ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

Showing posts with label రామాయణం. Show all posts

రామాయణం - వాల్మీకి మహర్షి

8:26 AM
రామాయణ మహాకావ్యం తో విడదీయరాని అనుబంధం కలిగిన పేరు వాల్మీకి మహర్షిది. వల్మీకములనుండీ ఉద్భావించినవాడు కావటం చేతనే వాల్మీకి గా ప్రసిద్ధుడైనాడు. అంతియే కాదు. పుట్టాను ఛేదించుకుని తానూ వచ్చినట్లే ఆ రామ కథను మనకి అందించి తాను ధన్యుడై, మనలనూ ధన్యులను చేశాడు.

శ్రీమదఖిలాండ సచ్చితానంద పరమాత్ముని సృష్టిలో వివేకము కలిగిన మానవ జాతి ఒక్కటి మాత్రమే గొప్పది. ఇటువంటి మానవ జన్మను సార్ధకం చేసుకునేటందుకు ధర్మ, అర్ధ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్ధములను ఆర్జించుకోవాలి. ధర్మాన్ని అవలంబించి మిగిలిన పురుషార్ధములను ఆర్జించుకోవాలన్న ఉద్దేశ్యమే ధర్మాన్ని ప్రధమంగా నిలపటానికి కారణం అవుతుంది. ఈ విషయాన్ని గురించేకాకుండా... ధర్మాన్ని గురించి, ధర్మాచరణ గురించి, సోదాహారం గా వాల్మీకి మహర్షి వ్రాసిన కావ్యమే రామాయణం.

----------------------------------------------------------------

ఇది నేను మొదటి సారి టైపు చేసిన పోస్ట్. అంతకుముందు మా అబ్బాయి టైపు చేశాడు. అందుకే నా ఓపికను బట్టీ ఇంతే వ్రాశాను. ఇక ముందు పూర్తిస్థాయిలో వ్రాయాలి. నాకూ ఉత్సాహం వచ్చింది. పిల్లలని చూసి.
Read On 4 comments

శ్రీరామాయణ కథా ప్రారంభం

7:23 AM

శ్రీ రామాయణమా? లేక శ్రీమద్రామాయణమా? అన్నది పండితులకి వచ్చే ప్రశ్న. అక్కడి నుండీ మొదలై మొదట గా "సంక్షేప రామాయణం" వ్రాయబడుతుంది.


ఎందఱో రామాయణం వ్రాశారు. మళ్ళీ ఎందుకు?


ఎందుకు సరే! ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. బ్లాగుల్లో రామాయణాన్ని గురించి దుమారాలే రేగాయి. చాలా మంది చాలా రకాలుగా వ్రాసేశారు. మంచిగా చెడుగా. అయినా నాకు రామాయణాన్ని మళ్ళీ వ్రాయాలని కోరిక కలిగింది. కానీ నేను వ్రాసేకన్నా మా నాన్నగారు ఐతే మరింత బాగా వ్రాస్తారని, (ఆయన సంస్కృతాంధ్ర పండితులు) ఆ బాధ్యతని ఆయనకే అప్పజెప్పాను. అయన అందుకు నా అదృష్టం కొద్దీ సమ్మతించారు.


అసలెందుకు రామాయణాన్ని వ్రాయాలని పించిందంటే...


గత ఏడాది నేను హైదరాబాద్ లో మా మేనత్త గారి ఇంట్లో కోచింగ్ కోసం ఉండగా మా దూరపు చుట్టాలు ఐన "శ్రీమాన్ వేదాల నరసింహాచార్యులు", వారి ధర్మపత్ని, "కనకమ్మ" గారు 'ధనుర్మాసం' సందర్భం గా అక్కడికి వచ్చారు. అప్పుడు నాకు వారు మా నాన్నగారి తండ్రికి తమ్ముడి వరుస అవుతారనీ వారిదీ మా సొంత ఊరు ఐన ముత్తుపల్లి అగ్రహారమే అనీ తెలిసింది. అంటే ఆయన నాకు తాతగారూ, ఆవిడ నాకు మామ్మ అవుతారు. వారు నన్నెంతో అభిమానించారు. ఆ రోజు మాటల సందర్భం లో తాతగారికి 'సంక్షేప రామాయణం' గొప్పగా వచ్చనీ, వారు దానిని పారాయణం చేస్తారనీ తెలిసి నాకూ ఆయన చేత ఉపదేశం pondaalani కోరిక కలిగింది.


నేనా రోజున ఆయనని అడిగాను. అందుకు మామ్మా, తాతా సంతోషం తో ఒప్పుకుని నన్నూ, రంగనాథ్ మామనీ వారి ఇంటికి ఒక మంచిరోజు చూసుకుని రమ్మన్నారు.


ఆ తరువాత రెండు నెలలకి, అనగా ఫిబ్రవరి పదిహేడున వెళ్ళాము. తాతా మామ్మా ఎంతో ఆదరించి మాకు రామాయణాన్ని ఉపదేశించారు. నేను జీవిత కాలంలో పొందలేని అభిమానాన్ని ఆ రోజున ఆ పుణ్య దంపదుల వద్ద పొందాను.


ఆ తరువాత వారిని మళ్ళీ కలిసింది, యాదృశ్చికమో, లేక భగవత్సంకల్పమో కానీ 'శ్రీరామ నవమి. ఆ తరువాత కలవలేక పోయాను.


ఈ జూలై ఇరవై రెండున మామ్మ పోయింది. చిత్రమేమిటంటే అది ఆవిడ పుట్టిన రోజు. నాకీ విషయాన్ని రంగనాథ్ మామ చెప్పాడు. నేనిక మామ్మని చూడలేనని ఆ రోజు ఎంతో బాధ పడ్డాను. అందుకే మామ్మకి నివాళిగా వారు నాకుపదేశించిన 'సంక్షేప రామాయణాన్ని' అనువదించి కొంతలో కొంత అయినా ఋణాన్ని తీర్చు కోవాలని అనుకున్నాను. ఐతే ఆ పనిని నేను చేయలేను. అందుకే మా నాన్న ని అడిగాను ఆయన అందుకు సమ్మతించారు.
'సీతా రాముల' లాంటి ఆ పుణ్య దంపదులకి ఈ 'రామాయణం' అంకితం.


తరువాత poste 'రామాయణారంభం'.
Read On 5 comments

"రామాయణం"

7:04 AM
నాకు అంతర్జాలంతో పరిచయం శూన్యం. ఎప్పుడన్నా పిల్లలు చెప్పి చూపిస్తే చూడటమే. ఈ మధ్య మా అబ్బాయి బ్లాగులనే పేరుతో అంతర్జాలంలో ఏవేవో వ్రాస్తున్నానని చెప్పాడు. వాటిని పరిశీలిస్తే కొన్ని బాగానే అనిపించాయి. కొందరు బ్లాగ్గర్లు వ్రాసిన వాటిని తెచ్చి చూపగా అంతర్జాలంలో తెలుగు బాగానే వెలుగుతున్నదన్న ఆశ కలుగుతున్నది.

కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖం
వందే వాల్మీకి కోకిలం

నన్ను సంక్షేప రామాయణాన్ని వ్యాఖ్యాన సహితంగా వ్రాయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అయితే ఓపిక లేక ఉపేక్షిస్తూ వచ్చాను. అయితే తన వాదనతో నన్ను మొత్తానికీ ఉత్సాహ పరిచి నన్ను ఒప్పించాడు. అంతర్జాలం లో పెడతానని అనటం తో, ఆ మధుర కావ్యాన్ని మరలా తలుచుకునే భాగ్యం నాకు కలిగింది.

ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుతూ నా వీలుననుసరించి 'రామాయణం' అనబడే ఆ మధుర కథను నా శైలిలో అనువాదము చేసే పనిని చేపడుతాను.

సెలవ్.

వేదాల రాజగోపాలాచార్య.
Read On 4 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి