’సత్యమేవ జయతే!’ అనే బ్లాగుతో మొదలెట్టి, కొన్ని కొన్ని వ్యక్తిగత దాడుల వల్ల, ఆ ఐడీనే వదిలేసి, సరికొత్తగా ’The Inquisistor - సత్యాన్వేషి’ అనే ఈ బ్లాగుని మొదలెటింది గత అక్టోబర్లో.
నాకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన బ్లాగు "వింబుల్డన్ విలేజ్" అయితే, కాస్తో కూస్తో సినీ సినీ పరిఙ్ఞానం ఉన్నదన్న నమ్మకాన్ని కలిగించింది "నవతరంగం". ఇప్పటికైతే నాకు వీటిలో వ్రాస్తుంటే చాలా satisfaction గా ఉంటుంది.
టెన్నిస్ గురించే కాకుండా విజేతల మనస్తత్వాన్ని గురించి కూడా విశ్లేషించే వింబుల్డన్ విలేజ్ అలా అలా సాగుతూ కాస్త కుంటి నడకన ఉంది. ఐనా దానిని మూత పడేయను. వీలున్నప్పుడల్లా ఏదన్నా వ్రాస్తూనే ఉన్నాను.
"విజయ విశ్వనాథం" టపాతో మొదలెట్టి, ఈ మధ్యనే Michaelangelo Antonioni గురించి వ్రాసిన టపా వరకూ పడుతూ లేస్తూనే అయినా హుషారుగానే, పర్పస్ఫుల్గానే, (మంచి టపాలనే వ్రాశాను. అంత త్వరగా అర్థం కావు అనే కంప్లైంట్ తప్ప) మంచి మంచి వ్యాసాలతోనే నడిచింది నా నవతరంగ ప్రయాణం. నాకు వీలైనన్ని రకాలుగా అన్ని రకాల వస్తువులనీ తీసుకుని వ్రాశాను.
"విజయ విశ్వనాథం" is my original work, where I'm studying the psychological and philosophical motives behind certain characters of K. Vishwanath's Quadrulogy of Gurus. (శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణ కమలం, స్వాతి కిరణం).
వాటి గురించి నవతరంగం లేదా, నా బ్లాగుల లిస్ట్ లో "విజయ విశ్వనాథం" పేరుతో ఉన్న నా బ్లాగులోనైనా చదవవచ్చు.
ప్రపంచ సినిమా, రివ్యూలు, (ఒక తెలుగు, ఒక హిందీ, ఒక కొరియన్), ఒక ప్రముఖ దర్శకుని గురించీ (ప్రశ్నాంటోనియోనీ), ఒక ఇటాలియన్ సినిమా, ఇంగ్లీషు సినిమా ల పైన విశ్లేషణ. ఇదీ నవతరంగంలో నా సోది. త్యాగయ్య గురించి వ్రాసిన టపా నాకు భాషా పరంగా, విషయ పరంగా నాకు ఎమ్తో తృప్తినిచ్చిన టపా. ఇక సుమంగళి గురించి వ్రాసిన టపా కాస్త కల్లోలాన్నే రేపింది.
డమ్మీ - హార్డువేర్ ఇంజినియర్ ఎక్కువ వ్రాయకపోయినా (ఇప్పుడైనా పునరుద్ధరించాలి) చదివించే వ్యంగ్య టపాలే ఉన్నాయి.
సుజాత గారితో మొదలెట్టిన నరసరావుపేట్రియాట్స్ హిట్టయినట్టుగానే ఉంది. మమ్మల్ని చూసి కొందరిలో చలనం వచ్చింది.
నా రొమాంటిక్ బ్లాగ్ ధీర సమీరే... యమునాతీరే! ఉన్నవి రెండే అయినా ఆణిముత్యాల్లాంటి టపాలే.
ఇక ఇప్పుడు ఈ మధ్యనే టపాలు మొదలై నెలలోపే రెండు వేల క్లిక్కులని చవిచూసిన నా మరో ఫావొరిట్ బ్లాగు... BOOKS AND GALFRIENDS.
ఇలా ఇలా ఏదో నా మానాన నేను వ్రాసుకుని పోయినా, సహృదయులైన తెలుగు బ్లాగర్లు మరీ ఎక్కువ కాకపోయినా కాస్తన్నా వారి విలువైన సమయాన్ని నాకోసం కేటాయించి నన్ను ప్రోత్సహించారు. అందరికీ నా సవినయ కృతఙ్ఞతాభివందనాలు.
కొందరు మిత్రులని కూడా నేను సంపాదించుకున్నాను. కాస్తంత గుర్తింపునీ పొందాను ఇక్కడ.ఇదోరకం తృప్తి.
దాదాపూ నూట ఇరవై పైన టపాలు, ఐదు వందల వ్యాఖ్యలు, (నవతరంగం మినహాయించి) ఏడెనిమిది మంది స్నేహితులు, ఇద్దరు ముగ్గురు సద్విమర్శకులు. ఇవీ నేనిక్కడ పోగేసుకున్న ఆస్తులు.
ఒక పన్నెండు వేల మంది పైన నా వ్రాతల్ని చదివారు.
ఈ సందర్భంగా నాకు తెలుగు లిపిని ఎలా వాడాలో చూపిన రామ శాస్త్రి గారికీ, నాకు నవతరంగాన్ని పరిచయం చేసిన కొత్త పాళి గారికీ నేను ఎప్పుడూ కృతఙ్ఞుడనై ఉంటాను.
అలాగే మా పేటోళ్ళు మామూలోళ్ళు కాదు సుమీ. వాళ్ళకీ నా ధన్యవాదాలు.
I never felt I'm local, I always think of me as a universal person ;-). So, I thank everybody.
నా అన్ని బ్లాగుల వివరాలూ సైడ్ బార్లో ఉన్నాయి.
June 24, 2009 at 2:45 PM
ప్రస్తుత స్టాండర్డ్స్బట్టి చూస్తే మౌనంగా ఉండేవాళ్లూ సద్విమర్శకుల కిందనే లెక్క. అలాంటోళ్లు కోకొల్లలుంటారు మీకు. కాబట్టి మరీ ఇద్దరే అనేసుకోవద్దు :-)
శుభాభినందనలు.
June 24, 2009 at 8:32 PM
congratulations .. happy writing.. enjoy...
June 24, 2009 at 8:46 PM
డియర్ గీతాచార్య,
సమీపంలోనే కనపడుతూ వెంటపడుతున్న కొద్దీ అందకుండా పోయే ఒక ప్రత్యేక శైలి మీ సొంతం. అది బ్లాగు పోస్టయినా, సినిమా రివ్యూ అయినా! అసలు మాస్టారుగా అంత బిజీగా ఉంటూ ఇన్నిన్ని బ్లాగులెలా రాస్తున్నారో నాకర్థం కాదు!
ఇంతకీ నన్ను ఏడెనిమిది మందిలో వేశారా ఇద్దరు ముగ్గురులోనా?:-)
ఇంకా బోలెడన్ని కొత్త పొస్టులకు ముందుగానే అభినందనలు! సంవత్సరం నిండిందిగా, ఫొటో మార్చొచ్చేమో! :-)
"మమ్మల్ని చూసి కొందరిలో చలనం వచ్చింది". LOL!
June 24, 2009 at 8:55 PM
అభినందనలు.
June 24, 2009 at 9:25 PM
Congrats!!
June 24, 2009 at 10:09 PM
అభినందనలు నావి కూడా :)
June 24, 2009 at 11:21 PM
శుభాభినందనలు
June 25, 2009 at 1:50 AM
congratulations
June 25, 2009 at 4:30 AM
ఆచార్యా,
ముందుగా అభినందనలు(నూతన సంవత్సర శుభాకాంక్షలు).కొత్త సంవత్సరానికి స్వాగతం.
ఇంక చెప్పాలంటే మీరు ఆ విజయ విశ్వనాథం ఏదో కొంచం గమ్మున రాసేస్తే పూర్తి చెసేస్తే మేము గమ్ము గమ్మున చదివి ఆనందిచేస్తాము.లేకపోతే ప్రతీ సారీ వెనకి ముందుకీ మెడ్డువారీ గుర్రంలాగ వెళ్ళాల్సి(చదవడానికి)వస్తోంది స్వామీ...
Post a Comment