ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

రాధాకృష్ణం

కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...

శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...

రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...

మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...

ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కటౌదాం ...

ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...

గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...

ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...

దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...

ప్రేమలో ఇంకిపోతూ ...
లోకమే వీడిపోదాం...
4 comments:

బాగుంది గీతాచార్యా! ఈ మధ్య ఒక యువ కవి (అనంత కృష్ణ శర్మ అనుకుంటా పేరు)అద్భుతమైన సినీ గీతాలు రాస్తున్నాడు. అతడు గుర్తొస్తున్నాడు.


గీతాచార్య గారూ ! మీ రాధాకృష్ణం సమ్మోహనకరం.ఈ కవితకు రాధాకృష్ణం అన్న పేరు సార్ధకం .మరి రాధకు మాధవుడేగా ఆశ ......శ్వాస ......


గీతాచార్య గారూ..
ఇది మీరు రాసిన కవితనుకుంటా కదా.. చాలా బావుందండీ..!
మీరు "కొంచెం ఈ ఫ్లాప్ సాంగ్ ని పరిచయం చేద్దురూ" అని అంటే.. నిజంగా ఏదో పాట అనుకున్నాను. ఎప్పుడూ వినలేదే.. అని ఆలోచిస్తున్నాను.
అయితే మీరు జోక్ చేసారన్నమాట :)

@ సుజాత గారూ,
మీరు చెప్పింది అనంత శ్రీరామ్ రాసే పాటల గురించేనా?


గీతాచార్య, నా ప్రేమ కావ్యాలన్నిటిని సారాంశం చెప్పమంటే ఈ కవితనే చూపిస్తాను. ఇంకేముంది కదా చెప్పటానికి ప్రేమటే ఏమిటో - "ప్రకృతి పురుషులవుదాం." కన్నా? ఈ భావనే ప్రేమ నా వరకు.


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి