సప్త స్వరాలన్నీ
సప్త వర్ణాలుగా మలచి
నా మది పై బాణమేశావు
వర్ణాస్త్రానికి బందీనై
ఊహాలోకాన విహరించాను.
ప్రేమసాగారాన పవళించిన నీకు
పూజా పుష్పాలుగా నీ రంగులనే
పువ్వులుగా మలచి మాలగా ఇద్దామంటే
నాకు ఎదురైంది పుష్ప విలాపం.
జాలి ముప్పిరి గొన వాటినొదలి
నన్నే నీకిచ్చాను.
ప్రేమతో పాలిస్తావో...
అమ్మలా లాలిస్తావో...
నాలా నిలబెడతావో ఇక నీ ఇష్టం.
వర్ణరంజితమైన లోకంలో
వానజల్లు లా కురిశావు.
మోడువారిన నా గుండె పై
ఆశా పుష్పాలు చిగురిప జేశావు.
చెట్టునడిగాను, పుట్టనడిగాను,
నీ పేరు చెప్పమని,
నాకొకటే చెప్పావయి
నీవూ నేనూ వేరుకామని.
November 24, 2008 at 12:13 AM
చాలా బాగుంది. మనలో మనమాట...ఊరికే రాశారా కవిత?
November 24, 2008 at 8:14 AM
1. ఊరికే వ్రాయలేదండీ. పదిహేను రూకలు ఖర్చెట్టి మరీ వ్రాశాను.
2. ఏ ఊరికీ వ్రాయలేదండీ. నా బ్లాగు కోసం వ్రాశాను.
రెంటిలో ఏది బాగుంది? (ఏదో సరదాకి వ్రాశాను. కొంచం మూడాఫ్ గా ఉంటే. దయచేసి ఏమైనా అనుకోండి). :-)
November 26, 2008 at 11:41 PM
చమత్కారం బాగుంది! కానీ, నేనడిగింది మీకర్థం కాలేదని నన్ననుకోమంటారా?
May 6, 2009 at 10:47 AM
వర్ణాస్త్రానికి = నవ్యమైన అభివ్యక్తి. ఇంతవరకూ చదవలేదు. అద్భుతంగా ఉంది.
ఇక నీ ఇష్టం.
అన్నచోట నేను కవితను ముగించేసి, పుల్ స్టాప్ పెట్టేసుకొన్నాను. ఎందుకంటే నా ఇష్టం కనుక. అభ్యంతరం ఏమీ లేదుగా? :-)
(అభియోగం అర్ధమైందనుకొంటాను. టేక్ ఇట్ ఈజీ మిత్రమా)
బొల్లోజు బాబా
June 28, 2009 at 4:45 PM
* గీతాచార్య, మీ అనుభూతి, అది వ్యక్తం అవుతున్న తీరు అమోఘం. "నీవూ నేనూ వేరుకామని" తెలిసినా తెలిసినదాన్నే తరచి పరి పరి విధాలా తిరిగి తెలుసుకోవటం,నడిచిన దోవనే తిరిగి వస్తూ నెమరేసుకోవటం ఎంతో ఆహ్లాదకరం. అందుకే నేనన్నాను "నా మదే గువ్వగా నీ అరచేత వాలింది" అని http://maruvam.blogspot.com/2009/04/blog-post_05.html టపాకి టపా సమాధానం అని కాదు. అసలు నేను చెప్పుకున్న వూసులన్నీ సరిపడతాయి. ఇందులో "సప్త" అన్న ప్రయోగం వుందని ఇది గుర్తుచేసుకున్నాను.
Post a Comment