ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

వయ్యంటే బిడ్డే

Labels:
ఈ రోజు న్యూస్ పేపర్ చూసి నేను షాక్ తిన్నాను. ఇంతలో నాకు ఎవరో పెద్దగా నవ్వటం వినిపించింది. ఆ షాకులో నాకు అది నిజమైన నవ్వో లేక నా చిత్తభ్రాంతో అర్థం కాలేదు.
కాలం సాగిపోయింది. అది నాకు గాలిలో తెలుస్తోంది. నీటిలో తెలుస్తోంది. అలా అయిదువందల సెకనులు గడిచిపోయాయి. THE LORD OF THE RINGS: THE FELLOWSHIP OF THE RING సినిమాలో VOICE OF THE RING తెలుగు డబ్బింగ్ లాగా ఉందా! ఇంతలో మావారు రావటంతో నేను ఈ లోకంలోకి వచ్చాను.
మా ఇంట్లో పనిమనిషిగా చేసిన సుబ్బి హత్య చేసింది. తన మొగుడిని. ఆ న్యూసే నన్ను షాకుకి గురి చేసింది. సెలయిను బాటిల్తో పొడిచి భర్తను చంపిన భార్య. అదే నేను చుసిన హెడ్డింగు.
"భలే కామెడీ కదూ!" మా ఆయన నా ముక్కు పట్టుకుంటూ అడిగారు. నేను ఆయన చేతిని నేట్టేస్తూ కుర్చీలోకూలబడ్డాను.
*** *** ***
నాలుగు రోజుల తర్వాత నేను సుబ్బిని కలిసాను. అప్పుడు జరిగన సంభాషణ ఇదీ.
నన్ను చూడగానే ఆత్మీయంగా నవ్వింది.
"ఏమి జరిగింది?" నేను అడిగాను.
"ఎప్పుడో జరగాల్సింది అమ్మగారూ. ఇప్పుడు జరిగింది." తను అన్నది.
తర్వాత జరిగిందంతా నాకు చెప్పింది.
*** *** ***
సుబ్బి కోన సీమ నుంచీ వచ్చింది. మా ఉద్యోగం నిమిత్తం మేము గుంటూరు వచ్చాము. మా పనిమనిషి గా తననే పెట్టుకున్నాము. చక చక పనులు చేస్తూ మా అభిమానాన్ని పొందింది. ఏడాది క్రితం పెళ్లి అయిన మేము ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో మా అత్తగారికి సహాయంగా ఉండటానికి పనిలో పెట్టుకున్నాము. మా అత్తగారు మంచి మాటకారి. అవతలవారిని తేలికగా ఆకట్టుకుంటుంది. సుబ్బి మా అత్తగారితో మాటల సందర్భంలో తన సంసారం గురించి చెపుతూ తనకి ఇద్దరూ ఆడపిల్లలే అనీ, తనను ఆడపిల్లలను కన్నందుకు తన భర్త ఎన్ని రకాలుగా హింసిస్తాడో చెప్పుకునేది. రోజూ రాత్రి భోజనాల సమయంలో ఆవిడ ఈ విషయాలని మాతో చెప్పేది.
*** *** ***
సాయంకాలాల్లో మేము ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటాము. ఒక రోజు మా ఆయన Human Reproduction గురించి పిల్లలకి చెపుతూ x x chromosomes కలిస్తే ఆడపిల్లలు, x y chromosomes కలిస్తే మగ పిల్లలూ పుడుతారని చెపుతుంటే సుబ్బి ఆయన దగ్గరకు వెళ్ళింది. సుబ్బి ఆయనను ఏదో విషయం అడగటం ఆయన ఏదో చెప్పటం నేను వంట ఇంట్లో నుంచీ గమనించాను.
*** *** ***
కొన్నాళ్ళకు సుబ్బి మళ్ళీ గర్భవతి అయింది. మావారికి విజయవాడలో ఒక కాలేజిలో ఎక్కువ జీతంతో ఉద్యోగం రావటంతో మేము షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ సుబ్బికి భర్త వేధింపుకు ఎక్కువ అయ్యాయి. మా అత్తగారికీ తన గురించి దిగులు ఎక్కువ అయింది. నెలలు నిండటంతో సుబ్బి ఆసుపత్రిలో చేరింది. కానుపుకి రెండు గంటల ముందు తాగి వచ్చిన సుబ్బి మొగుడు ఈసారి మగ పిల్లాడు పుట్టకపోతే నరికేస్తానని అల్టిమేటం ఇచ్చాడు. సుబ్బి బిక్క చచ్చిపోయింది.
*** *** ***
సుబ్బి ఖర్మో ఏమో గానీ ఈసారీ ఆడపిల్ల పుట్టింది. ఇంతలో దాని మొగుడు గదిలోకి వచ్చాడు.
అయితే "రేయ్ నా కొడకా y క్రోమోజోము ని పంపకుండా x క్రోమోజోము ని పంపుతావుట్రా!" అంటూ సుబ్బి పక్కనే ఉన్న సెలయిను బాటిల్ ని పగల కొట్టి దాంతో తననికొట్టటానికి వస్తున్న మొగుడిని పొడిచింది.
*** *** ***
నేను ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. మా ఆయన పెద్దగా నవ్వాడు.
"ఇలాంటి వాడికి తగిన శిక్ష పడింది." మా అత్తగారు అంది. ఆడపిల్లే తనకు మొదటి కానుపులో కావాలనే మా ఆయనతో నేను "x క్రోమోసోముని పంపకపోతే చంపేస్తాను," అన్నా. ఈసారి పెద్దగా నవ్వింది మా అత్తగారు.
13 comments:

the story is good. It is worth reading. a serious problem is handled in a simple and comic way.


చాలా బాగుంది. కథ, కథనం రెండు కూడ బాగున్నాయి.


పెద్ద పాయింట్ ని చాలా చిన్న కధలో అద్భుతం గా ఇమిడ్చారు. మీ కధ చాలా బాగుంది. Really an excellent effort. keep it up.


చక్కటి కథనం. బావుంది.


I have read about your blog in another blog. I am surprised at the way your blog is praised. After reading that blog i tried for your link and at last I found it in the same blog, in another post.

I'm stunned. It's written in a sensational way. Your story deserved the praise it got in the blog I read first. Keep it up Mr. Geethacharya.


కథ భలే ఉంది. మంచి పాయింట్ని ఎలా తమాషా గా చెప్పారో కదా. చివరి డయలోగుకి నాకు నవ్వు ఆగలేదు. కానీ కథ మాత్రం ఆలోచింప చేస్తున్నది.


పుట్టేబిడ్డ sex determinationలో క్రోమోజోముల పాత్రని తెలీక, ఆడదానివలనే ఆడపిల్లలుపుడతారనే సార్వజనిక అపోహని మంచి కథనంతో కథగా అల్లారు.

"x క్రోమోసోముని పంపకపోతే చంపేస్తాను" అని ఆడదంటే, మగాడి పరిస్తితి ఎలా ఉంటుందో చాలా సునిశితమైన హాస్యంతో చెప్పి, ఒక సీరియస్ సమస్యనెత్తి చూపారు.

మీకు నా అభినందనలు.


నిజంగా మీరు అద్భుతాన్ని సృష్టించారు. ఈ మాటలూ తక్కువే. ఒక చిన్న కథలో ఇంత పెద్ద స్కోప్ ఉన్న పాయింట్ ని ఇరికించటం మొదటి ఫుల్ లెంత్ బ్లాగుల్లోనే చేయటం అనుభవం ఉన్న వారికే సాధ్యం. కానీ మీ పేరుని నేను ఇంతక ముందు ఎప్పుడూ చూడలేదు. ప్రియ చెప్పింది నిజమే.

ప్రపంచం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఇదే. Imbalance of Gender ratio. Has-off.


చాలా బాగుంది కధ. అతి పెద్ద సమస్య ను చిన్న గా చిత్రించుతూనే అందులో ని చేదు నిజాన్ని చూపించారు. వెరీ నైస్ గీతాచార్య.


Good Story. When my sister's daughter had baby recently I asked did you know before whether you are having a boy or a girl? Then she said,'it is not allowed, the doctors make us fill up the form saying that we are not going to find out the sex of the baby during the scanning.'
I thought good job! At least now the baby girls who deserve wonderful life when they are born won't get killed before they are even born.
And when I come across this news it made me so sad.
I think we still need stories like this!
Keep up the good work!


చాలా బావుంది గీతాచార్య గారూ.... సస్పెన్స్ తొ కొంచెం చమత్కారాన్ని చిలకరించి కోల్పోయిన సామాజిక "స్పృహ"కి మీరిచ్చిన "గోళీ"- సోడా లా ఉంది.. ఈ రచన.ముఖ్యంగా నేను గమనించిన అంశం... సూటిగా...సుత్తిలేకుండా అన్నట్టుగా...కేవలం ఇదారు పేరాలలోనే విషయాన్ని ఇంజక్ట్ చేయడం... మీకు నా మనఃపూర్వక అభినందనలు. ---- మిత్రుడు సురేష్.


చాలా బావుంది గీతాచార్య గారూ.... సస్పెన్స్ తొ కొంచెం చమత్కారాన్ని చిలకరించి కోల్పోయిన సామాజిక "స్పృహ"కి మీరిచ్చిన "గోళీ"- సోడా లా ఉంది.. ఈ రచన.ముఖ్యంగా నేను గమనించిన అంశం... సూటిగా...సుత్తిలేకుండా అన్నట్టుగా...కేవలం ఇదారు పేరాలలోనే విషయాన్ని ఇంజక్ట్ చేయడం... మీకు నా మనఃపూర్వక అభినందనలు. ---- మిత్రుడు సురేష్.


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి