అమ్మ, నాన్న, రెండు విలియమ్సూ, ఒక సాంప్రాసూ.
ఇంకా ఒక డోనాల్డూ, ఒక అగస్సీ, ఒక గ్రాఫూ. మరి నేనో! నేను కూడా. బాందా! నాకు చిన్నప్పటి నుంచీ స్పోర్ట్స్ అంటే ఇష్టం. సహజంగా మా వాళ్ళలో ఆటలా పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. మా నాన్న మాత్రం ఎప్పుడన్నా రేడియోలో క్రికెట్ వ్యాఖ్యానం వినే వారట. అది నాకు తెలీదులెండి. ఎందుకంటే అప్పటికి నేను పుట్టలేదు కదా.
మాది సంప్రదాయ కుటుంబం కావటంతో ఆటలూ, అవీ నిషిద్ధం. మా నాన్నా వాళ్ల కాలంలో బయట అలగా వాళ్ళతో ఎక్కడ తగువులు వస్తాయో అని ఆటలకు పంపేవారు కాదు. అందుకే ఐదు కిమీ స్కూలుకి నడిచి వెళ్ళే దారిలో ఎవరు ముందు వెళ్తారు అని తనూ, వాళ్ల అన్నయ్యా పందెం వేసుకునే వారట. అదే వాళ్ల ఆట. తరువాత క్రమంగా పెద్ద వాలయిన తరువాత అన్నీ పోయాయి. అందరికీ తెలిసిందేగా. 1986 లో టీవీ కొన్న తరువాత అప్పుడప్పుడూ వచ్చే లైవ్ కార్యక్రమాలు చూసేవారు. ఎలా మొదలయిందో నేనూ అడగలేదు, ఆయనా చెప్పలేదూ మా నాన్నకి వచ్చే ఆటలలో టెన్నిస్ బాగా నచ్చింది. అందులోనూ ఇవాన్ లెండిల్ ఆటతీరు నచ్చటంతో ఎప్పుడయినా టెన్నిస్ వస్తే ఆయన మిస్ కాకుండా చూసేవారు.
అలా ఒక రోజు చూస్తుండగా నేను బజారు నుంచీ వచ్చాను. నాకు ఏడేళ్ళు. విడిగా ఉంటే హోంవర్క్ చెయ్య మని చెపుతారేమో అని బుద్ధిగా నాన్న ఒళ్లో కూర్చుని "అది ఎవరు?" అని అడిగాను. వాడి పేరు మైకేల్ స్టిచ్, ఎదుటి వాడి పేరు బెకెర్ అని చెప్పారు. బెకేర్ అనే పేరు నాకు తమాషాగా అనిపించింది. అంటే వాడు కప్పలాగా బెక్ బెక్ అంటాడా అని అడిగాను. నాన్న నవ్వి బెకేర్ గూర్చి చెప్పారు. అది 1991 వింబుల్డన్ మెన్స్ ఫైనల్. నాకు ఇంట్రెస్ట్ గా అనిపించి మొత్తం మ్యాచ్ చూసాను.
అలా మొదలైన నా టెన్నిస్ ప్రయాణం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. 1991 లో స్టిచ్, 92 లో అగస్సీ, 93 లో సాంప్రాసూ ... ఇలా ఫేవరిట్ ఆటగాళ్ళు మారి పోయారు. కానీ నాకు రాను రాను సాంప్రాస్ అంటే ఇష్టం పెరిగింది. ఎంత ఇష్టం అంటే రోజువారీ మాటల్లో వాడే అంతగా. మా నాన్న గారికి అగస్సీ అంటే అభిమానం. అందుకే నాతో పోట్లాడే వారు సరదాగా. నేను సాంప్రాస్ ఆట ని సీరియస్ గా చూస్తుంటే ఆయన వచ్చి అగస్సీ గెలవాలనే వారు అయితే మేము మాటల యుద్ధమే కాదు ఎ రకమయిన యన్టీ కామెంట్స్ చేసు కునే వారము కాదు. నేను జస్ట్ చూడు నాన్నా సాంప్రాస్ గెలుస్తాడు అనే వాడిని. ఆయన నవ్వి ఊరుకునే వారు.
అఫ్కోర్స్ మన కోసం సాంప్రాసే ఎక్కువ సార్లు గెలిచాదనుకోండి. ఇలా యాంటీ గా 2000 వరకూ గడిచినా తరువాత మా స్పోర్టివ్ నెస్ చూసి దేవుడికి ముచ్చట వేసిందేమో విలియంస్ని పంపించాడు. వారి విషయంలో మా ఇద్దరికీ నో యాంటీ.
ఒక రోజు మా అమ్మ నన్ను అన్నానికి పిలవటానికి వచ్చింది. నేను కలిపి పెట్ట మన్నా. తినొచ్చు కదా అని అమ్మ అంటే నేను సీరియస్ గా విలియమ్స్ మ్యాచ్ వస్తోంది అన్నా. సరే అని అమ్మ అన్నం కలుపుకుని వచ్చి తినిపిస్తోంది. ఇంతలో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్ 2000 టైటిల్ గెలిచింది. (నేను హైలైట్స్ చూస్తున్నా).
"ఎవరా నల్ల ముండ అట్టా ఎగురుతోంది?" అమ్మ అంది. "ఆ అమ్మాయి పేరు విలియమ్స్. భలే ఆడుతుంది," అన్నా. అమ్మకి కొంచం ఇంట్రెస్ట్ కలిగి ట్రోఫీ ఇచ్చిందాకా కన్నార్పకుండా చూసింది. అప్పటి నుంచీ సిస్టర్స్ సిస్టర్స్ అంటూ అమ్మ ఎప్పుడయినా వాళ్ల మ్యాచ్ వస్తే చూడటం మొదలు పెట్టింది. ఇంట్లో ఆడవాళ్ళంతా సీరియళ్ళు చూస్తున్నా నేను టెన్నిస్ చూడాలి అంటే అమ్మా విలియమ్స్ మ్యాచ్ వస్తోంది అంటే అమ్మ నాకు సప్పోర్ట్ వస్తుంది.
మొత్తానికీ టెన్నిస్ రోజులలో సీరియళ్ళ బాధ తప్పిందన్న మాట. విలియమ్స్ వల్ల ఇంకో ఉపయోగం ఉంది. ఎప్పుడూ వంటింటిని పట్టుకునే ఉండే అమ్మ ఆ రోజుల్లో మాత్రం హాయిగా ఎవరికన్నా పనులు అప్పగించి కొంసేపు కూర్చుంటుంది. అమ్మా మీ పెద్ద సిస్టర్ ఆడుతోంది, చిన్న సిస్టర్ ఆడుతోంది అని పిలిస్తే పాపం తను ఇంట్రెస్ట్ గా వచ్చి కొంసేపు విశ్రాంతిగా కూర్చుంటుంది. అలా మా ఇంట్లో విలియమ్స్ కూడా ఒక భాగం అయినారు. గ్రాండ్ స్లాంస్ డేట్లు గుర్తు ఉంచుకుని ఎప్పుడయినా ఊరికి వెళ్తే ఫోనులో సిస్టర్స్ ఏమయ్యారు? అని వివరాలు అడుగుతుంది. అక్క చెల్లెళ్ళు లేని మాకు విలియమ్స్ వెరైటీ సిస్టర్స్ అయ్యారు.
మా అన్నయ్యకి ఆటలంటే అంత ఇంట్రెస్ట్ లేదు. వదినా పిల్లలు అంతే. పిల్లకి పద్మ వ్యూహం, పిల్లవాడికి jetix లో ప్రపంచాన్ని రక్షించడం. అంతే! ఎన్నయినా విమ్బుల్డనే వింబుల్డన్.
అందుకే నా ఇంట్లో వాళ్లెఁవరంటే... అమ్మ, నాన్న, రెండు విలియమ్సూ, ఒక సాంప్రాసూ. ఇంకా ఒక డోనాల్డూ, ఒక అగస్సీ, ఒక గ్రాఫూ. నేను కూడా.
వసుధైక కుటుంబం కదా!
సత్యమేవ జయతే!
June 28, 2008 at 3:33 AM
బాగుంది మీ టెన్నిస్ కుటుంబం.
June 28, 2008 at 6:04 AM
భలే వుంది మీ కుటుంబం. నాకూ సంప్రాస్ అంటే ఇష్టం.ఇంట్లో సీరియల్స్ భాధ పోవాలంటే ఈ పద్ధతి ట్రై చెయ్యలన్న మాట.
June 28, 2008 at 9:25 AM
Enjoying the Wimbledon.. right now??
Telugu blogs asalu sports gurinchi raase vaare takkuva anukuntunda gaa meeru kanipinchaaru..
choottame kaadu.. maato pamchukondi kooda.
July 3, 2008 at 12:34 AM
మీ కుటుంబం లో అందరి గురించీ రాశారు. పాపం డోనాల్డ్ ఏమి చేశాడు? మొత్తానికీ మా అమ్మ గారిని రెస్ట్ తీసుకునేలా చేశారన్న మాట. బాగుంది మీ టెన్నిస్ ఫ్యామిలీ.
July 3, 2008 at 12:36 AM
మొత్తానికీ మీ అమ్మ గారిని రెస్ట్ తీసుకునేలా విలియమ్స్ చేశారన్నమాట. ఎంజాయింగ్ విలియమ్స్ మ్యాచేస్?
August 7, 2008 at 3:11 PM
baagundandi.. mee family ... eppude mee blog choosa. chala baagundi geethacharya garu..
August 18, 2008 at 8:51 AM
మీ కుటుంబం నాకు చాలా నచ్చింది. అన్నట్టు మీ సిస్టర్స్ ఒలింపిక్స్ లో డబుల్స్ స్వర్ణం గెలిచారు. నా అభినందనలని తెలపండి.
అమ్మకి బాగానే రెస్ట్ ఇచ్చారు. ఏమి తెలివితేటలండీ! నిజం గా వెంట్రుక పై శర్మా మాస్టారే మీరు.
Post a Comment