Showing posts with label Flashback.... Show all posts
ఇంద్రధనస్సు - The Rainbow
8:37 AM
"CHAMPIONS ARE COLORFUL"Andre Agassi... ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది.

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులుంటాయి.
ఆ
ఏడు రంగులనూ కలిపితే నే మనకు తెలుపు రంగు వస్తుంది. అంటే తెలుపులోనే ఏడు రంగులూ ఉంటాయి.
అందుకే "వింబుల్డన్" లో తెల్లని దుస్తులనే వాడాలని నియమం పెట్టి ఉంటారు.
Agassi Black and White photo ఇది. అయినా ఎంత Colorful గా ఉన్నాడో చూడండి.ఇప్పుడు రంగు రంగుల దుస్తుల్లో. ఆ glamor వేరు. అందుకే అతనంటే అప్పట్లో అమ్మాయిలకి ఆరాధన. సిసలైన యువకుడు.
అందుకే నన్నాకర్శించాడు తోలి చూపులోనే. అలా మైకేల్ స్టిచ్ తరువాత నాకు నచ్చిన మరో స్టార్. నిజమైన స్టార్. ఎందుకంటే తళుక్కున మెరుస్తాడు కదా!
1991 Photo అనుకుంటాను.
Practice చేస్తూ.
అందుకే "Champions are colorful." అలా ఉంటేనే అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. అందులోనూ చిన్న పిల్లలని.
ఆ backhand కొట్టే stylke చూడండీ. Glamor magic.
నా మనసు కొల్లగొట్టింది ఇప్పుడే...
1992 Wimbledon Trophy తో.
తెల్ల బట్టల్లో ఇంద్రధనస్సు.
ఆటలో పదను ఏమాత్రం తగ్గలేదు. Pegion Toes Agassi.
విషాదం లో నవ యువకుడు. ఏడుపులోనూ ఉందోయ్ glamor.
గుండునే Fashion చేసిన మొనగాడు.
వంద మిలియన్ డాలర్ల నవ్వుల్ నవ్వుల్.
అగస్సి గురించి మరో బ్లాగ్ లో ఇంకా... ఇంకా...
అప్పటి దాకా...సెలవ్!
వింబుల్డన్ సామెత: "గ్లామరున్నోడు ఎన్ని డ్రెస్సులు అయినా వేయొచ్చు."
నెక్స్ట్ పోస్ట్ ఈజ్ "అందరికీ వైరల్ ఫీవెర్... నాకు అగస్సీ ఫీవెర్!"
మన పంథా: "Winning is a fashion. Victory is a passion."
గెలిచే వాడే మనిషి - 2
6:51 AMఅబ్బ! ఈ పేరు గురించైతే ఈ మధ్యనే నాకు గంటసేపు తలంటి పోయటం జరిగింది. అదెలాగో మీకు త్వరలోనే తెలియవచ్చు. కానీ నేనే గెలిచాను. :-)) హ హ హ.
సరే విషయానికి వద్దాం. ఎక్కడ ముగించాం? అంతే దెబ్బకు నేను మైకేల్ స్టిచ్ కి అభిమానిని అయిపోయాను. ఎక్కడికెళ్ళినా నేను స్టిచ్ మంత్రమే. ఐతే అది కొంత కాలమే! తరువాత మనకి 'మహాకాళాన్ని మట్టుపెట్టిన ఇవాన్' దొరికాడు. వాడు టెన్నిస్ ఆటగాడు కాదు. (ఆ స్టోరీ వేరే చెప్తాను). కానీ నా మీద మైకేల్ స్టిచ్ వేసిన ఎఫ్ఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఎక్కడో ఔట్ సైదర్ అయిన తను బెకేర్ అంతటి మొనగాడి మీద గెలవటం? గ్రేట్. ఎన్ని గట్స్ ఉండాలి? అందులోనూ మూడే మూడు సెట్ లలో గెలవటం?
నేను బడికి (కొత్త బడి. నేను పది క్లాసులని ఏడు బళ్ళలో చదివాను. బళ్లంటే ఎద్దు బండీలు కాదు. ఇస్కూలు బడి అన్న మాట. సారీ తమ్ముడి మాట.) వెళ్ళగానే శర్మా మాస్టరు మీ నాన్న గారి పరువు నిలబెట్టాలంటే మొదటి రాంకు రావాలని వార్నింగ్ ఇచ్చాడు. నాకేమో ఆయనంటే చచ్చేంత భయం. అస్సదురు మొదటి పిల్ల ఎవరా? (ఖచ్చితంగా నాకు అమ్మాయిలకే మొదటి రాంకు వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఆ రాంకు విషయం లో అమ్మాయిలతోనే ఎక్కువ పోటీ పడింది) అని వెతుకులాట మొదలెట్టాను. అబ్బాగా చదివే అమ్మాయి పేరు ఐశ్వర్య అని కర్తవ్యం విజయశాంతి లెవెల్లో నాకు సుబ్రహ్మణ్యం సారు (శర్మ గారి అన్నయ్య) చెప్పారు. మొదటి రాంకు రాకుంటే తాట తీస్తానన్న శర్మా మాస్టరు వార్నింగు, సుబ్రహ్మణ్యం గారి కర్తవ్య బోధనా కలిసి నన్ను ఇరకాటంలో పడేశాయి. ఇంతలో చిన్నమామయ్య పెళ్లి కావడంతో వెళ్లి వచ్చాను. అదో పది రోజులు రక్షించింది.
ఈ గొడవ ఎట్టా తీరునా అనుకుంటుంటే ఇదో ఇలా స్టిచ్చి అనగా కొండ చిలివ గెలిచాడు. వాడేదో నెంబరు వానను ఆటగాడనుకుంటే... బెకేర్ కి ఉన్న చరిత్ర లేదని నాన్న చెప్పాడు. అద్గదీ అప్పుడే నాకూ ఒక ధైర్యం వచ్చింది. బెకేర్ లాంటి ఆటగాడినే స్టిచ్చి ఓడించగా లేంది మనకప్ఫలానా కర్తవ్యం ఐశ్వర్య ఒక లెక్కా అనుకుంటూ బరిలోకి దూకాం. చూశారా చిన్న వయసులోనే గెలుపంటే ఎంత ప్యాషనో! ఎవరికుండదు చెప్పండి?
"When odds are against you, you have to prove yourself to others. But when the odds are in favor of you, you have to prove only to yourself. But I don't prove to others. Because I never felt yhe odds are against me." - Pete Sampras.
వింబుల్డన్ సినిమా టైటిల్: గెలుపు - దీనికి రుచెక్కువ.
మరో విషయం. ఇదే కాదు. చాలా ఉదంతాలు చెప్పాలి. మొన్నీ మధ్య యూఎస్ ఓపెన్ గెలిచే రోజుల్లో FedEx మొహం చూశారా? ఒక రకమైన కసి. ప్రతి పాయింట్ నూ కొండని పిండి చేసేటంత కసి తో ఆడాడు. ఎందుకు? పాపం ఈ సంవత్సరం మొదట్లో ఉదార సంబంధమైన వ్యాధితో తను బాధ పడ్డాడు. గత సీజన్ ధాటికి అలిసిపోయాడు. మూడోసారి ఫ్రెంచ్ మిస్సయే సరికి కొంచం డీలా పడ్డాడు. దానికి తోడు వింబుల్డన్లో రాఫా ఐదు సెట్లకి స్ట్రెచ్ చేయటం తనకు కొంచం ఇబ్బంది పెట్టే విషయం. మళ్ళీ యూఎస్ లో జొకోవిక్ స్కోరు చూస్తె తేలిక గానే ఓడినా, తనని కంగారు పెట్టాడు.
అందుకే ఈసారి తను అలసటగా సీజాన్ని మొదలెట్టాడు. అంతే మన విమర్శకులకి మేత దొరికింది. వీళ్ళకి పనేమీ ఉండదు.
వింబుల్డన్ సినిమా టైటిల్: విమర్శకులు - వీళ్ళకి మేత కావాలి.
ఎలాగెలగా? ఫెదెరెరు ఆట్టం లేదు. ఇక ఇతని పని అయిపోయింది. దీనికితోడు జొకోవిక్ Australian Open గెలవటం తోనే ఇక ఇతనే నెంబరు వన్ను అన్నారు. మధ్యలో రాఫా ఉన్నాడనే సంగతి మర్చిపోయి. "ఇక నేనే నెంబరు వన్ను. కురుక్షేత్రమే ఎదురైతే.... మోసగాళ్ళకు మొసగాణ్ణీ రా" అంటూ వచ్చిన "నానీ" సినేమా గతే జొకోవిక్ కీ పట్టింది. రాఫా రెచ్చి పోయి నెంబరు వన్ను నేనే అని చెప్పలేదు, అయి చూపిస్తే... ఇక FedEx విషయానికి వద్దాం. ముందు Australian Open తర్వాత కొంత ఫాం కోల్పోయాడనేది నిజమే. జనానికి కావాల్సింది అదేగా. (నాక్కావాల్సిందీ అదే. విషయం తరువాత టపాల్లో వస్తుంది). అంత మాత్రాన అతని పనైపోయినట్లేనా?
కొంత కాలం గడిచింది. విమర్శల జడివానలో తడిసి ముద్దయ్యినందువల్ల పడిశం పట్టిందో, లేక నిజంగానే అలసి పోయాడో ఏమో కానీ FedEx కొంచం డీలా పడ్డాడు. పైకి కాదు. దాంతో ఫ్రెంచ్ లో ఆటను ఆడాడు అదీ పెద్ద తేడాతో. మేత గాళ్ళకి ఇక టైము వచ్చింది. ఫెదరర్ శకం ముగిసినట్టేనా? అని ఊహాగానాలు మొదలెట్టారు. అందరి గొంతులూ బాగోవుగా! అందుకే పాటలు అంత హిట్ కాలేదు. అయినా వాళ్లు పాడిందే పాత్రా... అన్న చందాన రెచ్చి పోతూనే ఉన్నారు. వింబుల్డన్ లో ఓడగానే ఇక బహిరంగంగానే కచ్చేరీలు మొదలెట్టారు. దుబాయి స్టేజ్ షోలూ వగైరా వగైరాలూ.
వింబుల్డన్ సామెత: చాంపియన్లు నడుస్తుంటే విమర్శకులు మొరిగినట్టు.
ఒలింపిక్స్ లో పేస్ ని ఓడించి డబుల్స్ గెలవడమే కాదు. కావాలంటే ఏదయినా నేను చేయగలనని తనకు తానూ నిరూపించుకున్నాడు FedEx . చామ్పియన్లకి ఎవరికో నిరూపించుకునే పని ఉండదు. కేవలం తమకు మాత్రమె బాధ్యులు. ఈ విషయాన్ని సాంప్రాస్ బాగా చెప్పాడు. ఆ నమ్మకంతోనే యూఎస్ ఓపెన్ లో రెచ్చి పోయి ఆడాడు. ఆ కసి గురించి Olympic Tennis - 2 లో చెపుతాను. గెలిచేవాడే మనిషి ఇక్కడికి పూర్తయింది. నా ఈ టైటిల్ గురించి ప్రశ్నించిన రొమాంటిక్ కామెడీ హీరోయిన్ గారికి టైటిల్ ఎందుకు పెట్టానో అర్ధం అయి ఉంటుంది.
మన పంథా: Winning is a fashion. Victory is my passion.
కొస మెరుపు: నాకు స్టిచ్చి ఇన్స్పిరేషన్ తో మొదటి రాంకు వచ్చింది. ఆ మర్నాడే కుమారి పిన్ని నాకు ఆడ పిల్ల వేషం వేసి ఫోటో తీయించింది. చూశారా విధి ఎంత బలీయ మైనదో!
Next post is 'Champions are colorful'.
గెలిచే వాడే మనిషి.
9:20 AMMY FIRST WIMBLEDON HERO
"సాహసం చేయరా డింభకా! రాకుమారి నిను వరిస్తుంది." అని పాతాల భైరవి లో నేపాళ మాంత్రికుడు అంటాడు తోటరాముడు తో. మైకేల్ స్టిచ్ కి ఈ విషయం ఎవరన్నా చెప్పారో లేదో
నాకు తెలీదు. పదిహేడేళ్ళ నాడు వింబుల్డన్ లో పెను సంచలనాన్ని
సృష్టించాడు. సరిగ్గా పై డయలోగే నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. ఈ విషయాన్ని
తలుచుకుంటుంటే.
మైకేల్ స్టిచ్ గురించి చెప్పాలంటే...
Michael Stich (born October 18, 1968 in Pinneberg, West Germany) is a
former professional tennis player from Germany. He is best remembered
for winning the men's singles title at Wimbledon in 1991. He also won
the men's doubles titles at both Wimbledon and the Olympic Games, and
was a singles runner-up at the US Open and the French Open.
ఈ మాత్రం వివరాలు ఎవరికైనా దొరుకుతాయి. అందుకే నేను చెప్పేది వినండి.
అది 1991 లో ఒక ఆది వారం. మా మురళీబాబు నాకు ఒక Bourne Ultimatum జారీ చేశాడు. నేను ఆ రోజు సాయంత్రం కల్లా టెక్స్ట్ బుక్కులోని తను గుర్తుపెట్టిన లెక్కల్ని చేయక పోతే దెబ్బలు తప్పవని. నేను వరుసగా నాలుగు రోజులు స్కూలుకి వెళ్తూనే ఉన్నాను. మరి తనకి ఏమొచ్చిందో నాకు తెలీదు. కానీ అది ఒక వ్యక్తీ జీవన గమనాన్ని మార్చేస్తుందని ఆయన ఊహించి ఉండడు.
వింబుల్డన్ సామెత: "కరవమంటే బెకేర్ కి కోపం... విడవమంటే స్టిచ్చికి కోపం."
ఆ రోజు నాకింకా గుర్తు. మురళీబాబు దాడి నుంచీ తప్పించుకునేందుకు నాకు అప్పటిదాకా ఏ ఉపాయం తోచలా. అందుకే నేను ఏమి చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న ఊరినుండీ తిరిగి వచ్చాడు. రాగానే కొంచం కాఫీ త్రాగి టీవీ పెట్టాడు. ఆయన ఏవేవో ఆటలు వస్తే చూస్తాడని నాకు తెలుసు. ఆయన ఆటలని చూస్తున్నప్పుడు ఎవరూ కదిలిన్చరు. కొప్పడుతారని కాదు ఆయనని ఆ కాస్త సమయంలోనైనా విశ్రాంతి గా గడుపుతారని.
అంతే నాకు ఉపాయం తోచింది.
వింబుల్డన్ సామెత: "ఉపాయం తోచని వాడిని వింబుల్డన్ లోనుంచీ తోసేయండి."
నేను ముద్దు గా వెళ్లి నాన్న వళ్ళో కూచున్నాను. ఆయన నవ్వుతూ నన్ను కూచోపెట్టుకున్నారు. ఇంతలో రమా పిన్ని వచ్చి నన్ను ఆయనని తోక్కొద్దు అంది. "ఇదిగో రమాదేవీ! కొంసేపు కూచుంటే ఏమవుతుంది? వాణ్ణి కాసేపలా వదిలేయండి," అన్నాడు. "సరే రాజా మామయ్యా!" అంటూ తను సైలెంట్ గా వెళ్ళిపోయింది.
అప్పుడే బెకెర్ ఒక అద్భుతమైన డైవింగ్ వాలీ కొట్టాడు. నాకు ఇంట్రెస్ట్ అనిపించి, "నాన్నా! ఎవరు?" అన్నాను.
"వాడి పేరు బోరిస్ బెకెర్."
"అంటే కప్పా!"
"కాదు."
అయినా నాకు కప్పే బాగుంది, అలాగే ఫిక్స్ అయ్యాను. ఒకసారి బెకెర్ unforced error చేస్తే నాన్న బెకెర్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అని అన్నాడు. మరోసారి వాలీ మిస్ అయితే నేను "కప్పగాడు బెక్ బెక్," అన్నా.
ఇంతలో ఒకండు చూడ చక్కని వాలీ వేశాడు. "నాన్నా! వీడెవడు?" అన్నాను.
"మైకేల్ స్టిచ్."
"అంటే?"
నాన్న కుట్లూ, అల్లికలూ అని ఏమీ చెప్పలేదు. ఇంతలో కుమారి పిన్ని "వాడు కప్ప అయితే, వీడు పాము," అంది. ఏ పాము అని ఆలోచించి "వీడు కొండ చిలువ" అని నామకరణం చేశాను.
చూడండి. మనం ఏమరు పాటు గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా కొండ చిలువ మన మీద పడి "వివాహ భోజనంబు..." అనుకుంటుంది. అలాగే ఆ రోజు మా కప్ప గాడు ... అదే బెకెర్, టైటిల్ నాదే అని ఏమరు పాటు గా ఉన్నట్టున్నాడు.
నేను నామకరణం చేసిన ముహూర్త బలమో ఏమో కానీ, మైకేల్ స్టిచ్ తొలిసెట్ ని 6-4 తో గెలిచాడు. ఇంతలో యాడ్స్ వచ్చాయి. అప్పుడు నాన్న నాకు ఒక రఫ్ పేపెర్ మీద టెన్నిస్ కోర్ట్ బొమ్మ గీసి ఆటని వివరించారు. ఆ పేపెర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అయితే అన్ని రూల్సూ నాకు తెలియలేదు కానీ స్థూలం గా నాకు ఆట మీద అవగాహన వచ్చింది.
మ్యాచ్ మళ్ళీ మొదలైంది. స్టిచ్ మరో విన్నెర్ బాదాడు. నేను ఆనందంతో గంతులేశాను. ఇంతలో నా పాలిటి విలన్ మురళీబాబు వచ్చాడు. అయితే నా పన్నాగం ఫలించి ఆయన నన్ను, నాన్నని డిస్టర్బ్ చేయలేదు. 7-6 తో స్టిచ్ రెండో సెట్ గెలిచాడు. నా ఆనందానికి అవధులు లేవు. మరి స్టిచ్ నాకు ఎందుకు నచ్చాడో తెలీదు. బహుశః గెలుస్తున్నాడని కాబోలు. అంత చిన్న వయసులోనే "ఎవరికైనా గెలిచే వారే నచ్చుతారు".
ఇంతలో నాకు నిద్ర టైమయింది. నేను మంచమెక్కాను. కానీ నాకు నిద్రలోనూ నా హీరో ఆలోచనలే. మధ్యలో లేచి "నాన్నా! ఎవరు గెలిచారు?" అన్నాను.
"రెండు రౌండ్లు స్టిచ్చే గెలిచాడు. వాడే గెలుస్తాడులే."
తెల్లారింది. పేపెర్ వచ్చింది. నేను అందరికన్నా ముందే లేచి కూచుని అందరికన్నా ముందే పేపెర్ తీసుకుని న్యూస్ చూద్దును కదా... "బెకెర్ బోల్తా". అది ఆంద్ర జ్యోతి.
మన పంథా: "గెలిచే వాడే మనిషి."
Note: నాన్నని డు డు అంటున్నాడు అనుకుంటున్నారా... మా నాన్న నన్ను జీవితంలో ఒకే ఒక్కసారి కొట్టాడు. కారణం... "సత్యమేవ జయతే" లో చెపుతాను. అంతదాకా సెలవ్.
(సశేషం)
NEXT BLOG IS: "OLYMPIC TENNIS".




