదే. A sense of life గురించే, అతని జీవన గమనం ఆధారం గా రచయిత్రి vivaristhundi.

డ్రామా అంతా for/against సాక్షుల విచారణ, చివరికి తీర్పు అంతే. వేరే ఏమీ ఉండదు.

తీర్పుని ఆ రోజుల్లో ప్రేక్షకులలోనుంచీ select చేసిన jury ఇచ్చే విధం గా ఉండేది. మన చ్గాదవటానికి మాత్రం ఆ తీర్పు మనమే ఇవ్వాలి.

for/against వాదనలు రెండూ చాలా balanced గా రెండువైపులా నిష్పాక్షికంగా ఉండటం లో..., ఎక్కడా 'చదువరి'/ప్రేక్షకుని influence చేయని విధం గా మలుచటం లో రచయిత్రి విజయం సాధించిందని అనటం చాలా చిన్న మాట. (అసలు ఇలాంటి వాటిని స్త్రీలే సమర్ధంగా వ్రాయగలరు. ఒప్పుకుని తీరాలి).

మన తీర్పు మన జీవన దృక్పథాన్ని అనుసరించే ఉండాలని రచయిత్రి నియమం పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన value judgements ని ఒక్క క్షణం లో నిర్ణయించుకోవటమే. The metaphysics of our life at a glance.

ఇందులో ఒక అద్భుతమైన dialogue ఉంది. దాన్ని చదివి మనం ఈ పుస్తకాన్ని చదవాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు.

"మనిద్దరిలో ఒకరే నిజం చెపుతున్నారు. అదెవరో మనిద్దరికీ తెలుసు."

Heroin/Villain Karen Andre, మొదటి act చివరిలో విలన్/హీరోయిన్ Nancy Lee Faulkner తో అంటుంది.

Artist తన కళని with liberty స్వీకరించే అవకాశాన్ని ఇవ్వటం చాలా అరుదు. ఆ అవకాశాన్ని మనకి Ayn Rand ఇచ్చింది. ఇక చదవటం మనదే ఆలశ్యం.

విన్నపం: నా రీవ్యూ చూసి మాత్రం ఎవరూ పుస్తకాన్ని చదవవద్దు. మీ judgement మీద depend అయి చదవండి. అదే రచయిత్రికీ, నాకూ ఇష్టం. లేనిదే ఆ పుస్తకం యొక్క లక్ష్యం నెరవేరదు.


హెచ్చరిక: "It's not a question of right or wrong. It's only whether cou can do it or not."

అనేది కథకి ఆయువు పట్టు లాంటి dialogue. దాని గురించి రచయిత్రి వ్రాసిన ముందు మాట చదివితే మనకి అర్ధం అవుతుంది. లేకుంటే అపార్ధం అవుతుంది. అందులోనూ ఈ మధ్య జరిగిన సంఘటనలని చూశాక.
Read On 3 comments

ప్రియా ప్రియా చంపోద్దే!

2:36 AM
మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చేసేది. నేను కొంచం బలహీనుడిని ఐతే. నేను శారీరకంగా సన్నగా ఉన్నా, మానసికంగా ద్రుఢమ్ గానే ఉంటాను. అందువల్లే మళ్ళీ నా సహజ శైలిలోకి రాగలిగాను. (బ్లాగుల వ్రాతల విషైకంగా కాదు. మానసికంగా.

ఇంకా వాడి మాటలు నా మనసులో మారోమ్రోగుతూనే ఉన్నాయ్. "నువ్వే అంతా చేశావ్. సుఖంగా ఉన్న నా ప్రాణాన్ని కష్టాలలోకి నెట్టుకున్నాను. నువ్వింకోసారి నాకు కనపడకు."

వెల్. నేను కనపడను. దాంతో అంతా అయిపోతుందా? వాడి ప్రాణం సుఖ పడుతుందా?

సతీష్ నాకు నెల క్రితం కనిపించి, "ఏరా నాకో వెయ్యి ఇస్తావా?" అన్నాడు. నిజానికి వాడికి ఇవ్వటానికి వెయ్యి ఎక్కువేం కాదు. నాకు చాలా సార్లు వాడిచ్చాడు. నాకు సాధారణంగా ఇవ్వటానికి ఉంటే ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తాను. (అందరికీ కాదు). ఆ రోజెందుకో అడిగాను. "ఎంట్రా విషయం?" అని.

"రేపు జ్యోతి బర్త్డే. తనకి ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని."

"నీ దగ్గర లేవా ఏంటి? అయినా బర్త్డే గిఫ్ట్ కోసం వెయ్యి ఎందుకురా?" (మా ఏజ్ ని బట్టీ అంత అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాం. కొంతవరకూ అమ్మా, నాన్నల మీద ఆధార పడి బ్రతుకుతున్నాం.)

"శాలరీ ఇంకా రాలేదు. ఇంట్లో పాకెట్ మనీ ఇవ్వలేదు.నాన్నగారు ఊళ్ళో లేరు. అందుకని..."

"నువ్వు నా దగ్గర నసగక్కర్లేదు. తీసుకోరా," అంటూ ఇచ్చేశాను. అంతటితో ఆగి ఇంతే ఈరోజు ఈ టపా పుట్టుండేది కాదు. నాకు మాటలు తప్పేవి.

"రేయ్ సత్తీ! ఎప్పుడూ నువ్వే బిల్స్ పే చేస్తున్నావని విన్నాను. ఒక్కోసారి తననీ కట్టనీ. ఎందుకంటే నువ్వూ, తనూ ఇద్దరూ కూడా పేరెంట్స్ మీద పార్శియల్లీ డిపెండెంట్. చెరో సారీ పే చేస్తే బర్డెన్ ఉండదు ఎవరో ఒక్కళ్ళ మీద."

వాడికి నా సంగతి తెలుసు. సాధారణంగా నేను చెప్పినవి ఏవైనా కాదనడు. కొంచం రీజన్ మీద బేస్ అయి ఉంటానని వాడికి తెలుసు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకమ్మాయిపుట్టిన రోజైతే అందరూ పార్టీ అడిగారు. సమయం వచ్చినప్పుడు నా జేబుకూ బొక్కడుతుందని నేనొక సలహా ఇచ్చాను.

"అందరం పేరెంట్స్ మీద ఆధార పడ్డవాళ్ళం. పుట్టిన రోజైతే ఇలా పార్టీలు అడిగిభాయ పెట్టేకన్నా పుట్టిన రోజు పార్టీకి మనమే తలా కొంచం స్పెండ్ చేసి తనకే పార్టీ ఇద్దాం. మనకీ అంత బర్డెన్ ఉండదు. తనూ హ్యాపీగా ఫీల్ అవుతుంది."

అప్పటి నుంచీ ఎవరిదన్నా పుట్టిన రోజోస్తే మిగతా వాళ్ళం అందరం తలా కొంచం స్పెండ్ చేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. ఒక్కళ్ళే ఐతే అంత పెద్ద మొత్తం రాదు. కొంతమందికి ఆర్ధికంగా ఇబ్బంది కావొచ్చు. అదే ఇలా ఐతే చక్కగా ఎవరికీ అంత బర్డెన్ కాదు. ప్లస్, అసలు వ్యక్తికి తనకి మన వాళ్లు అందరూ నాకోసం స్పెండ్ చేస్తున్నారనే ఆనందం ఉంటుంది.

సరే! అసలు సంగతి. మా వాడు ఆసారికి ఏదో గిఫ్ట్ పెద్దదే ఇచ్చి గ్రాండ్ గా పార్టీ ఇచ్చుకున్నాడు తన లవర్ కి. వారం తరువాత ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడు బిల్ విషయం లో నేను చెప్పిన మాటలనే తను తన వాయిస్ గా చెప్పాడు. ఐతే ఆ అమ్మాయి వాడి మాటలని 'అర్ధం' చేసుకుని "ఇంత పిసినారి వాడిని ఎక్కడా చూడలేదు. ఇప్పిదే స్పెండ్ చేయని వాడివి రేపు పెళ్ళయిన తరువాతేమి స్పెండ్ చేస్తావ్?" అని విసుక్కుని వెళ్లి పోయింది. తరువాత మా వాడు చాలా సార్లు ఫోనులో మాట్లాడటానికి ట్రై చేసినా ఫోను లిఫ్ట్ చేయలేదా అమ్మాయి. నాల్రోజుల తరువాత ఆ పిల్ల కనబడితే వీడు విషయం అడిగాడు.

"నీలాంటి సోంబెరిగాదితో నాకు మాటలనవసరం. ఆడదాని సోమ్మునాసించే వెధవవి. ఇక నాకెప్పుడూ కనబడకు." అని వెళ్లి పోయింది. మావాడు ఆమాటలను సీరియస గా తీసుకున్నాడు. మర్నాడు మేము విన్నదేమిటంటే వాడు సూసైడ్ attempt చేశాడని.

నేనూ, ఇంకో ఫ్రెండూ వెళ్లి అడిగాము. అప్పటికి వాడు హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఏదో ముభావంగా మాట్లాడి నన్ను పంపేశాడు. వీక్ గా ఉన్నాడు కదా అని నేను వచ్చేశాను. మర్నాడు నాకు ఫోనులో క్లాస్. చివరికి వాడి ప్రేమని నాశనం చేసిన పాపం నాదే అనీ, నా egotistic నేచర్ వల్లే వాడికి అలాంటి పాడు సలహా ఇచ్చానని. నాకు వాడి మీద ఉన్న అసూయ వల్లే ఆ పని చేశాననీ.

ఇదంతా విన్న ఇమ్రాన్ అమ్మాయిలంతా అంతే ననీ, డబ్బు పెట్టినంతకాలం మనతో ఉంటారనీ, ఆ తర్వాత వదిలేస్తాడనీ నాకు ఉపదేశామృతం చేశాడు కొత్త థియరీ. మామూలు మూడ్ లో నా ముందు ఇలాంటి మాటలు ఎవరూ అనలేరు.

నాకు అప్పుడు ఆ మూడ్ లో వాడు చెప్పేది నిజమేమో అన్పించింది.

దాంతో నేను రెండు రోజుల పాటూ మా వాల్లనేవరినీ కలవలేదు. కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయలేదు. దాంతో మొన్న చైతి నెట్ సెంటర్లో కనపడి. ఫోనుకూడా ఎత్తటం లేదేంటి అని అడిగింది. నేను ముభావం గా ఏమీలేదని తప్పించుకోజూశాను.

తను వదలకుండా నా వెంటే వస్తూ జూస్ త్రాగుదాం రమ్మంది. నేను మాట్లాడకుండా వెళ్ళ బోయాను. తను నా ప్రక్కనే నడుస్తూ ఇమ్రాన్ కి ఫోను చేసి విషయం కనుక్కుంది. "వాడేదో ఫ్రస్ట్రేషన్ లో ఏదో కూస్తే నువ్వెందుకు మమ్మల్ని ఎవాయిడ్ చేయాలి? వాడి బుర్ర లో గుజ్జే లేదు అనుకున్నా, ఈ మధ్య వాడు చేసే పనులని చూసి. ఇప్పుడు మట్టి కూడా లేదు. అంతా వాక్యూమ్ ఉందని అర్ధం అయింది. అయినా అట్లాంటి అమ్మాయినా వాడు ప్రేమించేది. ఆ మాత్రం అండర్ స్టాండింగ్ లేని పిల్లనే వాడు ప్రేమించాదంటేనే అర్ధం కావటం లేదూ వాడు మెదడు పాడిందని." అంటూ నన్ను ఒదారుస్తున్నదనుకుని కష్టపడి పోతున్నది.

నేనూ సీరియస్ గా మొహం పెట్టి అన్నా"సరే! పద వెళ్దాం. నేనోదిలేశాను వాడి సంగతి."

నాకు అర్ధం కానివి రెండు ఉన్నాయి. ప్రేమించిన వాడి జేబుకి బొక్కేయదమేనా అమ్మాయిల పని? (అందరూ కాదు. నాకు ఆ విషయం తెలుసు. నాకలాంటి అమ్మాయిలూ ఎదురవలేదు కూడా. అర్ధం చేసుకునే వాళ్ళనే ఎక్కువ చూశాను. లేదా మీక్ పర్సన్స్ ని చూశాను.)

ఒకమ్మాయో, లేదా ఒకబ్బాయో ఏదో చేస్తే అందరినీ అదే గాటన కట్టటం సమంజసమేనా? ఈ జనరలైజేషన్లు నాకు నచ్చవు. ఇమ్రాన్ గాడికి ఓ సారి నేను 'ఉపదేశామ్రుతాన్ని' బోధించాలి. ఈ మధ్య నేను ఎక్కువ వింటున్నాను. తక్కువ చెపుతున్నాను.

గమనిక: ఇదంతా నిజంగానే ఈ మధ్యే జరిగింది. పేర్లు మార్చాను. (అబ్బాయిలవీ, మొదతమ్మాయిది). ఎవరినీ నొప్పించేందుకు కాదు వ్రాసింది. ఇలా కూడా జరుగుతున్నాయేమితా అనీ, నేనేమన్నా తప్పుచేశానా అనీ... (రాస్తే అర్ధం అవుతుందని).
Read On 6 comments

సెహ్వాగ్ - హర్భజన్

7:59 AM
వీరేంద్ర సెహ్వాగ్ కి తానూ ఢిల్లీ నుంచీ వచ్చానని మహా పొగరు. ఆ పొగరంతా సర్దార్జీ ఐన హర్భజన్ మీద చూపుతుంటాడు. ఐతే మన భజ్జీ కూడా తక్కువేమీ తినలేదు.

ఒకసారేమైందంటే...

"నేను దేశ రాజధాని నుంచీ వచ్చాను. మా నగరం లో ఎందఱో దేశ భక్తులు జన్మించారు. ఒకవేళ జన్మించక పోయినా వారందరూ మా నగరం లో ఉన్నారు." అని సెహ్వాగ్ అన్నాడు.

"రాష్ట్రం లోనూ తక్కవా 'కేసరి' అనే బిరుదు పొందిన వ్యక్తీ మా సొంతం" దానికి సమాధానంగా భజ్జీ.

ఐతే మనం ఒక పందెం వేసుకుందాం. ఎవరురాష్ట్రాల వారి దేశ భక్తులని వారు చెపుదాం. చెప్పిన ప్రతీసారీ అవతల వారి ఒక వెంట్రుకని పీకాలి." (సెహ్వాగ్ కి భజ్జీ పొడుగు వెంత్రుకలంటే కొంచం అసూయ.

భజ్జీ ఓకే అన్నాడు.

పందెం మొదలైంది. ముందు భజ్జీ ఒక పేరు చెప్పి సెహ్వాగ్ వెంట్రుకని పీకాడు. ఈసారి వీరు వంతు. తానొక పేరు చెప్పి భజ్జీ వెంట్రుకని పీకాడు. కొంత సేపటికి భజ్జీకి పేర్లు తట్టటంలేదు. మధ్యలో వీరూ కొందరు పంజాబీలని ఢిల్లీ లో ఉన్నారనే సాకుతో కబ్జా చేసి భజ్జీ వెంత్రుకాలని పీకాడు. సందర్భంలో వీరూ లాలా లజ్పత్ రాయ్ పేరుని కూడా కబ్జా చేశాడు. దాంతో భజ్జీకి మండింది.

కొంసేపు ఆలోచించి, తన వంతు రాగానే 'జలియన్ వాలా బాగ్' అని వీరూ జుట్టు అంతా పీకేశాడు. అప్పటి నుంచీ సెహ్వాగ్ మనకి గుండుతోనే దర్శనం ఇస్తున్నాడు.

ఇది మా ఫ్రెండ్ చైతన్య చెప్పింది. జోక్ ట.

:నోట్: సరదాకి మాత్రమే వ్రాసింది. వీరేంద్ర సెహ్వాగ్ అలాంటి వాడు కాదు. పైగా భజ్జీ వీరూ ఫ్రెండ్స్. గంగూలీ శిష్యులు కూడా.
Read On 1 comments

జమీల్య - 2

12:11 AM
పున్నమి (నా భాషలో చెప్పాలంటే జమీల్య) చెప్పుకుంటూ పోయింది.

"'జమీల్య' ఎంత అందమైన పేరు? అసలు ఆ కథ సొగసంతా ఆ పేరులోనే ఉంది. చిన్ఘిజ్ ఐత్మాతోవ్ అద్భుతంగా చెప్పాడు కథని. సయ్యద్. ఒక చిన్న పిల్లడు. అతని మాటల్లోనే రచయిత తన కథని నడిపిస్తాడు. అంటే first person narration అన్న మాట."

నేను 'తమ్ముడి మాట' అనబోయి తమాయించుకున్నాను. ఆ కోకిల పాటకి అడ్డు రాకూడదని.

తను కొనసాగించింది. "మనిషి హృదయాన్తరాళాల్లో ఏ మూలో దాగున్న భావుకతని తట్టి లేపే కథ అది. జమీల్య ని సాదిక్ బలవంతంగా ఎత్తుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అదెలాగంటే... జమీల్య తో ఒక సారి గుర్రప్పందేలలో ఒడి పోతాడు సాదిక్. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనని బలవంతం గా ఎత్తుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటాడు.

"అసలు మగాళ్ళంతా ఇంతేనా? అనిపిస్తుంది చాలాసార్లు. ఆడవాళ్ళు తమ మీద గెలిచినా వారికది అవమానమే! తట్టుకోలేరు. చేతనైతే గెలవాలి. లేదా ఓటమిని హుందాగా అంగీకరించాలి. సాదిక్ కి అది తెలీదేమో. ఐత్మాతోవ్ మనకా మాటని అంతర్లీనంగా చెప్తాడు. సయ్యద్ రూపంలో.

జమీల్య. తన పేరుకు తగ్గట్టుగానే అందమైంది. ఎంత అందమైంది? తన జీవితాన్ని ప్రేమించుకునేటంత అందమైంది. 'ఆమె స్వాభావం లో ఏదో మగవాళ్ళ లక్షణాలు, అదొక మోస్తరు దుడుకుతనం...తనని అకారణంగా పల్లుట్టు మాటైనా అంటే ఊరుకోడు. వాళ్ళని నోరేత్తనీయకుండా మొహం మీదే నాలుగూ అనేసేది' అని మనకి సయ్యద్ చెపుతాడు.

"ఇరుగు పొరుగు అమ్మలక్కలు తన అత్తగారికి చెపితే ఆమె సమర్ధనగా 'ఇదే మంచిది లెండి. మా కోడలు ఉన్నమాట చెపుతుంది. అనేదేదో మొహం మీదే అంటుంది. ఇదే నయం. ఎదుట నోరు నొక్కుకుని చాటున తిట్టటం కంటే. మీ వాళ్ల మౌనం ఓ నటన. ఆ మౌనం - కుళ్ళిన కోడి గుడ్డు: పైకంతా నునుపూ, నిగనిగా. ఇహ లోపలా - ముక్కు మూసుకోవాల్సిందే.' అంతటి అభిమానం. (అయినా...). అలా ఐత్మాతోవ్ మనకి జమీల్యాని పరిచయం చేస్తాడు.

"అసలు జమీల్యా అమ్మాయిలకి డ్రీం గాళ్. ఏ మాయామర్మమూ తెలీని, చిన్నపిల్ల లాంటి మనస్తత్వం. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తటాలున నవ్వటం! చెంగు చెంగున లేడి పిల్లలా గెంతతం. కాలాగాడు మరి. అత్తగారిని కావిలించుకుని చిన్న పిల్ల లా ముద్దెట్టటమ్. అబ్బ! అలా ఉండాలనీ, అంత హాయిగా జీవించాలనీ ఎవరికి ఉండదు.

"అందుకే జమీల్యా సయ్యద్ కి నచ్చింది. తనకి వదినె గారవుతుంది. బిడియం అంటే తెలీని తానంటే గ్రామంలో అందరికీ అంగీకృతం కాదు. అంతే గా తన జీవితాన్ని ప్రేమించటం అంటే ఈ లోకం లో ఒక నేరం. అలాటి వారిని అందరూ అంగీకరించలేరు.

"అవునబ్బాయ్! నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకున్టున్నావ్?" ప్రావాహానికి ఆనకట్ట వేసినట్టు అడిగింది. నా కళ్ళలోకి చూస్తూ.

"నీకేలా తెలుసు?" అడగ బోయాను. వెంటనే తను ఒక దయ్యం అనీ, తనకి ఆ మాత్రం తెలీటం ఆశ్చర్యం కాదనీ నాకు గుర్తొచ్చింది. అందుకే నేను "ముందు నువ్వు చెప్పు. తరువాత నేను చెప్తాను." అన్నా.

తను నిట్టూర్చింది. మళ్ళీ కొనసాగించింది. "చంటీ! ఆడ పిల్లలు కనిపిస్తే అబ్బాయిల కళ్లు ఎక్కువ గా స్కాన్ చేయాలనే ప్రయత్నిస్తాయి. యుద్ధం రోజులయి, ఆ ఊరిలో అందరూ అంటే చాలా కుటుంబాలలో వయసున్న వారిని సైనికులగా పంపాల్సి వచ్చేది. ఊళ్ళో మిగిలేది సంనాసులూ, చిన్న పిల్లలూనూ. అందరి కళ్ళూ జమీల్య మీదే.

"కొందరు సంనాసోల్లకి తానంటే ఏ ఆడదైనా పడి చస్తుందని ఒకరకమైన ఫీలింగు. అలాంటి వారు ఎక్కడైనా ఉంటారు. అలాంటి వాడే ఒస్మాన్. వాడొకసారి తనని అల్లరి పెట్టబోతే జమీల్యా అన్న మాటలు నాకెంత నచ్చాయో. 'యుద్ధం నుంచీ తిరిగి రాని సైనికుని భార్యగా నూరేళ్ళూ ఉంటానుకానీ నీ లాంటి చచ్చు దద్దమ్మ మొహం మీద ఉమ్మనైనా ఉమ్మను.'

ఇది కాదు. తన మనోభావాలని మనం చదవాలి. ప్రేమ లేని పెళ్లి ఎంత గొప్ప కుటుంబం లోకి తీసుకెళ్ళినా జమీల్యా లాంటి అమ్మాయి ఎక్కువ కాలం ఉండలేదు. అందుకే దనియార్ మీద తనకి ఉన్నది ప్రేమే అని గ్రహించగానే బంధనాల అడ్డుతెరాలు తొలగించుకుని వెళ్లి పోయింది.

"సాదిక్ తన ఇంటికి సైనిక స్థావరం నుంచీ ఉత్త వ్రాసే సన్నివేశాన్ని ఐత్మాతోవ్ చాలా బాగా చెప్తాడు. సంప్రదాయ బద్ధం గా పెద్దలందరికీ తన నమస్కారాలను చెప్పి చివరలో 'జమీల్యాని కూడా అడిగానని చెప్పండి.' అంటాడు. అక్కడే తనకి భార్య మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అక్కడ సయ్యద్ భావాలని చదివితే అంతర్లీనంగా ఐత్మాతోవ్ ఎలాంటి సెటైర్ వేశాడో మనకి తెలుస్తుంది.

"ఇది కాదు చంటీ! అసలు విషయం ఇప్పుడు చెప్పుతాను."

నేను నాకు తెలీకుండానే ఆ మాటలని మంత్ర మ ఉగ్దుందిని అయి వింటూనే ఉన్నాను. నేను ఎప్పుడు వాలానో తెలీదు కానీ ఆ స్మశానంలో ఓనా ఎడమ అరచేతిలో తల పెట్టుకుని అలా వింటూనే ఉన్నాను.

నేను వింటున్నానో లేదో అని ఒక సారి చూసి తను నవ్వింది. "ఎందుకు నవ్వావ్?" అడిగాను.

"నువ్వెక్కడ పడుకున్నావో తెలుసా?"

(సశేషం)
Read On 1 comments

"జమీల్య"

6:00 AM
ఆ మర్నాడు నన్ను నేను సెల్లు లో కనుగొన్నాను. అలా ఎందుకయ్యిందో తరువాత చెపుతాను. అంతకు ముందు ఓ పడి గంటల క్రితం నేను ఆ దయ్యం తో అన్నాను. "నీ పేరు నాకు నచ్చలా."

"ఎందుకు?"

"పున్నమి, 'పున్నామ నరకం' లాగా ఉంది. అందులోనూ నాకు పున్నమి చంద్రుడు నచ్చడు."

ఎవరో కిసుక్కున నవ్వినట్టు అనిపించింది. ఎవరా అని తల త్రిప్పి చూశాను. ఒక తలలేని ఆకారం. ఆడ దయ్యమే అనుకుంటా. "ఓరబ్బీ! నీగ్గానీ దిమాక్ఖరాబ్ గానీ ఐతున్నదా? అట్లగైతే నిన్ను ఎర్రగాద్దకి పంపాలె!" అంటూ నా మీదకి వచ్చింది. ఎంత చావాలనిపించినా ఆ తల లేని దయ్యాన్ని చూసి వెన్నులో ఒణుకు వచ్చింది. "బాబోయ్!" అని కేక వేయబోయా. "ఏయ్! సోనియా గాంధీ నువ్వూరుకో! తను నా ఫ్రెండ్." పున్నమి అంది.

తను కూచింది తన శవ పేటికలో. "ఎందుకట్టా లేచావ్?" అడిగాను. భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ.

"పున్నమి సెంద్రుడు నచ్చట్లేదంటవ్? ఎర్రి నా కొడుకల్లె ఉన్నవ్ బిడ్డా!"

"ఓరి నాయనోయ్! నువ్వు తెలంగాణా దయ్యానివా? యాస సరిగ్గానే ఉందా?"

"అదా! నేను ఆ యాసని ట్రై చేస్తున్నాను. 'మళ్ళీ తెలంగాణా దయ్యం' అనకు. కేసీయార్ ఎగిరి తంతాడు." అంది సదురు సోనియా గాంధీ. "తను ఎక్కువ గా పున్నమి రోజుల్లోనే లేచి తిరుగుతుంది. అందుకే ఆ పేరు పెట్టాము."

"అంటే పూర్వ నామదేయాలు కూడా ఉంటాయా మీకు?"

"ఉన్నాయి అమ్మా నాన్నా పెట్టిన పేర్లు. ఇక్కడ మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాము."

పున్నమి మా సంభాషణని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అందుకే మేలి ముత్యాలు ఒలక పోస్తున్నట్టు చిరు నవ్వులు చిందిస్తోంది. నెల రాజు 'తిండి తిని నెల రోజులయ్యింది' అన్న టైపులో మొహం పెట్టాడు. ఆమె ముందు వెల వెల పోతున్నందుకు.

"మరి నీ పేరు సోనియా గాంధీ ఎందుకు?" వినాశ కాలే విపరీత బుద్ధి అనుకుంటూ. ఎక్కడ అది నా మీద పడుతుందో అన్న భయం ఉన్నా నా చావు ఎప్పుడొచ్చినా ఏమిటి నష్టం అనుకుంటూ ధైర్యంగా ఉన్నా.

"దానికి బుర్ర లేదని ఆ పేరు పట్టాము కానీ, రా చంటీ! మనం మాతాడుకుందాం," అంది పున్నమి.

"నిన్ను నేను ఏమని పిలవను?"

"పున్నమి నచ్చలేదన్నావుగా! నువ్వే పేరు పెట్టు."

"జమీల్య!"

"చాలా బాగుంది. దాని అర్ధం తెలుసా?"

"తెలుసు. అరబ్బీలో 'అందమనది' అని అర్ధం."

"అబ్బో! చంటి బాబు కి అరబ్బీ కూడా వచ్చే?"

"రాదు." ఏడుపు మొహంతోఅన్నాను. "ఆ పేరు చిన్ఘిజ్ ఐత్మాతోవ్ వ్రాసిన ఒక నవల లోది. హీరోయిన్ పేరు. నాకుబాగా నచ్చిన పేరు అది."

"అబ్బో! అయ్యగారు కళా పోషకులే!" కళ్లు పెద్దవి చేస్తూ ఎక్కిరించింది.

"నీకా కథ తెలుసా?"

"చదివాను. ఈ మధ్యే! ఒక శాపులోనుంచీ కొట్టేసి. ఆ హీరోయిన్ నాకూ బాగా నచ్చింది. నాకూ తనలా ఉండాలనిపించింది."

"ఐతే ఆ కథ చెపుతావా?"

"చదివానన్నావ్?"

"నీ మాటల్లో వినాలనీ..."

"సరే! విను" అంటూ మొదలెట్టిందికాదు కానీ ఆ కథ గురించి చెపుతాను. అయినా ఇది చెప్పు. నీకు పున్నమి అన్న నా పేరు ఎందుకు నచ్చ లేదు?"

"నాకు పంచమి చంద్రుడంటే ఇష్టం."

"గురుడికి తిక్కేమన్నా ఉందా?"

"కాదు పంచమి చంద్రుడు ఎలా ఉంటాడు?"

ఇలా అంటూ గాల్లో చూపించింది. నిజంగానే అక్కడ ఆ ఆకారం నాకు గాల్లో కనిపించింది. సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను.

"ఇలా కదా! అలా చూడు. నవ్వుతున్నట్టు లేదూ! అదే పున్నమి చంద్రుడు అదోలా నోరు తెలుచుకుని నిద్దరోతున్న న్యాయం లా ఉంటాడు. అదీ కాక కొంచం ఏడుపు సింబల్లా!"

"నీలోనూ విషయం ఉందబ్బాయ్! ;-) కానీ ఏడుపు సింబల్ సరిగా లేదేమో! కథ విను." ముగ్ధ మనోహరంగా నవ్వింది.

ఆ కలకూజిత స్వరం లోనుంచీ ఆ కథ గురించి ఇలా విన్నాను.

(సశేషం)
Read On 2 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి