ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

రామాయణం - వాల్మీకి మహర్షి

రామాయణ మహాకావ్యం తో విడదీయరాని అనుబంధం కలిగిన పేరు వాల్మీకి మహర్షిది. వల్మీకములనుండీ ఉద్భావించినవాడు కావటం చేతనే వాల్మీకి గా ప్రసిద్ధుడైనాడు. అంతియే కాదు. పుట్టాను ఛేదించుకుని తానూ వచ్చినట్లే ఆ రామ కథను మనకి అందించి తాను ధన్యుడై, మనలనూ ధన్యులను చేశాడు.

శ్రీమదఖిలాండ సచ్చితానంద పరమాత్ముని సృష్టిలో వివేకము కలిగిన మానవ జాతి ఒక్కటి మాత్రమే గొప్పది. ఇటువంటి మానవ జన్మను సార్ధకం చేసుకునేటందుకు ధర్మ, అర్ధ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్ధములను ఆర్జించుకోవాలి. ధర్మాన్ని అవలంబించి మిగిలిన పురుషార్ధములను ఆర్జించుకోవాలన్న ఉద్దేశ్యమే ధర్మాన్ని ప్రధమంగా నిలపటానికి కారణం అవుతుంది. ఈ విషయాన్ని గురించేకాకుండా... ధర్మాన్ని గురించి, ధర్మాచరణ గురించి, సోదాహారం గా వాల్మీకి మహర్షి వ్రాసిన కావ్యమే రామాయణం.

----------------------------------------------------------------

ఇది నేను మొదటి సారి టైపు చేసిన పోస్ట్. అంతకుముందు మా అబ్బాయి టైపు చేశాడు. అందుకే నా ఓపికను బట్టీ ఇంతే వ్రాశాను. ఇక ముందు పూర్తిస్థాయిలో వ్రాయాలి. నాకూ ఉత్సాహం వచ్చింది. పిల్లలని చూసి.
4 comments:

చాలా మంచి ఆరంభం. కొనసాగించండి. మా ప్రోత్సాహం మీకు ఎప్పుడూ ఉంటుంది. పోస్టు చేయబోయే ముందు ఒక సారి ప్రూఫు రీడింగు చేసుకోండి. అప్పుడు తప్పులు లేకుండా పోస్ఠులు రాయవచ్చు. అన్యధా భావించకండి.


రాజగోపాలా చార్య గారు,
శుభారంభం చేశారు. పరాక్రమించండి. మీ నుంచి రామాయణం గురించి మరింత తెలుసుకోవాలని ఎదురు చూస్తుంటాను.


రాజగోపాలా చార్య గారు,
శుభారంభం చేశారు. పరాక్రమించండి. మీ నుంచి రామాయణం గురించి మరింత తెలుసుకోవాలని ఎదురు చూస్తుంటాను.


స్వాగతం.. శుభారంబం..


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి