ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

Showing posts with label ఇప్పుడే కొత్తగా.... Show all posts

And the Winner is...

10:35 AM

ROGER FEDERER

వింబుల్డన్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఫైనల్ లలో ఒకటిగా నిచిపోయే ఈ నాటి ఆటలో

5-7, 7-6, 7-6, 3-6, 16-14 తేడాతో విజేతగా ఆవిర్భవించి చరిత్రలోనే తిరుగులేని ఆటగాడిగా నిలిచిపోయాడు.

దీంతో పాటూ, మహిళల WILLIAMSDON (2009) లో సెరెనా డబుల్స్ కూడా గెలిచి తన ఆధిపత్యాన్ని చాటింది.
Read On 9 comments

శిఖరం

8:28 AM
OLYMPIC TENNIS





"Be formless... shapeless, like water. If you put water into a cup, it becomes the cup. You put water into a bottle; it becomes the bottle. You put it into a teapot; it becomes the teapot. Water can flow, and it can crash. Be water, my friend..." ----- Bruce Lee.


ఒలింపిక్స్ లో చైనా తన సత్తా చాటింది. ఎట్టకేలకు తను కోరుకున్న శిఖరాన్ని అధిరోహించింది. అమెరికాని పడగొట్టి, తన ప్రతాపాన్ని ప్రపంచానికి రుచి చూపించింది. చిత్రం అమెరికా పతకాలూ స్వర్ణాలూ గతంలోకన్నా ఏమీ తగ్గలేదు. మనిషి పర్వతాన్ని అధిరోహిస్తాడు కానీ పర్వతం సైజుని తగ్గించలేడుగా...


ఒక విజేతగా నా "వింబుల్డన్ విలేజ్" లో టెన్నిస్ కన్నా ముందు తన గురించి చెప్పించుకుంది. చిత్రమెంతో తెలుసా! చైనా లో మన 'సై'నా తన పట్టుదలని చూపి క్వార్టర్స్ దాకా వెళ్ళింది.


హిమాలయ శిఖరం ఉంది. ఉపయోగం? దాన్ని ఎక్కిన మనిషి ఉన్నాడు. మరి?


శిఖరాలూ, సముద్రాలూ, నక్షత్రాలూ, ఆకాశాలూ, సింహాలూ చాలా ఉంటాయి. అయితే వాటిలో గొప్పతనం ఏదీ లేదు. హిమాలయాల్ని జయించిన మనిషి గొప్ప. టెన్జింగ్ నార్గే, Edmund Hillary EVEREST ఎక్కిన మొనగాళ్ళు.


సముద్రం సవాల్ విసిరితే మనిషి ఓడని తయారు చేశాడు. నక్షత్రాలకే Limit పెట్టాడు మానవుడు (Chandrasekhar Limit). ఆకాశం అంచుల్లో విహరిస్తూ అద్దానిని లొంగదీయాలనే ప్రయత్నం చేసే మనిషికి ఒక పర్వతం, పేరు Alps* అట. సవాల్ విసిరింది. పచ్చిక బయళ్ళలో తనకు తిరుగు లేదని. కానీ Alps ఉండటం గొప్ప కాదు. దాన్నెక్కే Bull* ఉండటం...


అదే జరింగింది మొన్నటి వింబుల్డన్లో. Federer ని జయించిన Nadal మానవ సామర్ధ్యానికి Limit లేదని చాటాడు.


వింబుల్డన్ సామెత: "మానవుడే మహనీయుడు."


వింబుల్డన్ లో Federer ని ఓడించిన Nadal ఒలింపిక్స్ లోనూ తన ప్రతాపాన్ని చూపెట్టాడు. సింగిల్స్ లో స్వర్ణం గెలవటం కాదు. సగర్వంగా తానే ప్రస్తుత టెన్నిస్ లోకంలో Number One అని చెప్పలేదు. చూపెట్టాడు.
ఆహా! Bull Alps ఎక్కింది. మరి Alps మాత్రం తక్కువా... తనని గెలిచిన Bull కి తన సౌందర్యాన్ని, తన చుట్టూ ఉన్నా అందాలనీ చూపించి, సంతృప్తిగా నవ్వుకుంది. ఎందుకో తెలుసా! Federer తన సామర్ధ్యానికి పరీక్ష పెట్టిన ఆ Bull ని ఆహ్వానించినా ఎప్పటికైనా అది దిగి పోవాల్సిందే అని తెలుసు కాబట్టే మౌనం గా చిరునవ్వు చిందిస్తూ ఉండిపోయాడు.


Bull కి దిగకా తప్పలేదూ, Alps తన అందాలని మరింత పెంచుకుని ఆ మనిషికి ఆనందం ఇవ్వకా పోలేదు.


Federer, the greatest of the Twenty-first century Tennis players, is not finished yet. If he was deprived of the Singles gold, He showed he can win the Doubles gold.


వింబుల్డన్ సామెత: "విజేత చేజారిన అవకాశాలని తలుస్తూ కృంగి పోడు. లేని అవకాశాలని సృష్టించుకుంటాడు."


Roger Federer - His Royal Highness - in the words of Nirmal Sekhar, is still a force to reckon with.


తక్కువ అంచనా వేయరాదు. "ఎర్ర డ్రెస్ లో సెరెనా" అంటూ నేను వ్రాసిన టపాలో ఈ సారి US Open విజేత ఎవరన్న పరోక్ష ప్రశ్నకి వచ్చిన సమాధానాలు మొత్తం ఏడు. నాతో కలిపి. పూర్ణిమ గారు, ప్రియ గారు - Federer గెలుస్తాడనీ, నేనూ, ధనరాజ్, సృజన గార్లూ కలిపి చెప్పింది Nadal. KRK, వైష్ణవి గార్లు చెప్పింది Novak Djokovic.


And finally the winner is FedEX.


చివరగా... "Alps ని Bull ఎక్కితే, బుల్ కి Alps తన అందాలని చూపెట్టింది."


(సశేషం)


Note: చెప్పాల్సింది చాలానే ఉంది. మనసు మనసులో లేదిప్పుడు. విజేతల గురించి తలిస్తే కొంచం హుషారోస్తుందని బ్లాగాను. అసలు నేను షెడ్యూల్ చేసుకుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి. వ్రాసినంత వరకూ బాగానే వచ్చింది. ఇక చెడ కొట్టకూడదని రాయటానికి ఉన్నా ఆపేశాను.

The next post is "గెలిచేవాడే మనిషి - 2"

మన పంథా: సాహసమే నా ఊపిరి.

* Adopted from the post written by Purnima garu.
The link is

http://oohalanni-oosulai.blogspot.com/2008/07/alps-vs-bull.html
Read On 5 comments

విజేతెప్పుడూ నా డల్ - 2.

12:35 AM

"Use only that which works, and take it from any place you can find it." - Bruce Lee.

Safin కి ఇది తెలీదు. The only thing that works for anybody aspiring success is ... బుర్ర. సఫిన్ కి ఇది లేదు అనుకుంటా. ఎక్కడుందో కూడా తెలీదేమో.

మారత్ సఫిన్: ప్రపంచం లోనే అత్యున్నతమైన ఆట కలిగిన ఆటగాడు. 2000 లో US Open లో సఫిన్ చేతిలో ఓడిన తరువాత పీట్ సాంప్రాస్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. "రాబోయే దశాబ్దాన్ని ఇతడే ఎలుతాడు. జనం అంతా ఇతని గురించే మాట్లాడుకుంటారు."

కానీ సాంప్రాస్ వ్యాఖ్యలు మరో విధంగా నిజమయ్యాయి. ఈ దశాబ్దం అంతా ఇతనిదే. ఎందుకంటే బ్రతికే ఉన్నాడుగా! జనం అంటా ఇతనిగురించే మాట్లాడుకుంటారు. కుంటున్నారు కూడా! "పరాజితులని అందరూ మర్చి పోతారు." నా మొదటి బ్లాగులో ఈ మాట వ్రాశాను. కానీ ఎంత పరాజితుడయినా సఫిన్ ని మరిచిపోవటం జరుగదు. అతని ఆట అలాంటిది. ఆ ఫైనల్ లో సఫిన్ ఆడిన తీరులోనే ఆది ఉంటే ఈ దశాబ్దంలో ఆటను కనీసం 15 గ్రాండ్ స్లాంలు గెలిచి ఉండేవాడు. ఫెదెరెర్కి నిజమైన పోటీ అంటే ఏమిటో తెలిసేది. పర్లేదు రాఫా ఉన్నాడుగా. ముక్కోణపు పోటీ అయి ఉండేది. ఇంకొంచం బాగుండేది.

ఈసారి సెమీస్ కి చేరుకుని తనలో సత్తా ఇంకా తగ్గలేదు అని చాటాడు.

వింబుల్డన్ సామెత: "సఫిన్ చేతిలో టెన్నిస్ రాకెట్."

మనసెక్కడో పెట్టి ఆడుతూ, తన తప్పుకి రాకెట్లని విరగ్గోడుతుంటాడు. అందుకే 'నిర్మల్ శేఖర్' సఫిన్ ని 'మ్యాడ్ మ్యాన్' అన్నాడు.

నోవాక్ జొకోవిక్ తో సఫిన్ ఆడిన మూడు సెట్ల ఆట టోర్నీ కే హైలైట్. హాట్స్ ఆఫ్ టు సఫిన్.


రేటింగ్స్: నాదల్ 7 out of 10. ఫెదరర్ 8 out of 10. సఫిన్ 6.75 out of 10.

నాదల్ కి అన్న్యాయం జరగాలా. టోర్నీలో మూడు సెట్లు ఓడిపోవడమే కాకుండా మూడు సెట్లలో ముగియాల్సిన ఫైనల్ ని ఐదు సెట్ల పోరుగా మార్చాడు.

ఫెదరర్ ఫైనల్ వరకూ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఆట తీరు అదిరింది. ఫైనల్ లోనూ నాదల్ ని చాలా ఇబ్బంది పెట్టాడు. మనసు పెట్టి ఆడినండుకూ, సఫిన్ ని ఓడించినందుకూ.

safin deserved more but ... Atleast he have stretched Federer.

Riener Shuettler 6 out of 10.

జొకోవిక్ 1.5 out of 10.

వింబుల్డన్ సామెత: "విలియమ్స్ ముందు కుప్పి గెంతులా?"

ఈసారి ఇదే జరిగింది. ఒక్కసారి ఫ్రెంచ్ గెలువగానే అందరికీ ఇవనోవిచ్ పిచ్చి పట్టింది ఈవిడకి తోడూ షరపోవా ఉండనే ఉంది. సఫిన్ చెల్లెలు సఫినా, ఆ విచ్చిలూ ఈ విచ్చిలూ, ఇంకా కొంతమంది కోవాలూ.... విలియమ్స్ గురించి మాట్లాడిన వారు చాలా తక్కువ. నిజానికి 2002 వరకూ ర్యాంకు తో సంబంధం లేకుండా సాంప్రాస్ కి టాప్ సీడ్ ఇచ్చారు. Williams too deserve the same respect atleast in Wimbledon.

వింబుల్డన్ ఫాలోస్ లిటరల్స్:

౧. షరపోవా (పోవా రెండో రౌండ్ లోనే పోయింది.). (షరా మామూలుగా పోవా).

౨. సానియా మీర్జా (మీరుజా ... రెండో రౌండులోనే మీరు జా అంది ఆ అమ్మాయి. నాకిప్పుడు పేరు గుర్తులేదు. But she worth mentioned. తప్పక వ్రాస్తాను.).

Note: ౧. రాజు గారన్నట్టు. ఆటని బేసిక్స్ నుంచీ చెప్పొచ్చు. అవసరాన్ని బట్టీ నేను చెపుతాను. నేను నేర్చుకున్న క్రమంలో. లేకపోతె ఇది వింబుల్డన్ విలేజ్ కాదు. టెన్నిస్ లెసన్స్ ఫోరం అవుతుంది.
౨. విజేతెప్పుడూ నా డల్ - ౩ తరువాత కంటిన్యూ చేయ బడుతుంది.
౩. తరువాత బ్లాగు "My First Wimbledon (Tennis) Hero". ఇందులో కొన్ని బేసిక్స్ వస్తాయి.
౪. షరపోవా మూడు గెలిచినా comparable with the hype and potential, she could have won atleast 6. అందుకనే షరా... పోవా.


మన పంథా: గొప్పవారి నెప్పుడూ తక్కువ అంచనా వేయరాదు. Truth has no path. Truth is living and, therefore, changing - Bruce Lee.

Note: నా ట్రూత్ (సత్యం) గురించి తరువాత చెపుతాను.
Read On 5 comments

విజేతెప్పుడూ నా డల్

5:47 AM
ఎంత అందమైన వింబుల్డన్ ఇదీ. అద్భుతమైన టెన్నిస్, అర్హత కలిగిన విజేత, కోరుకున్న రిజల్ట్స్, కనివిందు చేసిన ఆటతీరూ... ఓహ్! వాట్ ఎ టోర్నీ?



ఇల్లు మారే హడావిడిలో ఉన్నా ఈ బ్లాగు గురించే ఆలోచింపచేయగల సత్తా ఈ వింబుల్డన్ సొంతం.


ఈసారి డయలోగ్: "ఎ సర్ఫేస్లో ఆడాము అన్నది ముఖ్యం కాదన్నయ్యా! అడ్జస్ట్ అయ్యామా లేదా?"
రాఫెల్ నాదల్ ఈ సారి ఈ డయలోగ్ కొట్టాడు. ఫెదరర్ దిమ్మ తిరిగేలా చేసిన సందర్భం అది.


"విజేతంటే గెలవడమే కాదు, ఓటమిని అంత తొందరగా అంగీకరించరు కూడా" అని ఫెదరర్ నిరూపించిన సందర్భం ఇది.

మరో వైపు విలియమ్స్ ఆల్ విలియమ్స్ ఫైనల్ తో పాటూ, డబుల్స్ లో కూడా నెగ్గి తమ పూర్వ వైభవాన్ని ప్రదర్శించిన సందర్భం ఇది. అయినా ఈ విషయాన్ని మరుగున పడ వేసింది మటుకూ జన్టిల్మేన్స్ సింగిల్స్ ఫైనల్. అందులో అంత ఏముందీ? నా చిన్నప్పటినుంచీ సింహం పెద్దపులీ తలబడుతుంటే చూడాలని కోరిక. ఒకసారి మా నాన్నని ఈ విషయమే అడిగి, ఏది గెలుస్తుంది అని అడిగాను. అప్పుడు తరువాత చెపుతాను అని ఊరుకున్నారు. ఈ మ్యాచ్ చూసిన తరువాత ఆయన "నీ ప్రశ్న కి ఇదే సమాధానం," అన్నారు. కానీ ఇందులో ఎవరు సింహం, ఎవరు పెద్దపులి అని నాకు సరికొత్త డౌట్ వచ్చింది. కానీ అత్యున్నత స్తాయి టెన్నిస్ ని రుచి చూడాలంటే ఈ మ్యాచ్ తప్పక చూడాల్సిందే.
నాదల్: ఈసారి హీరో నదలే. ఫెదేరెర్ని గత కొంత కాలం గా పీడకలలా వెంటాడుతున్న నాదల్, ఫెదరర్ కళాత్మకమైన ఆటని తన టాప్ స్పిన్ షాట్స్ తో గడగడ లాడించాడు. ఎ సర్ఫేస్ మీదైనా నేను ఆడగలనని నిరూపించుకున్నాడు.
ఫైనల్ కు ముందు కేవలం ఒక సెట్ ని మాత్రమే కోల్పోయిన నాదల్ ఫైనల్ లో మొదటి సెట్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. తొందరలోనే బ్రేక్ సాధించినా 47 నిమిషాలపాటూ ఆడాల్సి రావటం ఫెదరర్ లోని పోరాట పటిమకు నిదర్శనం.

ఇక రెండో సెట్ లో నాదల్ ని ఫెదరర్ అదరగొట్టి ఆదిక్యమ్లోకి దూసుకుని పోయాడు. కానీ నాదల్ మరోలా ఆలోచించాడు. ఫెదరర్ నిరుటిలా పుంజుకున్నాడు. తనది కాని సర్ఫేస్ మీద నాదల్ పని అయిపోతున్నది అని అందరూ అనుకుంటుండగానే నాదల్ వింబుల్డన్ దయలోగ్ కొట్టాడు. మాటలతో కాదు. తన ఆటతో. అంటే రెండో సెట్ కూడా నాదల్ వశం.
myaach మొదలైనఅప్పటినుంచీ ఇప్పటి దాకా నేను ఇంట్లో లేను వింబుల్డన్ విలేజ్ మొదటి బ్లాగు "ఎందుకు" వ్రాస్తున్నాను. ఇంతలో వర్షం వచ్చింది. వింబుల్డన్లో కాదు. మా ఊళ్ళో. నేను బ్లాగు రాసి ఇంటికి బయలుదేరే సరికి ఒకటే వాన. అయితే కరంట్ పోలేదు. దాంతో నేను ఫైనల్ కోసం వర్షం లోనే సైకిల్ మీద పరిగెత్తాను. తడిసి ముద్దై నేను ఇంటికి వెళ్ళేసరికి నాన్న "అక్కా వాన" అన్నారు. హ్హు హ్హు హ్హు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి బోర్గ్, మెకెన్రో 1980 ఫైనల్ మ్యాచ్ వేస్తున్నారు. మధ్య మధ్య లో అసలు మ్యాచ్ (ఇప్పటి ఫైనల్) లోని ముఖ్య ఘట్టాలని వేసేసరికి "ఎలాంటి ఆటను మిస్ అయ్యాను" అనుకోకుండా ఉండలేక పోయాను.
నేను ఒక సారి అన్నం తిని లేచే సరికి మ్యాచ్ మళ్ళీ మొదలైంది. 6-4, 6-4, 4-5. నాదల్ వైపు నుంచీ స్కోర్ అది. నేను టెన్షన్ తో చూస్తుందా గానే కరంట్ ఆఫ్.
ఫెదరర్: ఫెదరర్ మోములో నవ్వు మాయమైంది. నాదల్ హుషారు గా ఉన్నాడు. నాదల్ మధ్యలో క్రింద పడ్డాడని, తన పని అయిపోయిందని అనుకున్నానని, నాన్న అన్నారు.

విజేతలెప్పుడూ అందరిలా ఆలోచించరు కదా! ఫెదరర్ అట్టాక్ మొదలెట్టాడు. నాదల్ ఆటలో సమస్య ఏమిటంటే తన షాట్లు ఫెదరర్ తో పోలిస్తే ఒకింత స్లో గా ఉంటాయి. బంతులు స్పిన్ అవుతూ వస్తాయి. వింబుల్డన్ గ్రాస్లో బంతికి అంత పట్టు చిక్కదు. ఈలోగా ఫెదరర్ కోర్ట్ కవర్ చేయ గలడు. సరిగ్గా ఈ సూత్రాన్నే ప్రయోగించి నాదల్ మనసులో అనుమానపు బాజాలని నాటాడు. సాధారణం గా వర్షం వల్ల బ్రేక్ వస్తే వెనుక బడిన ఆటగాళ్ళు పున్జుకుంటారు. (2001 లో ఇవానిసెవిచ్ హెన్మన్ ఆట గుర్తుందా? లేక పాయినా పర్లేదు. నేను తరువాత గుర్తు తెప్పిస్తాను). బ్రేక్ సమయంలో నాదల్ తను మరి కాసేపట్లో వింబుల్డన్ ట్రోఫీని పట్టుకున్తానని డిసైడ్ అయ్యి ఉంటాడు. కళ్ళ ముందు కప్ తో తను కనిపించి ఉంటాడు. అదే ఎప్పుడూ ప్రమాదం. పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచించ కూడదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా! నాదల్ లో ఒక రకమయిన ఉద్వేగం కలిగింది. రాఫా గాడు వింబుల్డన్ విజేత. అంతే.
"గెలిచామా లేదా అని కాదన్నయ్యా! 100 పెర్సెంట్ ఇచ్చామాలేదా" అంటూ ఫెదరర్ ఆడుకున్నాడు. సెట్ టై బెర్క్ కి దారి తీసింది. టై బ్రేక్ లో నాదల్ పోరాడటానికి ప్రయత్నం చేసినాఫెదరర్ వకాశం ఇవ్వ లేదు. టై బ్రేక్ లో 5-౩ వద్ద పాయింట్ అద్భుతం. ఏస్ తో సెట్ని గెలుచుకున్నాడు.

ఇంట్లో అందరూ నిద్ర పోతున్నారు. నాన్న కూడా. లేట్ అయింది కదా!

నాకు నాదల్ మీద కోపం వచ్చింది. నాలుగో సెట్లో ఫెదరర్ ఊపు ఇంకా పెరిగింది. నడక లో హుషారు కనబడుతున్నది. నాకేమో మండుతున్నది. నేను నాదల్ ని తిట్టుకున్టున్డగానే సెట్ టై బ్రేక్ లోకి వెళ్ళింది. అందులో ఈ సారి నాదల్ ఆధిక్యం 5-2. మళ్ళీ నాదల్ వత్తిడికి గురి అయ్యాడు. రా గాడు వింబుల్డన్ విజేత సీన్ కళ్ళ ముందు మెదిలింది. అంతే. మనకు తెలిసిందేగా.
నేను మ్యాచ్ ని తక్కువ సౌండ్ తో చూస్తున్నాను. అక్కడ నాదల్ సెర్వింగ్ ఫర్ ది మ్యాచ్ అనగానే సౌండ్ కొంచం పెంచాను. ఫెదరర్ అదరి పోయే షాట్. ఇంక నాకు సెంటిమెంట్ పట్టుకుంది. వెంటనే సౌండ్ తగ్గించాను. ఈ సారి మ్యాచ్ పాయింట్. మళ్ళీ సౌండ్ పెంచాను. మళ్ళీ ఫెదరర్ పక్షమే. సౌండ్ డౌన్. మూడోసారీ ఇదే పరిస్థితి. ఏదయితే అది అయిందని సౌండ్ పెంచాను. ఇక పో ఫెదరర్ నభూతో అనే లాంటి బ్యాక్ హ్యాండ్ షాట్ తో సెట్ గెలుచుకున్నాడు. "చచ్చినోడా, వెధవా, ముండా, శుంఠా... అంటూ నాదల్ ని తిట్టుకున్నాను. స్లోర్ ఐదవ సెట్లో 2-2.
మళ్ళీ వర్షం పట్టుకుంది. నేను తట్టుకోలేక టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను. నిద్రలో అంతా ఫెదరర్-నాదల్ ఆటే. మంచి మంచ్ పాయింట్ లన్నీ కలలోనే. నేను దొర్లుతున్నాను. "లే చూద్దాం," అంటూ ఫెదరర్ తట్టి పిలిచాడు. కళ్లు తెరిస్తే నాన్న. అప్పుడు టైం 1:37. స్కోర్ ఫైవ్ ఆల్. ఇంక అక్కడ నుంచీ నేనూ నాన్నా ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకుంటూ మ్యాచ్ ని చూడటమే. పాత విషయాలు కొత్త విషయాలూ అన్నీ మాటలలోనే. ఇంతలో సెవెనాల్. ఫెదరర్ సర్వ్ ని నాదల్ బ్రేక్ చేసాడు. నేను సౌండ్ పెంచుదామనుకున్నా సెంటిమెంట్ గుర్తు వచ్చి పెంచకుండా మంచానికి అతుక్కు పోయాను. డ్యూస్ దాటి నాదల్ గెలవంగానే చూడాలీ నా మొహం thousand watts.

వింబుల్డన్ సామెత: "ప్రతి ఫెదెరెర్కీ ఒక నాదల్ వస్తాడు."

గతనుభావలనుంచీ నేర్చుకున్న పాఠాలని ఉపయోగించుకున్న నాదల్ గెలిచాడు.

శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, "कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन!" పని చెయ్యటమే మన విధి. ఫలితం భగవానుడే చూసుకుంటాడు.

అందుకే మ్యాచ్ మధ్యలో ఒత్తిడికి గురి అవుతుంటారు, అనుభవం లేని వారు. నాదల్ కి వింబుల్డన్ గెలిచిన అనుభవం లేదు. అందుకే మొదటి మ్యాచ్ పాయింట్ అప్పుడు అలా.

మన పంథా: कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन

(సశేషం)

Read On 8 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి