ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

భై హో జాన్ బు’కుక్క’నన్ దిమ్మ తిరిగింది








=














కిర్స్టెన్ పూర్వం

కొందరు భూస్వాములుండేవారు. సర్లే. భూస్వాములెందుకు కానీ వేరే రూపంలోకి వద్దాం. ఒక హల్వాన్ ఉన్నాడు. ఆడి దగ్గర కొంత మంది అదేదో నేర్చుకునే వాళ్ళు. నేర్చుకునే వాళ్ళు ఒకపాలి చుట్టుప్రక్కల ఊళ్ళలో పోటీలు పడి తగ గెల్చేశారు.

"మమ్మల్ని కొట్టే మొనగాడు ఏడీ ఏడీ ఏడీ" అని తెగ ఏడ్చి "లేరా మాతోటి గెలిచే వీరులెవ్వరురా? మగ ధీరులెవ్వరురా ఘనా ఘన శూరులెవ్వరురా?" అనుకుంటూ జబ్బలు చరిచి తొడ గొట్టి మీసం మెలేసి రెచ్చిపోవటం మొదలెట్టారు.

For every హల్వాన్ there always exists a పిట్టల్దొర అన్నట్టు, ఒక పిట్టల్దొర కొంత మంది కుర్రాళ్ళని వెంటేసుకుని వాళ్ళకి కొన్ని పిట్ట కథలు చెప్తూ, దారిలోకి తెచ్చి పోరాడటం నేర్పి వాళ్ళతో కల్సి వెళ్ళి హల్వాన్ ఊరు వెళ్ళి వాడి శిష్యులని సవాల్ చేసి గెల్చి వచ్చాడు.

పాపం కొంత కాలానికి పిట్టల దొర కుర్రాళ్ళకి ఇళ్ళకాడ కాపలా ఉంటుందని ఒక ఆల్సేషన్ కుక్కని కొనుక్కొచ్చాడు. క్ఖర్మకాలి కుక్క హల్వాన్ గాడి ఊరిది. దానికి పిట్టల్దొర అంటే గుర్రు. మా ఊరోళ్ళనే కొట్టే మగాడా ఈడు అని. కానీ కుక్క ఈడు నిజంగానే మగాడని, ఆడు కుక్క పక్కూళ్ళోనే చొక్కా దీసి మరీ చూయించాడనీ మర్చిపోయినట్టున్నాడు.

కానీ కాలం ఖర్మం కల్సిరానప్పుడు అన్న టైపులో ఆల్సేషన్ కుక్క పిట్టల్దొర ఊళ్ళో ఒక గ్రహణం మొర్రి గాడిని అడ్డం పెట్టుకుని పిట్టల్దొరని ఊళ్ళో నుంచీ తరిమించేసింది. తగూలెడతాడు. అని.

మనోళ్ళాకి కుక్క బుద్ధి అర్థం అయే సరికి ఊరి పరువు కాస్తా పెపంచకం ముందు పోయింది. పక్కూరి బొడ్డూడని పిల్లగాళ్ళ చేతిలో ఓడిపోయారు.

నేను కుర్రాళ్ళని ఏదో చేసి యాడికో తీసుకుని పోదాం అంటె ఆళ్ళు ఆళ్ళళ్ళో ఆళ్ళే కొట్టుకుజచ్చి నా మాట ఇనలేదు. ఇక పాలి ఇలాంటి నాయాల్లకి నే జెప్ప అంటూ ఆల్సేషన్ కుక్క తన ఊరికి యెల్లిపొనాది.

పిట్టల్దొర మాత్రం తన మళ్ళా తన ఊరోళ్ళ మనసులు గెల్చుకుని తన పని తను చూసుకోసాగాడు.

కిర్స్టెన్ శకం ఎనిమిత్తొమిది సమ్వత్సరాలు

ఇండియన్ హల్వాన్ లీగ్ అని ఒక గుంపు జేరి ఇప్పుడు అదేదో ఆటలు ఆట్టం మొద్లఎట్టారు. ఒక బొల్లిచెక్క బుద్ధూషా పిట్టల్దొర ఊరి టీమ్ ని కొని ఆళ్ళకి ఆల్సేషన్ కుక్క ఊరిదే మరో డాబర్మాన్ కుక్కని తెచ్చి కాపలా బెట్టిండు. ఒక సమస్తరం ఎలాగో ఆగినా రెన్డో పాలి మాత్రం మల్లా పిట్టల్దొర మీద బడి రక్కినంత పని చేసి ఊళ్ళో నుంచీ తరిమేసి తస్సదియ్యా పోరగాళ్ళకి కోచింగిచ్చినాది కదా... ఇక బొడ్డూడని పిల్లగాళ్ళే కాదు. ఆళ్ళ కమ్టే సిన్నోళ్ళ జేతిలోకూడా నానా దెబ్బలూ తిన్నారు.

This is గీతాచార్య speaking

మనోళ్ళకి ఫారెన్ సరుకు మీద మోజెక్కువ. అందులోనూ మధ్య ఆస్త్రేలియన్ సన్నాసోళ్ళ మీద మరీనూ. వాళ్ళేదో గెలుస్తున్నారు కదా వాళ్ళ స్పిరిట్ ని అందుకోండిరా అంటే ఊఁహూఁ వాళ్ళ కేతిగాళ్ళని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం వాళ్ళని కూడా గెలవ వచ్చు అని చూపించిన గంగూలీ. అందుకే అందిన అన్ని వనరులనీ ఉపయోగించుకుని ఎక్కడ సందు దొరికినా గంగూలీ మీదకి తెస్తారు.

ఐనా కల్కటాకి McCullum ఎలా కెప్టైన్ అవుతాడు? తన జట్టుకే కెప్టైన్ కాలేని వాడు?

Too many cooks అని సామెజ్జెప్పిన ఇంగ్లీషోడే మల్లా బహుళ కెప్టెన్సీ తేవటం ఏమిటి?

దేశం లో ఎవరూ లేనట్టు జాన్ బుకుక్కనన్ గాడే ఎక్కడ దొరికాడు బొల్లిచెక్క బుద్ధూషా కి?

గట్టిగా కొత్త వ్యూహం పన్నితే సమాధానం చెప్పలేని బుకుక్కనన్ గాడు (బూడిద సీరీస్ 2005 యాదికి దెచ్చుకోండి reverse swing దెబ్బ) గంగూలీ జట్టుకి కేతిగాడా?

ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో గంగూలీ కన్నా ఘోస్ట్రైడర్స్ జట్టులో ఎవరికి తెలుసు?

మన జాతీయ హీరోని ఒక ఆస్త్రేలియన్ కేతిగాడు అవమానిస్తుంటే మనకి పండగ. బెంగాలీలు ప్రశ్నిస్తే మనకి బాధ. మనం సన్నాసోళ్ళం. సరే. బెంగాలీల మీద పడి ఏడవటం దేనికి?

ఐనా ఇది Indian Premiere Leaగా లేక ఆస్త్రేలియన్ ప్రీమియర్ లీగా? మన కుర్రాళ్ళకి అంతర్జాతీయ అనుభవం రావటం ముఖ్యోద్దేశ్యం (???) అని చెప్పబడే పోటీల్లో ఇంకా విదేశీ ఆటగాళ్ళు ఉండాలని బుకుక్కనన్ అంటే మన వాళ్ళకి చీమైనా కుట్టినట్టుండదా?

ఆఖరికి Stefen Fleming నయం. ఇది భారతీయ కుర్రాళ్ళకి ఉపయోగ పడాలి కానీ ఇదేమీ World premiere League కాదు అని చెప్పాడు. గంగూలీ మీద ఆస్త్రేలియన్ కేతిగాళ్ళకి ఉన్న కోపం జగమెరిగినదే. ఐనా మన వాళ్ళకి సిగ్గు శరం ఉండదు.

అందుకే మన మీద పడి బుకుక్కనన్ గాళ్ళు రాజ్యం ఏలుతున్నారు.

ఈసారి ఏమైనా Kolkata Ghost Riders ఒక్క match కూడా గెలవకూడదు. నిన్న కుంబ్లే టీం మంచి షాక్ ఇచ్చింది. చిత్తు చిత్తు కావాలి ఎవరన్నా రెండొందల పరుగులతో వాళ్ళని ఓడించాలి. అప్పటికి గానీ తన వల్ల కాదు గెల్చింది... వార్న్, McGrath లాటి హీరోల వల్లా, Steve Waugh లాటి సారథుల వల్లే విజయాలు సాధ్యం అయ్యాయని బుకుక్కనన్ కి తెలిసిరాదు.

సెగ్గీ నువ్వే పూనుకుని పని సాధించాలి. గురువు ఋణం aతీర్చుకో.

టేలర్ కొట్టిన దెబ్బకి pబుకుక్కనన్ కి దిమ్మతిరిగింది.

గంగూలీ ని వెనకేసుకుని రావటం నా Brahminical prejudice అన్న నా మిత్రుడొకడు బు’కుక్క’నన్ అన్న మాటకి అభ్యంతరం చెప్పాడు. కానీ అరగంటయ్యాక వాడే మాటలసందర్భంలో మాదిగ NK (క్షమించాలి) అన్న పదం వాడాడు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐనా ఆస్త్రేలియన్ జాతోళ్ళ సంస్కార హీనత్వం గురించి చెప్పలేం.

ఒక చిన్న కథ. నిజంగా జరిగింది.

ఒక International Conference కి వెళ్ళాను. అక్కడ 2003 world cup final లో Ricky Ponting అంతలా రెచ్చిపోయి ఆడటానికి కారణం గంగూలీయే కారణం అని Astralian మిత్రుడు (బాలకృష్ణ మిత్రుడు కాదు) అన్నాడు.

ఎలా అంటే లార్డ్స్ లాంటి పవిత్ర (??? షాంపేన్ బాటిళ్ళతో...) మైదానంలో చొక్కా విప్పి అపవిత్రం చేసిన గంగూలీ ఈసారి ఏకంగా ప్రపంచ కప్పే గెలుస్తే పాన్ట్ విప్పదీసే లాంటి ఆటవిక పని చేస్తాడని భయపడ్డాడు అని.

మరి ముమ్బై మనకి పవిత్రం కాదా? ముమ్బాదేవి పేరు కదా? ఫ్లింటాఫ్ చేసింది? అది ఆటలో భాగమైతే గంగూలీదీ అంతే కదా.

అందులో ఆటవికం ఏముంది? ఇదీ Astralian mentality.

బుకుక్కనన్ గురించి వార్న్ చేసిన, గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా?

అగార్కర్ ని జాతివివక్ష వ్యాఖ్యలు చేయటం సంగతేంటి మరి?
0 comments:

Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి