ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

513 Not out.

అదండీ సంగతి. ఏదయితేనేం? నా బ్లాగు ఐదొందల మార్కు దాటింది అందుకే ఈ బ్లాగు.

నా బ్లాగు నత్త నడకన నడిచింది. ఇన్నాళ్ళలో ఇరవై పోస్ట్ లు అంటే బాగానే రాసినట్టు. అది కాక ఇంకా మరో మూడు బ్లాగ్ లు నడుపుతున్నాను. ఐతే నా మేజర్ బ్లాగ్ మాత్రం "Sathyameva Jayate!"

నా వాటిల్లో నా బెస్ట్ టపాలు మాత్రం "వింబుల్డన్ విలేజ్" లో వస్తున్నాయి.

"Sathyameva Jayate!" ఐదొందలు దాటింది. "వింబుల్డన్ విలేజ్" రెండొందల వైపు పరిగెడుతోంది.

నా మేజర్ బ్లాగ్ లో నేను వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నించాను. ఒక్కొక్కటీ ఒక్కోరకంగా వ్రాయటానికి ప్రయత్నం చేశాను. కొన్ని మాత్రం అద్భుతంగా కుదిరినాయి. కొన్ని అంతగా రాలేదు. ఇప్పుడిప్పుడే నాకు ఒక స్టైల్ ఏర్పడుతోంది.

అన్ని బ్లాగులనీ నేను ఒక ప్రయోజనం కోసం వ్రాశాను. ఆఖరికి "కత వింటారా మాట కదా ఒకటుందీ" లాంటి హాస్యపు బ్లాగ్ లో కూడా క పలకటం ఎలా? అనే దానిని ఇచ్చాను. అది ఒక సక్సెస్ఫుల్ టెక్నిక్.

ఈ మధ్యే "డమ్మీ - హార్డువేర్ ఇంజినియర్" అనే ఒక కొత్త బ్లాగుని మొదలెట్టాను. ఒక వెరైటీ శైలి లో దానిని వ్రాస్తున్నాను. వ్యాఖ్యలు బాగానే వస్తున్నాయి. నా దానికి ఐదు కామెంటులు వస్తే బాగానే పడినట్టు.

ఎనీ వే నేను వ్రాస్తూనే ఉంటాను. నా బ్లాగులనిచదివిన వారందరికీ, కామేన్టిన వారందరికీ, అసలు తెలుగు బ్లాగర్లందరికీ నెనెర్లు.

నేను వ్రాసిన బ్లాగుల్లో నాకు అత్యంత ఇష్టమైనదీ, వేరే వాళ్లు రికమెండ్ చేస్తూ ఏకంగా బ్లాగునే వ్రాసినదీ ఐన "వయ్యంటే బిడ్డే" లింక్ ని ఇక్కడ ఇస్తున్నాను. నా ఆ ప్రయత్నం ఫలించిందో లేదో మీరే చెప్పండి.

http://annisangathulu.blogspot.com/2008/05/blog-post_23.html

నా బ్లాగుల్లో
"కత వింటారా మాట కదా ఒకటుందీ" బాబు ఆకుల గారి ద్వారా "తెలుగు వెలుగు" ఆస్త్రేలియన్ మాస పత్రిక లో పడింది. అందుకు వారికి బ్లాగ్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

"దైవం" అనే కవిత అద్భుతంగా కుదిరింది.

అందరికీ మరోసారి నెనెర్లు.

సత్యమేవ జయతే!
2 comments:

టైటిల్ చూడగానే ఐదు వందల పరుగులు కొట్టిన వీరుడెవ్వరబ్బా, నాకు తెలీకుండా అనుకున్నా! మీరన్న మాట :-)

హిట్లూ, కమ్మెంట్లూ, సెభాషులూ, విసుర్లూ అన్నీ మన శ్రద్ధగా రాస్తే వాటంతట అవే వస్తాయి.

రాస్తూ ఉండండి. చదివి ప్రోత్సహించే వాళ్ళు తెలుగు బ్లాగ్లోకంలో సదా ఉంటారు. స్వానుభవం :-)

వీలు చూసుకుని, తరచూ టపాయించండి.

అభినందనలతో
పూర్ణిమ


అంటే బ్రియాన్ లారా రికార్డ్ దాటేశారన్నమాట. కంగ్రాట్స్. ఇక ముందు మీరు స్పీడేక్కాలని కోరుకున్టున్నాను. మీ కత పత్రికలకేక్కినందుకు అభినందనలు. అదేదో బ్లాగులో పెట్టరాదూ! :-)


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి