ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

Showing posts with label Poetry. Show all posts

దైవం

10:29 PM
ఎడారిలో నేనొంటరినైతే...

వర్షం నన్ను కౌగిలించుకుంది.



కష్టాల కడలిలో నేనీదుతుంటే...

చిరునవ్వొకటి నన్ను పలకరించింది.



సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...

కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది.



బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...

దైవం నన్ను విముక్తుడిని చేసింది.



భయం నన్ను నీలా చేస్తే...

నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది.



నిరాశ నన్ను మరణించమంటే...

ఆశ నన్ను జీవించమంది.



పగ నన్ను రాక్షసుడిని చేస్తే...

ప్రేమ నున్ను దైవంలా మార్చింది.



ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...

నేనే అందరినీ నాలా చేస్తా...

అందరిలో దైవాన్ని చూస్తా.



Note: వర్షం నన్ను కౌగిలించుకుంది, అనే మాట ఈమధ్య సాక్షిలో ఎం డి యాకూబ్ పాషా గారు వ్రాసిన ఆర్టికల్ లో నన్ను ఆకర్షిచింది. ఆలోచిస్తుంటే ఈ వాక్యాలు తట్టాయి.


సత్యమేవ జయతే!
Read On 6 comments

రాధా కృష్ణం

11:59 PM
కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...

శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...


రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...

మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...


ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కతుదాం...

ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...


గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...

ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...


దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...

ప్రేమలో ఇంకిపోతూ
లోకమే వీదిపోదాం...


నిజమయిన ప్రేమకూ, ఆ రాధా కృష్ణులకూ, ఇది నా అంకితం.

నేనేమీ పెద్ద కవిని కాడు. జస్ట్ అలా రాశానంతే. కృష్ణ మాయ.

ప్రేమ శాశ్వతం. అమరం. సత్యం.

సత్యమేవ జయతే.

వయ్యంటే బిడ్డే చదివి అభిప్రాయం చెప్పండి.

Read On 2 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి