Yeah you oughtta do it. నిఝంగా న్న్యాయం ఝరిగింది... భగవంతుడు చేసిన న్న్యాయం ఇది. నాకిప్పుడు చాలా ఆనందం గా ఉంది. ఇక ఆడపిల్లలు అందరూ స్వేచ్ఛగా తలలు ఎత్తుకుని మరీ తిరగొచ్చు.
నీకు అంత ఆనందం కలగటమే నాకు కావాలి. నీ మనసు ఇప్పుడు కుదుట పడింది అని నేను భావిస్తున్నాను. నాకైతే ఎగిరి గంతులు వెయ్యాలనేటంత సంతోషం కలిగింది. గ్రేసీ సింగ్ మీదొట్టు.
ఒకమ్మాయి మీద ఒకడు యాసిడ్ పోశాడు. వాడిని ఎన్కౌంటర్ చేసేద్దాం. అంతే ఇకెప్పుడూ అమ్మాయిల మీద ఎవరూ యాసిడ్ పోయారు. భయపడి పోతారు. (ఐ బాబోయ్! నాకు బైమేసేసింది బాబోయ్!) నువ్వేమో మంచి పని జరిగిందని ఆనందించు. చూశావా నీకు ఒక్కదానికి కష్టం కలిగించి దేవుడు అమ్మాయిలందరినీ యాసిడ్ దాడులనుంచీ రక్షించాడు. చెప్పను కానీ నువ్వు 'పక్షి' (సాక్షి దిన పత్రిక) రామన్నయ్య బంగారానివి. ట్వంటీ ఫర్ క్యారెట్.... కాదు సారీ నేనూ ఒక పురుషుదినే కదా అందుకే తక్కువ చేశాను నిన్ను, ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ క్యారెట్ బంగారానివి.
కాదేమో? నువ్వు ఒక డైమండ్ వి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రం తోనే కోయాలికదా. నీతో పెట్టు కున్నందుకు వాడు బుల్లెట్ తో కోయబడ్డాడు. నువ్వు "వాడికి పడిన శిక్ష తక్కువ. చాలా తేలికగా తప్పించుకున్నాడు," అన్నావు. నిజమే వాడికి పడిన శిక్ష చాలా చిన్నది. హాయిగా ఒక బుల్లెట్, రెండు... మహా ఐతే ఆరు చాలు వాడు పోయేటందుకు. మనసినిమాల్లో లాగ ఎన్ని బుల్లెట్లు దిగినా బ్రతికేందుకు వాడేమీ హీరో కాదు కదా. వాడొక విలన్.
కానీ సమాజానికి పడిన శిక్ష? ఎంత భయంకరమైంది? ఆటవిక న్యాయం. కాదిది. ఆటవిక న్యాయం లోనూ ఒక లాజిక్ ఉంటుంది. కానీ ఇక్కడ? ఏ న్యాయం? మనుషులు లా ప్రవర్తించారా జనులు? పండగలు చేసుకున్నారు. ఒక మనిషి ప్రాణం పోయినందుకు.
ఒక్కటే మాట. ఏసు అడిగినట్టు. వాడిని అనే ముందు మనలో ఎవరూ ఏ తప్పూ చేయలేదా? మనమంతా సుగుణ సంపన్నులమా? పండగలు చేసుకున్న విద్యార్ధి సంఘాల వాళ్లు అంతా గొప్ప సంస్కారం కలిగిన వాళ్లా? ఆ విద్యార్ధి సంఘాల నాయకవరేణ్యులు మహానుభావుల? ఎవరూ ఆడపిల్లలని ఏడిపించని వాళ్ళేనా?
బయటకి వెళితే ఎంతమంది ఆడ పిల్లలని కామ దృష్టితో చూడరు? నా ప్రశ్నలు దార్ తప్పాయి. ఎమోషన్. యస్. An ఎమోషన్. అదే నన్ను ఇక్కడ దారి తప్పించింది.
పోలీసులు జనం గోల భరించలేక వాళ్ళని ఏదో మర్డరు చేశారనుకుందాం. పోన్లే పాపం అని వదిలేయవచ్చు కదా? నెల కొకటి అన్నా చేయందే లిస్టు ఫిల్లవదుకదా! ఎమోషన్ లో జనానికి మతి తప్పింది. దేవుడు కూడా ఆంధ్రామృతం త్రాగి గతి తప్పినట్టున్నాడు. (ఏమంటావ్ కృష్ణయ్యా? నిన్ను కాదులే అంది. పాపం ఎవరో దేవుడట. ఒకడున్నాడంటున్నారు.).
---------------------------------------------------------------------------
వాడు చేసిన తప్పుకి చంపేశారు. బాగుంది. రేపు ఆ పిల్లాడి తండ్రో... లేక వారి వంశం లో ఎవరో ఈ దీనికి ప్రతీకారం తీర్చుకునేటన్దుకు పెద్ద పెద్ద exercise లు చేసి, పిస్టల్ పట్టుకుని కాల్చటం నేర్చుకుని, ఒక గుర్రపు స్వారీ చేసి, ఒక హీరోయిన్ తో డ్యూయెట్ పాడుకుని చివరాఖర్న వీడు ఆ పిల్లని చంపేసి 'ఇప్పుడు నా పగ చల్లారింది. నా వంశీకుల్ని చంపటానికి కారణమైన ఆ అమ్మాయిని (ఇప్పుడు బామ్మ) నేను చంపేశాను,' అంటాడు.
ఎవరి కోసం ఈ నాటకాలు? ఎవరిని ఉద్ధరించటానికి ఈ షోకులు? టీవీ ల వాళ్ళకి వేరే ఏ పనీ లేక చేసేదా ఇది? ఎందుకు అసలే మానసికంగా శారీరకంగా గాయపడిన ఆ పిల్ల ముహంలో మైకు పెట్టి అభిప్రాయం అడగటం ఎందుకు? న్యాయం జరగాలంటే మరో మార్గం లేదా? మైకుతోనే న్యాయమా?
నక్సలైటన్నలూ ఏమంటారు? తుపాకీ వదిలేసి (కమల్ అన్నట్టుగా లపాకీ కాదు. నిజం గానే తుపాకీ వదిలేసి) మైకు పట్టండి. అన్యాయం జరిగిన వాళ్ళందరి ఉం లో మైకు పెట్టి వారి అభిప్రాయాలని అడగండి. మీరు కోరుకున్న సామాజిక న్యాయం జరుగుతుంది.
-------------------------------------------------------------------------
ఇప్పుడు ఆ పిల్లగాడి తల్లి తండ్రుల పరిస్థితి ఏమిటి? దొరికారని ఎన్కౌంటర్ చేయతమేనా? మరి మన నాయకులూ చాలా సార్లు దొరికార్గా? మరి వాళ్లనేపుడు ఎన్కౌంటర్ చేస్తారు?
ఒక పని చేద్దాం. తప్పు చేసిన వాడిని చంపేద్దాం. దొరక గానే. అలా అలా చంపేద్దాం. అందరికీ భయం వేసి తప్పు చేయటం ఆపేస్తారు.
ఇది ఇలా ఉనుంది. యాసిడ్ పోసినందుకు ఆ కుర్రాడిని చంపేశారు కదా! ఇప్పుడు ఆ పోలీసుల్ని తప్పు చేసినందుకు నది రోడ్డులో కాల్క్ష్హి చంపేద్దాం. తర్వాత ఆ పోలీసుల్ని చంపినందుకు ఆ కాల్చిన వాళ్ళని చంపేద్దాం. ఈ లోపుల మానవ హక్కుల సంఘాలు పండగలు చేసుకుంటాయి. (వాళ్ళకి బ్రహ్మానందం యాభై పైసలు ఇచ్చి పండగ చేసుకునేటందుకు
encourage చేస్తాడు. అప్పుడు వాళ్లు బ్రహ్మానందానికి ఓ వంద నోటు ఇచ్చి బిర్యానీ తిని నువ్వే పండగ చేసుకో అంటారు.)
అప్పుడు ఆ చంపిన వాళ్ళని ఇంకొకరి చేత చంపిద్దాం. తరువాత ఇంకొకరిని ఇంకొకరి చేత.
ఫిర్? ఇంకో ప్రాణం తుర్.
ఒక పద్ధతీ పాడూ మనకి వద్దు. ఎందుకంటే మనం సామాజిక న్న్యాయం కి కట్టు పడ్డాం కదా. చక్కగా తప్పులు చేద్దాం. చంపేసుకుందాం. అప్పుడైతే హాయి హాయి గా అందరూ చచ్చి పోతారు. దేశం లో family planning అమలవుతుంది. యాసిడ్ తెచ్చిన family planning. ఎంత బావుంటుందో! "రకరకాల ముసుగులు వేస్తూ ఎపుడో మరిచాం సొంత ముఖం"
--------------------------------------------------------------------------
స్వప్నిక మీద దాడి జరగటం ఎంత ఆటవికమో అ పిలాదినీ చంపటమూ అంతే. జనానికి కావాల్సింది వాళ్ల అహం చల్లారటం. రేపు ఎవరూ ఆ పిల్లని ఆదరించరు. అది జరగబోఎడే. ఏదో పెద్ద హీరోయిన్ లా మీడియా ముందు ఆక్రోశిస్తే ఏమి లాభం? వారం లో పోయే గొడవకి అందరికీ ఏదో ఒక తుత్తి టైపు ఆవేశం. కానీ long standing లో జరిగే నష్టాన్ని ఎవరూ పట్టించుకోడం లేదు.
1. స్వప్నిక ఒక అందమైన చిలుక లాంటి అమ్మాయి.
2. ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసిన వాడొక పశువు.
3. వాడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు అంత కన్నా హీనం.
4. మరి దానికి పండుగ చేసుకున్న వాళ్లు? ఏమవుతారు?
మనం ఆలోచించొద్దు. బుర్ర అసలే ఉపయోగించొద్దు. ఉపయోగిస్తే ఇలాంటి నేరాలు జరగవు. అప్పుడు మనం మాట్లాడుకునేందుకు టాపిక్కులే ఉండవు. హాయ్. హాయ్.
http://in.youtube.com/watch?v=p68rj879Zyg
నేను వ్రాసేటప్పుడు ఈ పాట వింటూ వ్రాశాను. (Otherwise I could not controll my anger, and emotions. I feel that's not right.) మీరూ వినండి. చూడండి. కానీ పరిష్కారం ఆలోచించే దిశ గా అడుగులు వేద్దాం. అంతే కానే ఆవేశాన్ని చూపించటం చేయొద్దు.
December 14, 2008 at 4:52 AM
మీ భావాలతో ఏకీభవిస్తున్నాను.
December 14, 2008 at 4:54 AM
గీతాచార్య గారు. అనవసరమైన సెన్సిటివ్ ఇష్యూ ఇది. జనానికి అర్ధం కాని, చేసుకోని విషయం.
మంచి పాయింట్ ని టచ్ చేశారు మీరు. బాగుంది. కానీ మీ సహజ శైలిలో ఉంది. అదొక సమస్య. అపార్ధం చేసుకునే ఛాన్స్ ఉంది. వ్యంగ్యం మొదటే అర్ధం కాదు. సీరియస్ నీ పట్టుకోలేరు. అసలు విషయం అదికాదు. జనం ఆలోచించరు. థెయ్ వాంట్ ఎమోషన్స్. నాకు దర్శకుడు తేజ చెప్పిన విషయం గుర్తు వస్తోంది. 'నువ్వూ నేను' సినిమా ఎందుకు హిట్ అయిందంటే "ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. జనానికి ఆ ఎమోషన్ ని పట్టిస్తే చాలు. సినిమా హిట్. అలాగే ఇంకోసారి రక్తం చూస్తె ఎమోషన్ డెవెలప్ అవుతుంది. అందులోనూ ఇండియా పాకిస్తాన్ అంటే మరింత ఎమోషన్ వస్తుంది," అన్నాడు. అదే అసలు సమస్య.
There is no rational thought in most of the people. బ్రాండ్ వేస్తారేమో జాగ్రత్త.
BTW బాగా రాశారు. ఫస్ట్ టైం అనుకుంటా సీరియస్ ఇష్యూ లేవనెత్తటం. As usually no much comments? ;-)
December 14, 2008 at 5:34 AM
I unsuccessfully attempted at paradox style. I know the fault. But anyway it's written by me well.
I'm satisfied. May not appeal to some people. But that doesn't concern me.
Thanks for the comment Priya.
December 14, 2008 at 5:44 AM
సార్! మీరు బైట చంపేస్తోంది ఇలాంటివిషయాల్లోనే. మన సతీష్ గాడికి మంచి చెప్పి అనవసరంగా మాటలు పడ్డారు. ఇప్పుడు జనానికా? అయ్య బాబోయ్.
మీకే నేను మొదటి కామెంట్ వ్రాస్తాను (మీ ఇష్టైలే) అని అనుకోలేదు. You oughtta do it. But beware of people. Common man stopped thinking long back.
మీరు ఓపెన్ చేయించిన బ్లాగ్ ని కూడలి కి పంపాను.
December 14, 2008 at 5:50 AM
paradox antekaasta cheputhaaraa?
December 14, 2008 at 5:50 AM
గ్రేట్ వ్యూస్. బాగుంది మీ ఆవేదన. I agree with you. The song is good. :-)
హాస్యం వదిలేస్తే జనానికి మీరు చెప్పేదిఎక్కదనుకున్టా. కొంచం సింపుల్ స్టైల్ లో రాయండి.
December 14, 2008 at 6:18 AM
చెల్లి చెపితే చూశాను. చాలా రోజులైంది మే టపా చూసి. ఈ మధ్య అన్నీ బానే రాస్తున్నట్టున్నారే? ;-)
వాడు చేసిన తప్పుకి చంపేశారు. బాగుంది. రేపు ఆ పిల్లాడి తండ్రో... లేక వారి వంశం లో ఎవరో ఈ దీనికి ప్రతీకారం తీర్చుకునేటన్దుకు పెద్ద పెద్ద exercise లు చేసి, పిస్టల్ పట్టుకుని కాల్చటం నేర్చుకుని, ఒక గుర్రపు స్వారీ చేసి, ఒక హీరోయిన్ తో డ్యూయెట్ పాడుకుని చివరాఖర్న వీడు ఆ పిల్లని చంపేసి 'ఇప్పుడు నా పగ చల్లారింది. నా వంశీకుల్ని చంపటానికి కారణమైన ఆ అమ్మాయిని (ఇప్పుడు బామ్మ) నేను చంపేశాను,' అంటాడు.
ఇదంతా చాలా ఎబ్బుట్టుగా ఉంది. నక్సలైటన్నలకి పెట్టిన వాత బాగా నవ్వించింది. పోకిరి జోకు కూడా బాగుంది. కానీ ఇల్లాంటి విషయాల్లో రాయకూదదేమో? ఇంకో విషయం. మానవ హక్కుల సంఘాలు కాదు పండుగ చేసుకుంది. విద్యార్ధి సంఘాలు.
సమాజానికి పడిన శిక్ష? ఈ మాటని నేను చూసినంతలో మీరే అడిగింది. మీరిలాంటివి రాయరని నేను ఓపెన్ చేయలేదు. చెల్లి పంపితే చూశాను. చాలా పోస్ట్ లని చూశాను. సుజాత గారూ బాగా రాశారు. అక్కడా కామెంటాలి.
మనలో మనమాట. ఇన్ని కామెంట్లే అప్పుడే! అదీ మీకు?
December 14, 2008 at 6:37 AM
గీతాచార్య,
సెన్సిటివ్ ఇష్యూ ని మీ స్టైల్లో రాశారు. ముఖ్యంగా రామన్నయ్య సంఘ సేవో మరోటో చేస్తున్నాననుకుని ఆడపిల్లల్ని ఎంతగా ముద్దు చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నాడో మీరు మరో టపాలో రాయాలి.
మీరు చేసారు. చాలా సేపు ఆలోచింప జేసింది మీ టపా! నిజంగా బాగుంది.ఇంకేం రాయలో తెలీడం లేదు.
December 14, 2008 at 6:45 AM
One can not go better than this. paina mee style mee style antunnaaru. language usage sooparu. pakshi gaadini meeru vaayincheshaarugaa? kathi laanti blog maastaaroo.
December 14, 2008 at 7:53 AM
వ్యగ్యం అదిరింది గీతాచార్య గారు...మీ అభిప్రాయాలతో ఏకిభవించడం తప్ప చెప్పడానికి ఏమీలేదు.
December 14, 2008 at 10:38 AM
గీతా చార్య గారు.. మీ భావజాలం తో నేను ఏకీభవించలేక పోతున్నానండి. ఈ దేశం లో రైల్వే స్టేషన్ లోనూ, చాట్ భండార్ ల లోనూ, పార్కుల్లోనూ ఎక్కడబడితే అక్కడ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్న టెర్రరిస్టుల అకృత్యాలని భరిస్తున్నాడు సామాన్యుడు. ఈ సదరు సామాన్యుడికి స్వతంత్రంగా బతికే హక్కు లేదు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎందుకలా అంటే... మరి సంసారం జరగాలి కదా.. సరే మన రక్షణ మన మంచి చెడూ చూడడానికి ప్రభుత్వాన్ని ఎన్నుకొంటాం. ఆ ప్రభుత్వమూ సామాజిక న్యాయాలు, జల యఙాల పేరిట ఈ సామాన్యుడి సొమ్ము బొక్కేస్తున్నా సామాన్యుడు ఎందుకు ఇలా అని అడగలేడు. తన ఖర్మ ఇంతే అని తన పనేదో తను చూసుకొనే సామాన్యుడికి ఈమధ్యే ప్రారంభమైన ఈ "అమ్మాయిలను ప్రేమ పేరు తో నరకడం" అనే కార్యక్రమం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. శ్రీ లక్ష్ములూ, ఆయేషలు కిక్కురుమనకుండా కన్ను మూసినా.. చట్టం చేసిన న్యాయం అంటూ ఏమీ లేదు. కానీ ఒక్క సారి ఇలా ఎన్ కౌంటర్ చేసిన పోలిసులను సామాన్యుడు అభినందించే సరికి మీరు కోపాన్ని ఆపుకోలేక ఆ సామాన్యుడిని,ఆసిడ్ పోసిన శ్రీనివాస్ కన్నా, ఎన్ కౌంతర్ చెసిన పోలిసులకన్నా హీనుణ్ణి చేసెయ్యడం ఏమీ బాగోలేదండి. ఇలా చంకలు కొట్టుకొంటున్న వాళ్ళలో ఎంతమంది అమ్మాయిలను ఏడి పించలేదు లేక ఎంత మందికి అమ్మాయిని చూస్తే కామొద్దీపనం కలగలేదు అని ప్రశ్నించారు. ఈ వాదనే తప్పండి. మనిషి బేసిక్ గా మృగం నుండి వచ్చిన వాడు. వాడికి ఇలాంటి ఆలోచనలు రావడం లో తప్పు లేదు. ఎందుకంటే ఆలొచనలు మన కంట్రోల్లో వుండవు కనుక. కానీ అలాంటి మృగ లక్షణాలను తమ విచక్షణ తో అణిచి వేసి నప్పుడే, తల్లికీ, పెళ్ళానికీ తేడా ఎరుగ గలిగినప్పుడే ఆ మృగత్వం నుండి మానవత్వం వైపు మనిషి మనుగడ సాగుతుంది. అలా తేడాలు తెలియని వాడు.. తను ప్రేమించాడు కనుక ఎదుటి వ్యక్తిని ఎలాగైన లొంగదీసుకొవాలనుకోవడం, అలా కుదరక పోతే ఆ అమ్మాయికి వెనక్కు తీసుకోలేని విధంగా జీవితం నాసనం చెయ్యడం ఇవన్నీ మృగ లక్షనాలు. దానికి పొలీసులు చూపిన ఈ ఆటవిక న్యాయమే సరైంది. కనీసం మరో మృగం నిద్ర లేవకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరదాగా ఒక అమ్మాయిని ఏడిపించడానికీ, ఆసిడ్ పోయడాన్ని మీరు ఒకే గాటన కట్టెయ్యడం అసలు నచ్చలేదండీ...
ఈ దేశపు సామాన్యుడు కూడా మెల్లగా విప్లవిస్తున్నాడు. దాన్ని ఇలా ఎగతాళి చేసి అణిచెయ్యవద్దు. ఇప్పటి దాకా వాడు అనుభవించిన కష్టాలు చాలు...
December 14, 2008 at 12:28 PM
గీతాచార్యా..
మీ స్టైల్ లో చెప్పలేను గానీ.. నా ఘోష కూడా అదే..
అయినా చాలామందికి మనం మాట్లాడేది చాలా వింతగా ఉంది.
అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో.. మనం పండగ చేస్కోవాల్సింది పోయి.. ఆటవిక న్యాయం.. గోంగూర పచ్చడి..అంటూ మాట్లాడుతున్నామేంటి..అని అన్నమాట.
ఏది ఏమైనా..మీరు మాత్రం చాలా ఘాటుగా స్పందించారు :)
December 14, 2008 at 5:47 PM
సమాజానికి పడిన శిక్ష? wow!! Good question
December 15, 2008 at 6:20 AM
baagundi mee tapaa. kaanee naaku ardham kaani vishayam okatundi. paradox upayoginchatam lo meeru fail ayinattu naakanipinchaledu. chaalaa baagaa vaadaaru. You might not use it like a master, but you are not far behind.
I agree with your views. But you have to consider some of the points you told again.
March 13, 2009 at 6:51 AM
సత్యాన్వేషి chaala bavundhi
March 13, 2009 at 6:52 AM
సత్యాన్వేషి baavundhi sir
Post a Comment