ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

సెరీనా సరేనా?

8:08 AM

హాయ్ సెరీనా! ఎలా ఉన్నావ్? అయినా అడిగేదేంటి? రోజూ చూస్తూనే ఉన్నాగా.

చాలా చక్కగా అది గెలుస్తూనే ఉన్నావుగా! ఇవాళ అక్కతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్ గెల్చి మాంచి హుషారుగా ఉన్నావు. ఆస్ట్రేలియా ఎండలు చంపేస్తున్నా నువ్వు నీ ప్రతాపాన్ని ఆ ప్రచండ భానుడికి చూపెట్టి రేపు జరిగే ఫైనల్ లో గెలు. అక్క విమ్బుల్డన్ చూసుకుంటుంది.

శుభాకాంక్షలతో...

తమ్ముడు.

చూడండి మా ఫ్యామిలీ.

----------------------------------------------------------------------------

వీనస్, సెరీనా ఇద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచారు. అద్భుతమైన ఆట తీరు కనబరిచారట. అమ్మ చెప్పింది. హైలైట్స్ చూసి వ్రాయాలి. 6-3,6-3 score తో దానియేలా హన్తుకోవ, ఐ సుగియామా మీద విజయం సాధించారు.

----------------------------------------------------------------------------

5 out of 7 to Serena's victory.
Read On 1 comments

బాబు ఆకుల "తెలుగు వెలుగు" లో నా కత చూస్తారా?

7:39 AM

"దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు." ఈ సామెత మనందరికీ బాగా తెలుసు. ఇప్పటికి సరిగ్గా ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియా మాస పత్రిక 'తెలుగు వెలుగు' లో నేను వ్రాసిన ఒక టపా ప్రచురితం ఐంది. ఇంతకీ నేను దొంగనా? లేక కుక్కనా?

కత వింటారా మాట కదా ఒకటుందీ అని నేను వ్రాసిన ఆ juvenile come technique ని "శ్రీ బాబు ఆకుల గారు" ప్రచురించారు. అందుకు వారికి మరొక్కసారి నా కృతజ్ఞతాభివందనాలు.
అప్పుడు నేను "సత్యమేవ జయతే" అనే పేరుతో ఉన్న బ్లాగ్ నడిపాను. అప్పట్లో వ్రాసిన పోస్ట్ అది. నా టపాలలో ఎక్కువ వ్యాఖ్యలు పడిన టపా కూడా. (అక్షరాలా తొమ్మిది).
ఇంత అయినా నాకు ఎన్నో చేదు జ్ఞాపకాలని మిగిల్చిన టపా కూడా అది. నాకు బాబు ఆకుల గారు ఆ కాపీని పంపుతానన్నారు. ఎంచేతనో నాకు ఆ కాపీ అందలేదు. దాంతో కొందరు నా ఫ్రెండ్స్ (అనుకునేవారు) అదంతా నా సృష్టేననీ, ఏదో సాఫ్ట్వేర్ ద్వారా నేనే వాటిని క్రియేట్ చేశాననీ కొంచం టాక్ పుట్టించారు. బస్. థాంక్యూ బాస్. అలా సాఫ్ట్వేర్ ని తయారు చేయగలిగితే అదీ నా ఘనతేగా! :-) అనుకుని వదిలేసినా కొందరు ఇంకొంచం ముందుకెళ్ళి నా పైన చేసిన వ్యక్తిగత దాడుల వల్ల నేను సాంతం నా ఐడీనీ మార్చివేసి The Inquisistor - సత్యాన్వేషి ప్రారంభించాను.
ఇంతకాలం ఎందుకు బ్లాగ్ లో పెట్టలేదంటారా? నేను అదో ఘనతగా భావించలేదు. నా గురి అంతా ఇంకా పైనే ఉంది. పైగా ఈ మధ్య మన బ్లాగ్మిత్రులు చాలా మంది గురించి 'ఆంధ్రజ్యోతి' లో రావటం, మరియూ నా స్నేహితురాలు ఈ మధ్య తగు మాత్రముగా 'ఉపదేశామృతం' చేయటం మూలానా, పోన్లే అని తన బర్త్డే ముచ్చటని కాదనటం ఎందుకులే అని, నాకూ కొంచం ఆశ పుట్టటం మూలానా ఇలా.
నిజం చెప్పమంటే అవీ కారణాలు. అబద్ధం చెప్పమంటే మా నాన్నగారు ఇంతకాలం చూడలేదు. నేను The Inquisistor - సత్యాన్వేషి ప్రారంభించే దాకా ఊళ్ళో లేరు. ఆయనకి నేను చూపినవి కేవలం "వింబుల్డన్ విలేజ్" మాత్రమే. నవతరంగం లో వ్రాసినవి చూపించినవి రెండే. త్యాగయ్య , శ్రీ లక్ష్మీ కళ గారి వ్యాఖ్యల కోసం ఒక టపా... అంతే. ఇవాళ ఎక్కడో మూలనున్న పుస్తకాలను దులుపుతుంటే పాత black and white ప్రింటు లో కనిపించాయట. మా అన్నని తరిమి ఇదో ఈ కలర్ ప్రింటు తీయించి స్కాన్ చేయించి సాయంత్రం నేను రాగానే నాకిచ్చి, ఇది పెట్టితేనే నేను నీ బ్లాగ్లో రామాయణం వ్రాస్తాను. లేకుంటే లేదు అన్నారు.
సరే ఆయన పుత్రోత్సాహాన్ని ఎందుకు కాదనాలి అనుకుంటూ అలా నెట్టుకి వచ్చి ఓ రెండు గంటలు తంటాలు పడ్డాక ఇదిదో (కత లో చూడండి) ఇలా.
నిజాన్నీ అబద్దాన్నీ వదిలేసి ఆ టపా సత్యం. అది బాగుందా లేదా అనే మీ స్పందన సత్యం. ఏమంటారు? దొంగలు పడ్డ ఆరు నెలలకి... చందాన... పోస్ట్ వచ్చిన ఆరు నెలలకి... అనరు కదా?
MANY HAPPY RETURNS OF THE DAY CHAITHI.
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను. మన వాళ్లంతా లేరు కదా. అందుకే క్రితం సారి పుట్టిన రోజులా నీ ఈ కొత్త పుట్టిన సంవత్సరం సాగిపోవాలని... మన్ స్ఫూర్తి గా ఆకాంక్షిస్తూ...
భారంగా ఉందా? ఐతే ఇది విను, నీ చెక్క మొహం కనీసం టేకు చెక్కలా అన్నా ఉపయోగ పడాలని కోరుకుంటూ...
విన్నపం: మీరూ చైతన్య కల్యాణి (నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు) కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పండి.
P. S. : మరో టపా కూడా ఆ తరువాత నెలలో ప్రచురితం ఐంది. దాన్ని ... ఆ (అంతొద్దు) ఇది చాలు అని ఎవరూ అనక పోయినా నేనే అనుకుంటున్నాను.
Read On 2 comments

దైవం మానుష రూపం లో...

7:54 AM

ఎడారిలో నేనొంటరినైతే...

వర్షం నన్ను కౌగిలించుకుంది.

కష్టాల కడలిలో నేనీదుతుంటే...

చిరునవ్వొకటి నన్ను పలకరించింది.

సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...

కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది.

బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...

దైవం నన్ను విముక్తుడిని చేసింది.

భయం నన్ను నీలా చేస్తే...

నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది.

నిరాశ నన్ను మరణించమంటే...

ఆశ నన్ను జీవించమంది.

పగ నన్ను రాక్షసుడిని చేస్తే...

ప్రేమ నున్ను దైవంలా మార్చింది.


ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...

నేనే అందరినీ నాలా చేస్తా...

అందరిలో దైవాన్ని చూస్తా.

Note: వర్షం నన్ను కౌగిలించుకుంది, అనే మాట ఆమధ్య సాక్షిలో ఎం డి యాకూబ్ పాషా గారు వ్రాసిన ఆర్టికల్ లో నన్ను ఆకర్షిచింది. ఆలోచిస్తుంటే ఈ వాక్యాలు తట్టాయి.

I CAN NOT SAY I LOVE YOU WITHOUT SAYING I

Read On 4 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి