ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

కోట్రు మందూ, గుప్పెడు బీడీలూ... ఒక వోటరు ఆత్మ (లేని) కథ-1

సమయం సాయంత్రం నాలుగు గంటలు.

ఆంధ్రా బాకు దగ్గర మెయిన్ రోడ్డు.

జనం పల్చగా ఉన్నారు. భానుడి తేజం ఉధృతంగా ఉండి బయట ఉన్న వారికి నాలుకలు పిడచకట్టుకుని పోతున్నై. కాస్త పురుగుల మందుతో నైనా దాహార్తిని తీర్చుకొందే జీవాత్మ గాడు పరమాత్మ దగ్గరకి పరిగెడతానంటున్నాడు. అందరిదీ అదే పరిస్తితి. అందుకే, "నాన్నా పందులే గుంపుగా వెళ్తాయి. సింహం సింగిల్ గా వెళ్తుంది." అని దాన్ని బుజ్జగించి పక్కనే ఉన్న పెస్టిసైడ్ షాపులోకి వెళ్లి ఒక సూపర్ బాటిల్ అడిగాను. (స్ప్రైట్). అది త్రాగి ఇలా బయటకి వచ్చానో లేదో ఆటో ఒకటి ఎదురుగా వస్తోంది. కాలేజ్ కి వస్తుందా అని అడిగాను. వాడు పట్టించుకోకుండానే వెళ్లి పోయాడు.

"మీ అభిమాన యువజన నాయకుడు, పే(ద్ద)దల పాలిటి పెన్నిధి, (బుడుంగు)డుగు జీవుల ఆశా జ్యోతీ, రైతుమిత్ర (బాలకృష్ణ మిత్రుడు సినిమా కాదు), కరంట్ ఎఫైర్స్ లో దిట్ట, వైనో రామ్ చరణ్ రెడ్డి గారి అతి గొప్ప భారీ పెద్ద బిగ్గెస్ట్ బహిరంగ సభ రేపు మన ఊళ్ళో జరగ బోతోంది. కావున యావన్మంది గొర్రెలారా...! మీరెల్లెడరూ వచ్చి, వారి దివ్య ప్రసంగాన్ని విన స్వస్థత పొంది ఓటు మాకే వేయవలసిందిగా ప్రార్ధన."

"ఈడబ్బ! ఛీ ఈల్లవ్వ. కోట్రు మందివ్వరు, గుప్పెడు బీడీలివ్వరు. ఓటెయ్యాలంట. ఓటు. తేరగా కూకున్నాం ఈడ్న. ఉత్తినే ఓటేసేడానికి. అయినా ఈది దేముంది తమ్ముడూ. ఈడు బానే పంపుతాడు. మద్దెలో కారేకర్తలున్నారే. ఆల్లు. ఆల్లంతా మింగి మాకేమీ ఎత్తరు."

నేను ఇలా ఒక చెవి అటు పడేసి, తలూపుతూ మరో వైపు బస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడ సాగెను.

" నా కొడుకులు, ఓటేసినాక మళ్ళా అగుపించ్రు. ఇప్పుడన్నా కాస్త చుక్కీవచ్చు. కాసింత బిర్యానీ పెడితే బావున్ను."

"అవును." తలూపాను. నాకీ ఎలక్షన్లంటే అంత ఆసక్తి లేదు. ఓటేయాలనే నా ఆసక్తిని ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రం (రజనీ కాంత్ యంత్రం కాదు) కాస్తా మింగేసింది. పాపం అందరు అభ్యర్థులూ వస్తారు ఓటడుగుతారు. మనింటికి వచ్చి అడిగిన వారిని కాదు లేదు అనటం మన ఇంటా వంటా లేదాయే. అందుకే అందరికీ ఓటేస్తాం అంటాను. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాడే కదా రజనీ భాషలో మగాడు. వేరే ప్రూఫులు చూపెడితే బావోదు కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటమే మంచి ప్రూఫు. అప్పుడంటే వోటింగ్ కాయితాలుండేవి. ఇంచక్కా అన్ని పార్టీల వాళ్ళకీ ఓటు వేసేవాడిని. ఇప్పుడు ఓటింగు యంత్రం అవకాశం ఇవ్వదు. మాట నిలుపుకోలేనప్పుడు అసలు పనే చేయకుండా ఉంటే మంచిది కదా. అందుకే నాకు ఎలక్షన్లంటే అంత ఆసక్తి లేదిప్పుడు.

"ఆకలౌతోంది తమ్ముడూ కాస్తేమన్నా ఇవ్వు తమ్ముడూ."

*** *** ***

సమయం రెండున్నర. బాగా వేడిమీదున్నాడు Sun-in-Law.

"ఏంటి మేడం గారు, అన్నం పారేస్తున్నారు," స్టూడెంట్ ని పలకరించాను.

"చాలా స్పైసీగా ఉంది సార్. తినలేకుండా ఉన్నాను."

"అంతన్నం పారేసేబదులు వేరే ఏమైనా కూర వేయించుకోవచ్చు కదా. అయినా మీ సికాకులం వాళ్లకి అంత ఇబ్బందిగా ఉందా మా గుంటూరు మిర్చి?"

"అన్నమే కదా సార్. కొంచానికే ఏముంది?" (అవును కొంచమే. ఒక మనిషి రెండు సార్లు కలుపుకునే అన్నం).
 
కాలేజ్ గేటు బైట ఒక ముసలమ్మ. వాచ్మన్ తో. "బాబయ్యా! ఆకలేస్తోంది. తిన్డానికేమన్న ఇప్పించండి."
 
"ఎళ్ళెళ్ళవమ్మా! ప్రతీఓరూ ఇల్లాగే వచ్చి అడుక్కోటమేను."
 
ఎన్డగాఉంది. నాలిక పిడచగట్టుకుని పోతోంది.  గుక్కెడు మంచినీళ్ళైనా పోయించండి. పానం పోయేలాగుంది."
ఒక పది సార్లు బతిమాలిన్చుకున్నాక కాసిని నీళ్ళు ఇచ్చాదు. అవీ వేడిగానే ఉన్నై. చివరికి నేను ఒక స్టూడెన్ట్ ని పంపేదాకా ఆవిడ దాహమ్ తీరలేదు. ఇవీ మనమ్ పెద్ద వాళ్ళకి చేసే ద్రోహాలు.

*** *** ***

సాయంత్రం. సమయం ఐదూ ఇరవై.  కాలేజీ బస్సులో.
 
"సార్! మీకు ఓటరు కార్డుందా?"
 
"లేదమ్మా!"
 
"అదేంటి సార్?"
 
"తీసుకోలేదు."
 
"మరి మీకు ఐడెన్టిటీ ఎలాగా?"
 
"నాకు పాస్పోర్ట్ ఉంది. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది."
 
"సార్! ఇది నా ఓటరు కార్డు. చూడండి."
 
నేను నా చేతిలోకి తీసుకుని చూశాను. మా కొలీగ్ కూడా చూశడు. నాకు ఆశ్చర్యం. అచ్చం వాడే. నిజంగా వాడే. నా జీవితంలో ఓటరు తనలాగే ఓటరు కార్డు మీద రావటమ్ అనే అద్భుతాన్ని చూసింది అక్కడే. దాన్తో బోల్డు చాలా కొంచెం అన్నాను. "చూడండి. అచ్చంగా వీడే."
 
"అవును సార్! అచ్చంగా వీడే." చూసిన వాళ్ళంతా ముక్తకంఠంతో అన్నారు.
 
"ఉరే నీకెక్కడిదిరా ఓటు?" ఒకడడిగాడు. నాకా డౌట్ ఇంకా రాలేదు. ఆ ఆశ్చర్యంలోనే ఉన్డటమ్తో నాకా ప్రశ్న ఉదయించలేదు.
 
"మా ఊళ్ళో నాకు రెండు ఓట్లున్నాయ్. కొత్తపేటలో ఒకటీ. మా ఇంటి కాడ ఓటీ."
 
"నీకు అంత ఏజ్ లేదు కదా? ఎలా వచ్చాయి?"
 
"మా ఎమ్మెల్యే అబ్బెర్ది ఇంటి కాడకొచ్చి ఓటడిగాడు. మావోడికి ఓటు, మాకొక్కతలకీ అయిదు యేలు ఇస్తే మా ఓట్లన్నీ మ్మీయే గురూగారూ," అన్నాడు. అంతే. మూడు రోజుల్లో మా ఇంటి కాడకే నా ఓటు కార్డూ, ఓ ముప్పీ యేలొచ్చినాయి."
 
"డబ్బు తీసుకోవటం తప్పుకదరా?"
 
వాడు నన్ను గెడ్డమ్ లేని చంద్రబాబునీ, ఎన్టీయార్ పేరు లేకుండా ప్రసింగించిన బాలకృష్ణనీ, వైనో చిరంజీవి రెడ్డి మీదా ఆరోపణ చేయని ఆంధ్రజ్యోతి పత్రికని చూసినట్టు చూసి అన్నాడు. "మీరు భలే వోళ్ళు సార్! నాయాల్ది ఆళ్ళు ఇచ్చేది ఇప్పుడే గందా సార్. ఓట్లయ్యాక మాకు ముహం అన్నా చూపెట్టరు. అందుకే దొరికినప్పుడే దండుకొవాలి గానీ తప్పు నుకుంటె ఎలా?"
 
(ఇంకా చాలా ఉన్నై. చూద్దురు చిత్రాలు)
12 comments:

చాలాబాగుంది. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొంచెం బాగా వచ్చేది. హెడ్డింగు బాగా కుదిరింది.


బాగుంది. బాగా రాశారు. కీప్ పోస్టింగ్.


చాలాబాగా రాసారు :)


chakkni vyangyaastraalu sandhinchaavu. baagundi.nee observation (telugu padam ventane thattaledu) baagundi inkonchem deep gaa velithe baaguntundemo?


విషయం బాగుంది. కానీ శైలి,గమనం కారణంగా అక్కడక్కడా "తెగిన" అనుభూతి కలిగింది. కొంచెం సానపెట్టాలి.


చాలా బావున్నాయి అనుభవాలు. త్వరగా మిగతా అనుభవాలని రాయొచ్చుగా.

వైనో రామ్‍చరణ్ రెడ్డి. కూల్.


modati incidentu, pesticide katha baagunnaayi. madhya episode enduku rasaro, antha ardham kaledu. otu gurinchi meeru ceppinavi chaalane jargyai.

nice write up.


దొరికినప్పుడే దండుకొవాలి గానీ తప్పు నుకుంటె ఎలా?"

ప్చ్. అలా ఉంది లోకం.


hello sir , maadi narasaraopet daggara village ,may i know wat r u doing


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి