ధర్మార్థకామమోక్షాల సాధనే మానవ జీవత పరమార్థం అంటారు కదా. మరి పెళ్ళి అంటే మీకు తెలుసా? ధర్మ బద్ధమైన జీవనం గడపటంలో వివాహం మిక్కిలి పాధాన్యతని సంతరించుకుంది. మరి అలాంటి పెళ్ళెంటే ఏమిటి
ధర్మం కోసం చట్టబద్ధత*,
అర్థం కోసం కట్నం,
కామం కోసం సంసారం,
.................................
.................................
.................................
ఇవన్నీ అయ్యాక, మోజు తీరగానే
పెళ్ళానికి మోక్షమిచ్చి పంపి, మళ్ళా ధర్మ సాధనకోసం మరో...
ఈ విధంగా మనవుడు తన జీవన పరమార్థాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ;-)
*అక్కడ భార్య అని ఉంది. మిత్రుల సుచన మేరకు ఇలా. ఏది కావాలో అది చదువుకోండి. ఎందుకంటే... మనది ప్రజాస్వామ్యం. మీకా స్వేచ్ఛ ఉంది కదా...! ;-)
ఓ పాతిక లక్షల కట్నం కోసం తనని చక్కగా అమ్ముకున్న నా ఒక మరీ అంత క్లోజ్ కాని మిత్రునికి త్రీ ఛీర్స్!!!
అంకితం: కట్నం తీసుకోను అన్న కుర్రాడికి ఏదో లోపం ఉంటుంది అనుకునే అమ్మాయిల తల్లితండృలకందరికీ విచ్చలవిడిగా. పండగ చేసుకోండి.
July 19, 2009 at 5:25 AM
టూ ర్యాడికల్ బ్రదర్! బ్లాస్ఫెమీ అంటారేమో...
July 19, 2009 at 7:22 AM
?!!!
July 19, 2009 at 9:20 PM
సత్యాన్వేషికి సత్యం బోధపడిందన్నమాట.
అడ్వాన్సు గా అక్షింతలు!
*అక్కడ భార్య అని ఉంది. మిత్రుల సుచన మేరకు ఇలా. ఏది కావాలో అది చదువుకోండి. ఎందుకంటే... మనది ప్రజాస్వామ్యం. మీకా స్వేచ్ఛ ఉంది కదా...! :-)))!
July 23, 2009 at 10:50 AM
కందిపప్పు 100 రూపాయలు కిలో ! మర్కెట్ ధరలు అంత పెరిగిపోతుంటే వెధవది ఓ పాతికలక్షల కోసం ఓ బ్లాగ్ రాసేయాలా ? విడ్డూరం కపొతే !
July 23, 2009 at 5:59 PM
ఏ మాట కామాటే, ఈ పాతిక లకారం శాల్తీ కాస్త చవక బేరం. క్షమించి వదిలేద్దాం. కన్యాశుల్కం రోజులూ రానున్నాయి. కత్తులు నూరి వుంచండి మరి కలాలు చాలవేమో సత్యాన్వేషీ! ;)
July 27, 2009 at 7:18 AM
పాతిక లక్షలా ?? ఏమొస్తుంది? ఒక ఫ్లాట్ రాదు.. :)
Post a Comment