Showing posts with label ఆనందం. Show all posts
ఇంతానందం ప్రకృతిలోనా... (నా వయసుని మించిన కామెంట్లు)
11:11 AM
నేనింతవరకూ వ్రాసిన ఏ బ్లాగ్పోస్టూ పన్నెండు కామెంట్లని మించి సాధించలేదు. I have no complaints though. ;-) (స్వప్నిక మీద వ్రాసిన దానికి దెబ్బై పైన వచ్చినా... అవన్నీ ప్రచురించలేదు. చాలా వరకూ ఒకేరకమైన అభిప్రాయం ఉన్నవవి) . నవతరంగంలో మాత్రం నాకు బానే కామెంట్లొచ్చాయి. పదికి తగ్గకుండా.
మొన్నీమధ్య నేను "సృజనగీతం" లో వ్రాసిన ఒక వాన కవితకి మాత్రం అక్షరాలా ఇరవయ్యారు వ్యాఖ్యలు పడి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సాధారణంగా నేను కామెంట్ల లెక్క చూసుకోను. ఎందుకంటే నేను ఎలా వ్రాశానో నాకు బాగానే అర్థం అవుతుంది కనుక. ;-)
కానీ ఇదెందుకో కాస్త ఎక్కువ ఆనంద పరిచింది. అందుకే ఇలా పోజెట్టానన్నమాట. హిహిహి