ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

ధరణిలా ఆశ చిగురించాలి



చెట్టు మోడైందని
ధరణి మోడౌనా?

కష్టమొచ్చిందని
మనిషి చావతగునా?

ధరణిలా ఆశ చిగురించాలి
ప్రేమ వికసించాలి
తనువు పులకరించాలి
చిరుజల్లుల వానలా!
7 comments:

ఆశ అనేది జీవికి జీవితానికి ప్రాణంలాటిది. అది ఎప్పుడూ ముందుకు వెళ్లడానికి సహకరిస్తుంది. మోడు కూడా తప్పక చివురిస్తుంది..


మీ కవిత బావుంది...నాలో ఆశ చిగురించింది ... మీకు నా కృతజ్ఞతలు !


చిగురించిన మోడు తప్పక విరబూస్తుంది...


గులక రాయంత కష్టం వెనుక బండ రాయంత సుఖం వుంటుందంటారు. కానీ, ఆ కొంచం కష్టాన్నే పర్వతమంత వూహించుకుని ప్రయత్నం ఆపేసేవారు ఎక్కువ.

1. motivation మీద వ్రాసిన నా కవితలు చదివి వ్యాఖ్యానించండి [అదీ మీ వీలుని బట్టే, సత్యాన్వేషీ!].

నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది! http://maruvam.blogspot.com/2009/03/blog-post_11.html
ఇందులో ఒక ప్రత్యేకతవుంది.

"మనిషీ! నిక్షిప్తమైన నీ పటిమను వెలికి తీయ్, నిద్రాణమైన నీ ప్రతిభకు సాన పట్టు.
ఆ ప్రకృతే నీకు స్పూర్తి నీ కీర్తికి నాంది నీ విజయానికి పునాది.
మన వెనుకతరం మాదిరే మనంకావద్దా ముందుతరానికి మార్గదర్శకం?
వినరా మన విజయగాథలు రానున్న తరం? కృషితో నాస్తి దుర్బిక్ష్యం."

పట్టుబట్టి నా నేస్తంతో ముందు రెండు పంక్తులు వ్రాయించాను. పైన మరో 7 పదాలు నేను కలిపాను.

2. కమనీయ కావ్యం, మనిషి జీవితం! http://maruvam.blogspot.com/2009/05/blog-post_15.html

మచ్చుక్కి నాల్గు పంక్తులివి...

"జీవితపు మఱ్ఱికి మరో గతపు వూడ వేసింది.
ఈ చెట్టుకి అనునిత్యం ఆరు ఋతువుల సంగమమే.
నిమిషాలు రాల్చుకుంటూ, కొత్త చివురు వేసుకుంటూ,
గెలుపు పూలు విప్పారిస్తూ, తృప్తి ఫలాలు పండించుకుంటూ."


'ధరణిలా ఆశ చిగురించాలి'
nice ..కవిత బావుంది


Very much like you. కాకపొతే వాన ఎక్కువైపోయింది మీ కవితల్లో.


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి