ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

ఖడ్గగీతం

ఈ కవితని కొంతమందన్నా చూసే ఉంటారు. చూడక పోతే ఇప్పుడు చూడొచ్చు.

"నేను జీవితం గడపటాన్ని ఇష్టపడను...
జీవించటమే నా ధ్యేయం.

నేను ముందు నడుస్తుంటే...
నాకేమి ఇస్తుందా అని...
కుతూహలంతో నన్నది అనుసరించాలి.

అమెజాన్ ఎదురుగ ఉన్న నాకు
లక్ష్యం ఆవలి ఒడ్డునుంటే...
ఈత రాని నేను ఎలా చేరేది?

నేనంటే నాకు చాలా ఇష్టం...
లక్ష్యం లేని జీవనం ఎంతో కష్టం.

అందుకే దూకాను ఈతరాని నేను
ఆ పెద్ద నదిలో...
సాధించాలనే ఆశల సడిలో.

చిత్రం చేరాను నా కల(ళ)ల తీరాన్ని
చదివేశానిక జీవితాన్ని.

అప్పుడర్ధమైంది నాకు
జీవితమంటే ఎదో కాదని...
అది ఒక కలల పందేరమని,
అంబరాన్నంటే సంబరమని."

ఇది నేను వ్రాసుకున్న "The Song of My Life" అనే లిరికల్ ప్రోజ్ లోని మొదటి, చివరి స్టాన్జా లకి స్వేచ్ఛానువాదం.

దాని ఒరిజినల్ ఆంగ్ల మూలం ఇది.

I don' wanna live my life...
I wanna lead it...

so that It must wonder
What I'm gonna give it.

*** *** ***

Then I came to know,

What the life is...

Life's a celebration...

Or Celebration of life,
IN THE NAME OF THE BEST WITHIN US.


మధ్యలో కొన్ని కొన్ని లైన్లు కూడా అనువదింపబడ్డాయి. కాకపోతే కాస్తెక్కడో తెగిన భావన. అనువాద కర్త చాలా కూల్ గా హాయిగా అనువదించి, ఆ ఎగ్రెషన్ ని అంతలా క్యాచ్ చేయలేక పోయానని నిజాయితీగా ఒప్పుకున్నారు. దానికో కారణం కూడా ఉంది. మధ్య మధ్యలో కొన్ని వాక్యాలని కూడా ఇందులో చేర్చటం.

ఇందాకెందుకో నేను మళ్ళా ఆ అనువాదం వద్దకు వెళితే కత్తి మహేష్ కుమార్ గారు ఆ ఇచ్చిన తొమ్మిది ఆంగ్ల వాక్యాలకీ అద్భుతమైన అనువాదం చేశారు. చివరి రెండు వాక్యాలు తప్ప మిగతాదంతా చెప్పలేని అనుభూతిని నాకు కలిగించాయి. అందుకే ఇలా మీతో పంచుకోవాలని ఇక్కడ అయన వ్రాసిన భాగం కూడా పెడుతున్నాను.

ఒకటి మాత్రం నిజం నేనే అనువదిస్తే వచ్చే ఫ్లేవర్ వేరుగా ఉంటుంది.

కత్తి గారి కవితానువాదం. ఇవాళ ఆయన చాలా చక్కని కవితలని వ్రాశారు. ఇది కూడా చూడండి.


జీవితాన్ని జీవించడం కాదు
సాధించడం నా ధ్యేయం
జీవితం నాకేమిస్తుందని కాదు
నేను తనకేమిస్తానో అని జీవితాన్ని
ఎదురుచూసేలా చెయ్యటం నా లక్ష్యం

ఆ తరువాత తెలిసింది
జీవితం సాధన కాదు
శోధన అంతకన్నా కాదు
జీవితమొక ఉత్సవం
జీవనమూల్యాన్ని
తెలుసుకునే సంబరం


మొత్తం 107 లైన్లున్న ఆ ఆంగ్ల Lyrical prose ని నేను ఇక్కడే త్వరలోనే ప్రచురిస్తాను

గీతాచార్య
11 comments:

అది మీ సొంత గీతమా?
ఇంటరునెట్టులో దొరికిన ఏదో పాట సాహిత్యం అనుకొన్నాను.

శబాష్ శబాష్

మరి పూర్తిగా ఇవ్వండి మరి.

మీకిన్ని బ్లాగులుండటం కొంచెం కన్ఫ్యూసింగా ఉంది. :-)


బాబా గారు,

తొలిసారి నా బ్లాగుకి వచ్చారు. Welcome.

మీరు మొదట ఈ Lyrical prose చూసింది నా బ్లాగు కాదు. అది సృజనది. అది వచ్చి కూడా చాలా రోజులైంది. ఎలా చూశారో కానీ కత్తిగారు అక్కడ అద్భుతంగా వారి అనువాదం కూడా పెట్టారు.

నేను అన్నీ ఒకచోటే ఉంటే బావుణ్ణు అని కత్తి గారిని పర్మిషన్ (వారి అనువాదాన్ని వాడుకునేటందుకు) రాత్రి అది ఇక్కడ పెట్టాను.

నేను ఎంతో passionate గా వ్రాసుకున్నది ఇది. అందుకే సాంగ్ ఆఫ్ మై లైఫ్ అని పేరు పెట్టుకున్నాను.

మొత్తం కవితని పెట్టాలనే ప్రయత్నం. ఒక మంచి సందర్భం చూసి పెడుతాను.

నా బ్లాగ్‍రోల్ సైడ్ బార్‍లో ఉంది. కన్ఫ్యూజన్ ఉండదు అది చూస్తే.

గీతాచార్య


పూర్తి కవిత పెట్టండి. అప్పుడు తలా ఒక చెయ్యేస్తే ఓ పనైపోతుంది.


గీతాచార్య గారు నేను మీ పోస్ట్ కు ముందే మహేష్ గారి అనువాదాన్ని చదివాను సృజనగీతం బ్లాగులో ..చాలా బాగా రాసారు ..వారిని అభినందించలనుకున్నా గాని ఏదో పని వల్ల కామెంటలేదు..చాలా మంచి కవిత ...రాసిన మీకు అనువదించిన సృజన,మహేష్ కుమార్ గారికి అభినందనలు .. మిగిలిన కవిత పోస్ట్ చేస్తే దాన్నీ ,దాని అనువాదం చదవాలని ఉంది :)


నేను జీవితం గడపటాన్ని ఇష్టపడను...
జీవించటమే నా ధ్యేయం.

నేను ముందు నడుస్తుంటే...
నాకేమి ఇస్తుందా అని...
కుతూహలంతో నన్నది అనుసరించాలి.

ఈ లైన్లు నాకు భలేగా నచ్చాయి. అద్భుతం అసలు! ఎంత ఎగ్రెషనూ?

మీ ఇద్దరు అనువాదాలూ బాగానే ఉన్నాయే! అయినా ఏమిటి ఇద్దరూ కవిత్వం మీద పడ్డారు?


Claps. That's all. ముచ్చటగా మూడు.


ippudu kavitala seasonaa?

monne Lyrical prose, daani anuvadam chadivaanu. Mahesh gari anuvaadam is a bonus.

mottam pettesey. kaasta aalasyam ainaa.


సుజాత గారి అనువాదం లోతుగా ఉంది.


సుజాత గారు ఎవరండీ?

యూ మీన్ సృజన? :-)She understands my spirit.

But any way the aggression was captured by Kathi garu.


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి