ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

దాదా వెడలే 'సౌ'రవితేజము లలరగ


(గంగూలీ వీర విహారం తో Steve Waugh రిటైర్మెంట్ ని చిద్రం చేసి సగర్వం గా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందుకున్న వేళ! 2003-04 BG Series)


నేను
తొమ్మిదో తరగతిలో ఉండగా ఒక ఫైన్ ఉదయం మా ఫ్రెండు బీ శ్రీను గాడింటికి క్రికెట్ ఆడటానికివెళ్ళాను. వాడూ మరో నలుగురం కలసి ఎసెసెన్ కాలేజ్ గ్రౌండు కి వెళ్ళీ ఆట మొదలెట్టాము.ఆట మంచి రంజుగా సాగుతోంది.మా ఆపోజిట్ టీం ఉన్న పది ఓవర్లలో ఏభై నాలుగు కొట్టారు.

తరువాత మాదే బ్యాటింగ్. నలుగురమూ సింగిల్ సైడ్ (ఒకళ్ళే ఆడటం) ఆడాలి. ముందు యాజ్ యూజువల్ గా బీ శ్రీను దిగాడు. ముందు నన్ను దించరు. ఎందుకంటే మనకి అంత సీన్ ఉండదు. ఎప్పుడో తప్ప. మూడు లో దిగమన్నారు. సరే అని నేను వెళ్ళీ కూచున్నాను. శ్రీను గాడు బాగా కొడతాడని అందరికీ తెలుసు. పొట్టోడే కానీ మహా గట్టోడు. చక చకా మూడు ఓవర్లలో 22 కొట్టి ఔట్ అయ్యాడు. ఆ తరువాత ఇంకోడు దిగాడు. శ్రీను గాడు ఔట్ కాగానే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. మహ ఐతే నెనో పది కొట్టి పోతానని అందరి ఎక్స్పెక్టేషన్. రెండో వాడు మరో పది కొట్టి బాల్చీ తన్నేశాడు. (నిజం గానే. రన్నుకి వెళుతూ మధ్యలొ ఎవరో బాల్చీ పట్టుకుని వస్తుంటే అది చూస్తూ వాడు రనౌట్ అయ్యాడు.)

ఇక నేను రాక తప్పలేదు. ఎక్కడ లేని పోజులు కొడుతూ వెళ్ళి నించున్నాను. రమేష్ గాడు బౌలింగ్. వాడు మాంఛి స్పీడు గా వేస్తాదు. వాడంటే మాలో చాలా మందికి భయం. భలే స్పీడు గా వచ్చి బంతేయటానికి రెడీ అవుతుండగానే నేను ఆగరోయ్ అంటూ ప్రక్కకి తప్పుకున్నాను. అందరూ నవ్వారు. శ్రీను గాడేమో ఒరే 'ఓవర్లన్నా కాచుకో' అంటూ నస మొదలెట్టాడు. ఇంకా 21 బంతులున్నాయి. ఇంకో 23 కొట్టాలి.నా వల్ల కాని పని అది. అందుకే కనీసం ఒవర్లన్నా కాచుకుంటే బాగుంటుందని వాడి ఉద్దేశ్యం.

కానీ నా ఆలోచనలు వేరు గా ఉన్నాయి. నా ఆలోచన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేద్దామని. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓడిపోతామని డిసైడ్ అయి ఉన్నాము. అందుకే అలా ఆడి ఒక ప్రయోగం చేయాలని నా ఆలోచన. ఇక్కడో విషయం చెప్పాలి. నాకు లెఫ్ట్ హ్యాండ్ పవరెక్కువ. టెన్నిస్ లో బ్యాక్ హ్యాండ్ అలవాటై ఆ చేత్తో థ్రస్ట్ ఎక్కువ అప్ప్లై చేయగలను. అప్పుడు హిట్టింగ్ చేయొచ్చు. గెలిస్తే గెలుస్తాం. లేదంటే ఎటూ వదిలేసిందేగా.

నేను లెఫ్ట్ హ్యాండ్ శ్టాన్స్ తీసుకున్నాను. శ్రీను గాడు తల పట్టుకున్నాడు. తిక్కలోడు ఎదోక మెంటల్ పని చేయందే ఊరుకోలేడు అని గట్టిగానే అన్నాడు. నేను పట్టించుకోలేదు. రమేష్ ఇంకొంచం స్పీడు పెంచి వేసిన బంతిని నేను స్ట్రైట్ బాట్ తో హాఫ్ వాలీ గా తీసుకుని ముట్టించాను. బంతి బౌండరీ దాటింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. నేను మాత్రం ఎప్పటిలాగే ఒక హాఫ్ స్మైల్ ఇచ్చాను.

"ఉరే వీడు గూంగ్లే లాగా ఆడుతున్నాడురా!" కిరణ్ గాడు అన్నాడు. "వాడెవరురా?" నేనన్నా. అర్ధం కాక. "వాడేరా మొన్న సెంచరీ కొట్టాడే వాడు రా." గంగూలీకి వచ్చిన తిప్పలు. "ఓ గంగూలీయా?" అన్నాను. "కాదురా వాడి పేరు గూట్లే రా!" అరిచాడు అక్కడ టూ సైడ్ ఆడుతున్న బుడ్డోడు.

ఆ బుడ్డోడు ఏమో కానీ ఆస్త్రేలియన్ల కంటికి మాత్రం ఈ కలకత్తా రాకుమారుడు గూట్లేనే. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ దేశంలోనే, వాళ్ళ పద్ధతిలోనే ఎదిరించిన మొదటి మొగాడు. భారత క్రికెట్ లో ఒక్క మగాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రని మలుపు త్రిప్పిన వాళ్ళు ఇద్దరైతే, ఆ ఇద్దరూ మన దేశానికే చెందిన వాళ్ళే కావటం మనకి గర్వ (గంగూలీ ఈజాన్ ఇగోయిస్ట్. ఐ యాం ప్రౌడ్ ఆఫ్ ఇట్.) కారణమైన విషయం. వాళ్ళిద్దరిలో ఒకరు కపిల్ ఐతే మరో వ్యక్తి 'సౌ'రవితేజములలరగ ఈ మధ్యనే రిటైర్ అయిన దాదా గంగూలీ.

అప్పటి దాకా పాశ్చాత్యుల ఆధిపత్యంలో ఉన్న క్రికెట్ని 'భారతైజేషన్' చేశాడు కపిల్. ఒకే ఒక్క ఇన్నింగ్స్. నూటడెబ్బై ఐదు (175) పరుగులు. అంతే. భరతే క్రికెట్ సూపర్ పవర్. నిజమా కాదా?

అలాగే కంగారూల కుప్పిగంతులని కాళ్ళు విరగ కొట్టి మరీ ఆపిన వీరుడు గంగూలీ. ఒకే ఒక్క నూట నలబై నాలుగు. అనగా పన్నెండు స్క్వేర్. పన్నెండు. 1 అండ్ 2. మొదటిది ఆస్త్రేలియాదే ఐనా, రెండు భారతే అని చూపెట్టాడు. ఔనా కాదా? వాట్ డూ యూ సే?

తన చివరి సీరీస్ లోనూ వారిని మట్టి కరిపించి తన 'సౌ'శీల్యాన్ని జట్టు కి వారసత్వంగా వదలి తాను సగర్వంగా నిష్క్రమించాడు.

అలాంటి గంగూలీ విజేతల స్వర్గ ధామమైన 'వింబుల్డన్ విలేజ్' లో ఉండదగ్గ వ్యక్తీ. అందుకే రేపు 'వింబుల్డన్ విలేజ్' లో గంగూలీ గురించి ఆర్టికిల్ వ్రాస్తున్నాను. (నిజంగా రేపే. :-)
2 comments:

చాల సంతోషం. నేనూ సౌరభుని అభిమానినే :)


ఇది సరే! రాస్తారు రేపో మూన్నాళ్ళకో. మీ మ్యాచేమైంది?

మీరు ఎటూ రాయరని అందరికీ తెలుసు. ;-)


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి