హమ్మయ్య. ఒలింపిక్స్ మత్తు దిగింది. మైకేల్ ఫెల్ప్స్ అష్ట స్వర్ణాల సంబరమూ దిగింది. నాదల్ కి ఒలింపిక్ స్వర్ణం వచ్చిన ఆనందమూ వదిలింది. విలియమ్స్ సిస్టర్స్ డబుల్స్ స్వర్ణం నెగ్గారనే సంతోషమూ తగ్గింది. భారత్ కి మూడొచ్చిందన్న ఖుషీ గాయబ్ అయింది. ఇహ ఎమోషన్స్ వదలటంతో ఈ టపాని హాయిగా మొదలెట్టాను.
ఈ ఉపోద్ఘాతం దేనికంటే... ఆ పైన వివరించిన ఆనందాలని అనుభవిస్తూ వ్రాస్తుంటే మన ఎమోషన్స్ డామినేట్ చేసి అసలు విషయాన్ని ప్రక్కద్రోవ పట్టిస్తాయి. అది నాకు ఇష్టం లేదు. వీలైనంత బ్యాలన్సుడ్ గా వ్రాయాలన్నదే నా అభిమతం.
సరే! విషయానికి వద్దాం. ఇంతకూ ముందు చెప్పిన మాటనే ఇక్కడా చెబుతున్నాను. "మనకి ఐదు వేళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని పొడుగువి. కొన్ని పొట్టివి. కొన్ని లావుగా ఉన్నాయి. మరికొన్ని సన్న గా ఉన్నాయి. సన్న గా ఉన్న వేళ్ళు లావు వేళ్ళని, లావు వేళ్ళు సన్న వేళ్ళని శత్రువులుగా చూస్తే మన చేతి పరిస్తితి ఏమిటి? అలాగే లైం లైట్ లో లేని వాళ్లు ఉన్నవాళ్ళని తిట్టుకుంటే ఏమొస్తుంది?"
"సాక్షి" పత్రిక లో "డబుల్ ధమాకా" అని ప్రతి ఆదివారం ఇస్తుంటారు. అందులో ప్రముఖుల్ని కొనదరిని ఇద్దరిద్దరుగా Interview చేస్తుంటారు. అందులో ఒక సారి పుల్లెల గోపీచంద్, వీ వీ ఎస్ లక్ష్మణ్ ని Interview చేశారు. అందులో... గోపీచంద్ ని ఈ విషయమే అడిగితే ఎంత చక్కగా సమాధానం చెప్పాడో చూడండి.
ప్రశ్న: "క్రికెట్ కీ, క్రికేతర్లకీ ఇచ్చే ఆదరణ వేరే క్రీడలకీ, క్రీడాకారులకి ఇవ్వకపోవడం న్యాయమేనా?"
గోపీచంద్: "న్యాయంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఒక్కో దేశం లో ఒక్కో స్పోర్ట్ ని ఎక్కువగా ఆదరిస్తారు. ఇండోనేషియాలో, మలేషియాలో బ్యాడ్మింటన్ నెంబర్ వన్ క్రీడ. ఇండియా లో కూడా అలానే ఉండాలని రూల్ లేదే. ప్రపంచం లో ఎక్కడైనా ఏ రెండు ఆటలూ, ఆటగాళ్ళూ సమానం కాదు. దానికో ఉదాహరణ చెబుతాను. నేనోసారి జర్మనీ వెళ్ళినప్పుడు రోయింగ్ లో 48 ప్రపంచ, మరియూ ఒలింపిక్ టైటిళ్ళు గెలిచిన 40 ఏళ్ల మహిళను కలిశాను. ఆమె అక్కడ కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.మరి అదే దేశానికి చెందినా మైకేల్ షూమేకర్ ఎంత పాప్యులర్. అతని ఒక్క వారం సంపాదన ఆమె ఆజీవన సంపాదనకి సమానం. ఇద్దరికీ పోలికేక్కడ? నా దృష్టిలో పోలిక ఉండాల్సిన అవసరం కూడా లేదు. అందరూ నా లాగా అనుకోక పోవచ్చు. అలాంటి వారికి నేనొక్కటే చెబుతాను. 'బాగా కష్ట పదండి. మీ గేమ్ కి మంచి గుర్తింపు తీసుకు రండి. వాతన్నిటితో పాటూ మీ స్పోర్ట్ ని సరిగా మార్కెట్ చేసుకోండి,' అని. సానియా సక్సెస్ టెన్నిస్ కి పాప్యులారిటీ ని తీసుకుని రాలేదా? ఏ ఆటైనా అంతే. Others should also get their act together instead of cribbing."
దీనికి లింక్...
http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=5787&categoryid=11&subcatid=25
ఏమంటారు?
ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఒలింపిక్స్ వచ్చిందాకా మనకి బాక్సింగ్ గుర్తుకు రాదు. రెస్లింగ్ అసలే తెలీదు. (పిల్లలు WWE చూస్తారు. అది వేరే విషయం). ఒలింపిక్ క్వాలిఫైయింగ్ మ్యాచుల దాకా ఎవరికీ హాకీ పట్టదు. కానీ ఒలింపిక్స్ లో స్వర్ణం కావాలి. అదేమంటే క్రికెట్ మీద పడి ఏడుపు ఒకటి. 1983 దాకా క్రికెట్ అంతే ఎవరికీ ఇప్పటంత పిచ్చి లేదు. ఇంకో మాట చెప్పు అంటారా? సరే అంతగా పాప్యులర్ కాదు. కానీ ఒక్క విజయం ఆ ఆట గతినే మార్చేసింది. దాన్ని సరిగా మార్కెట్ చేసుకోగలిగారు.
ఇప్పుడు బింద్రా షూటింగ్ లో స్వర్ణం గెలిచాడుగా... మార్కెటింగ్ చేసుకో గలిగితే గతం కన్నా నయం గానే ఉంటుంది పరిస్తితి.
ఆయినా హాకీ హాకీ అంటుంటారు. అందులో ఏమి సాధించారు? అష్ట స్వర్ణాలంటారా? అది ancient history. కోపం వద్దు. 1975 తర్వాత తరం వాళ్ళకి హాకీలో ఘన విజయాలేమి తెలుసు? అదే క్రికెట్ అంతే... 1983 world cup, 1985 world series cup, madhyalo Sachin, Ganguly, Dravid, Kumble, ఇప్పటి Dhoni, అప్పట్లో Kapil, Srikanth, Gavaskar... ఎంత మంది superstar లని? మన టెన్నిస్ ని బ్రతికించింది Leander, Bhupathi లు కాదా? వ్యక్తులే ఆయా ఆటలని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కపిల్ కొట్టిన 175 మన క్రికేర్ చరిత్రనే మార్చింది. మరి అంత రేంజ్ లో గ్లామర్ ఉన్న superstar లు ఇతర క్రీడలలో ఎవరొచ్చారు? Prakash Padukone తరువాత గోపీచంద్ వరకూ బ్యాడ్మింటన్ లో ఎవరు వచ్చారు? Dhanaraj Pillai, Mukesh Kumar కాకుండా వేరే హాకీ స్టార్ ల పేర్లు మూడు తడుముకోకుండా చెప్పండి? పాపం వాళ్లు మాత్రం ఎన్నాళ్ళని లాగ గలరు? 'అంగట్లో అన్నీ ఉన్నాయ్ హాకీ పెద్దేమో గిల్' అన్నట్టు ఉన్న పరిస్థితి.
Leander Paes లేకుంటే 1990 ల తరం వారికి భారత్ లో టెన్నిస్ గురించి ఆసక్తి ఉండేదేనా?
Note: ఇంతటితో వ్యాసం పూర్తి కాలేదు. అందుకే కొన్ని విషయాల్లో ప్లస్ లగురించే, కొన్ని విషయాల్లో మైనస్ ల గురించే ఎక్కువ చెప్పాను. పూర్తి వ్యాసం అయితేనే complete balanced nature వస్తుంది. త్వరలోనే మొత్తం పూర్తి చేస్తాను.
సత్యమేవ జయతే!
September 12, 2008 at 10:53 AM
హమ్మ్.. అసలు సరియైన శ్రద్ధ తీసుకోక వచ్చిన తిప్పలు ఇవి. ఆ గేమూ, ఈ గేమూ అంటూ!
బైదవే, గోపిచంద్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్స్!
September 12, 2008 at 10:10 PM
మీ analysis బాగుంది
continue
September 13, 2008 at 12:28 AM
Good. Views are really looking balanced.
"ఆనందాలని అనుభవిస్తూ వ్రాస్తుంటే మన ఎమోషన్స్ డామినేట్ చేసి అసలు విషయాన్ని ప్రక్కద్రోవ పట్టిస్తాయి. అది నాకు ఇష్టం లేదు. వీలైనంత బ్యాలన్సుడ్ గా వ్రాయాలన్నదే నా అభిమతం."
Right.
September 13, 2008 at 9:12 AM
A neat and cool post. Waiting for the next part.
Post a Comment