ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

గెలిచే వాడే మనిషి.

Labels:


MY FIRST WIMBLEDON HERO


"సాహసం చేయరా డింభకా! రాకుమారి నిను వరిస్తుంది." అని పాతాల భైరవి లో నేపాళ మాంత్రికుడు అంటాడు తోటరాముడు తో. మైకేల్ స్టిచ్ కి ఈ విషయం ఎవరన్నా చెప్పారో లేదో
నాకు తెలీదు. పదిహేడేళ్ళ నాడు వింబుల్డన్ లో పెను సంచలనాన్ని
సృష్టించాడు. సరిగ్గా పై డయలోగే నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. ఈ విషయాన్ని
తలుచుకుంటుంటే.


మైకేల్ స్టిచ్ గురించి చెప్పాలంటే...


Michael Stich (born October 18, 1968 in Pinneberg, West Germany) is a
former professional tennis player from Germany. He is best remembered
for winning the men's singles title at Wimbledon in 1991. He also won
the men's doubles titles at both Wimbledon and the Olympic Games, and
was a singles runner-up at the US Open and the French Open.


మాత్రం వివరాలు ఎవరికైనా దొరుకుతాయి. అందుకే నేను చెప్పేది వినండి.

అది 1991 లో ఒక ఆది వారం. మా మురళీబాబు నాకు ఒక Bourne Ultimatum జారీ చేశాడు. నేను ఆ రోజు సాయంత్రం కల్లా టెక్స్ట్ బుక్కులోని తను గుర్తుపెట్టిన లెక్కల్ని చేయక పోతే దెబ్బలు తప్పవని. నేను వరుసగా నాలుగు రోజులు స్కూలుకి వెళ్తూనే ఉన్నాను. మరి తనకి ఏమొచ్చిందో నాకు తెలీదు. కానీ అది ఒక వ్యక్తీ జీవన గమనాన్ని మార్చేస్తుందని ఆయన ఊహించి ఉండడు.

వింబుల్డన్ సామెత: "కరవమంటే బెకేర్ కి కోపం... విడవమంటే స్టిచ్చికి కోపం."

ఆ రోజు నాకింకా గుర్తు. మురళీబాబు దాడి నుంచీ తప్పించుకునేందుకు నాకు అప్పటిదాకా ఏ ఉపాయం తోచలా. అందుకే నేను ఏమి చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న ఊరినుండీ తిరిగి వచ్చాడు. రాగానే కొంచం కాఫీ త్రాగి టీవీ పెట్టాడు. ఆయన ఏవేవో ఆటలు వస్తే చూస్తాడని నాకు తెలుసు. ఆయన ఆటలని చూస్తున్నప్పుడు ఎవరూ కదిలిన్చరు. కొప్పడుతారని కాదు ఆయనని ఆ కాస్త సమయంలోనైనా విశ్రాంతి గా గడుపుతారని.

అంతే నాకు ఉపాయం తోచింది.

వింబుల్డన్ సామెత: "ఉపాయం తోచని వాడిని వింబుల్డన్ లోనుంచీ తోసేయండి."

నేను ముద్దు గా వెళ్లి నాన్న వళ్ళో కూచున్నాను. ఆయన నవ్వుతూ నన్ను కూచోపెట్టుకున్నారు. ఇంతలో రమా పిన్ని వచ్చి నన్ను ఆయనని తోక్కొద్దు అంది. "ఇదిగో రమాదేవీ! కొంసేపు కూచుంటే ఏమవుతుంది? వాణ్ణి కాసేపలా వదిలేయండి," అన్నాడు. "సరే రాజా మామయ్యా!" అంటూ తను సైలెంట్ గా వెళ్ళిపోయింది.

అప్పుడే బెకెర్ ఒక అద్భుతమైన డైవింగ్ వాలీ కొట్టాడు. నాకు ఇంట్రెస్ట్ అనిపించి, "నాన్నా! ఎవరు?" అన్నాను.

"వాడి పేరు బోరిస్ బెకెర్."

"అంటే కప్పా!"

"కాదు."

అయినా నాకు కప్పే బాగుంది, అలాగే ఫిక్స్ అయ్యాను. ఒకసారి బెకెర్ unforced error చేస్తే నాన్న బెకెర్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అని అన్నాడు. మరోసారి వాలీ మిస్ అయితే నేను "కప్పగాడు బెక్ బెక్," అన్నా.

ఇంతలో ఒకండు చూడ చక్కని వాలీ వేశాడు. "నాన్నా! వీడెవడు?" అన్నాను.

"మైకేల్ స్టిచ్."

"అంటే?"

నాన్న కుట్లూ, అల్లికలూ అని ఏమీ చెప్పలేదు. ఇంతలో కుమారి పిన్ని "వాడు కప్ప అయితే, వీడు పాము," అంది. ఏ పాము అని ఆలోచించి "వీడు కొండ చిలువ" అని నామకరణం చేశాను.

చూడండి. మనం ఏమరు పాటు గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా కొండ చిలువ మన మీద పడి "వివాహ భోజనంబు..." అనుకుంటుంది. అలాగే రోజు మా కప్ప గాడు ... అదే బెకెర్, టైటిల్ నాదే అని ఏమరు పాటు గా ఉన్నట్టున్నాడు.

నేను నామకరణం చేసిన ముహూర్త బలమో ఏమో కానీ, మైకేల్ స్టిచ్ తొలిసెట్ ని 6-4 తో గెలిచాడు. ఇంతలో యాడ్స్ వచ్చాయి. అప్పుడు నాన్న నాకు ఒక రఫ్ పేపెర్ మీద టెన్నిస్ కోర్ట్ బొమ్మ గీసి ఆటని వివరించారు. ఆ పేపెర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అయితే అన్ని రూల్సూ నాకు తెలియలేదు కానీ స్థూలం గా నాకు ఆట మీద అవగాహన వచ్చింది.


మ్యాచ్ మళ్ళీ మొదలైంది. స్టిచ్ మరో విన్నెర్ బాదాడు. నేను ఆనందంతో గంతులేశాను. ఇంతలో నా పాలిటి విలన్ మురళీబాబు వచ్చాడు. అయితే నా పన్నాగం ఫలించి ఆయన నన్ను, నాన్నని డిస్టర్బ్ చేయలేదు. 7-6 తో స్టిచ్ రెండో సెట్ గెలిచాడు. నా ఆనందానికి అవధులు లేవు. మరి స్టిచ్ నాకు ఎందుకు నచ్చాడో తెలీదు. బహుశః గెలుస్తున్నాడని కాబోలు. అంత చిన్న వయసులోనే "ఎవరికైనా గెలిచే వారే నచ్చుతారు".

ఇంతలో నాకు నిద్ర టైమయింది. నేను మంచమెక్కాను. కానీ నాకు నిద్రలోనూ నా హీరో ఆలోచనలే. మధ్యలో లేచి "నాన్నా! ఎవరు గెలిచారు?" అన్నాను.

"రెండు రౌండ్లు స్టిచ్చే గెలిచాడు. వాడే గెలుస్తాడులే."

తెల్లారింది. పేపెర్ వచ్చింది. నేను అందరికన్నా ముందే లేచి కూచుని అందరికన్నా ముందే పేపెర్ తీసుకుని న్యూస్ చూద్దును కదా... "బెకెర్ బోల్తా". అది ఆంద్ర జ్యోతి.

మన పంథా: "గెలిచే వాడే మనిషి."

Note: నాన్నని డు డు అంటున్నాడు అనుకుంటున్నారా... మా నాన్న నన్ను జీవితంలో ఒకే ఒక్కసారి కొట్టాడు. కారణం... "సత్యమేవ జయతే" లో చెపుతాను. అంతదాకా సెలవ్.

(సశేషం)

NEXT BLOG IS: "OLYMPIC TENNIS".
15 comments:

నాకు తెలీదు వీరెవరో! చాలా యేళ్ళ క్రితంది. భలే గుర్తుందే!! నాకు కాంబ్లీ 234 (సునీల్ గవాస్కర్ రికార్డ్) చేసిన మాచ్ మా అమ్మ వివరిస్తుంటే చూడడం ఇప్పటికీ గుర్తు! బాగున్నాయి జ్ఞాపకాలు.

ఇంకాస్త రాస్తే బాగుణ్ణు అననిపించింది, కానీ తరచూ బ్లాగితే ఆ లోటు తీరుతుందేమో! ఇక ఈ మాచ్ గురించి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నంలో నేనుంటాను. మొదటి పారా కాస్త సరిచూడగలరా?

"గెలిచిన వాడే మనిషి"- పూర్తి చేయండి, నేను మాట్లాడుతా అప్పుడు :-)


addirindi maastaaroo! nijamgaa meeru ee vishayamlo... ade aatalani muchhatlanee kalipi manchi jugalbandee laagaa cheseshaaru.

"మా మురళీబాబు నాకు ఒక Bourne Ultimatum జారీ చేశాడు." Bourne Ultimatum!!! ahaahaa!

వింబుల్డన్ సామెత: "ఉపాయం తోచని వాడిని వింబుల్డన్ లోనుంచీ తోసేయండి."


"మనం ఏమరు పాటు గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా కొండ చిలువ మన మీద పడి "వివాహ భోజనంబు..." అనుకుంటుంది. అలాగే ఆ రోజు మా కప్ప గాడు ... అదే బెకెర్, టైటిల్ నాదే అని ఏమరు పాటు గా ఉన్నట్టున్నాడు."

wait chesinanduku meeru nijamgaane manchi blog ichhaaru.

thanks.


భలె! మళ్ళీ వచ్చేశారు. కొండ చిలువ - కప్ప ఎనాలజీ చాలా బాగుంది. మరి మిగతా పార్ట్ ఎప్పుడు? పూర్ణిమ గారన్నట్లు అప్పుడే అయిపోయిందా అనిపించింది. రెగ్యులర్ గా బ్లాగి ఆ లొటు తీర్చంది మరి. :-)


మాస్టర్జీ చాలా బాగుంది. నా పేరు ధనరాజ్ మన్మధ. నేనూ బ్లాగులని మొదలెట్టాను. స్పొర్ట్స్ గురించిడదిగితే మీ బ్లాగ్ పేరు చెప్పారు. కవిథలకి కల్ హార బ్లాగ్ చెప్పారు.బహు పసందు గా ఉన్నై రెండూ. మీవన్నీ చదవాలని ఉన్నా తైం లెదు ఇప్పుడు. ఛదివి కామెంటుతాను.


ఇంతకీ రాకుమారి స్టోరీ చెప్పలేదు. :-)


". మా మురళీబాబు నాకు ఒక Bourne Ultimatum జారీ చేశాడు."

Great!

"మనం ఏమరు పాటు గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా కొండ చిలువ మన మీద పడి "వివాహ భోజనంబు..." అనుకుంటుంది. అలాగే ఆ రోజు మా కప్ప గాడు ... అదే బెకెర్, టైటిల్ నాదే అని ఏమరు పాటు గా ఉన్నట్టున్నాడు."

Excellent analogy.

ఇంతకీ మీ నాన్నగారు మిమ్మల్ని ఎందుకు కొట్టారు?


మీ వింబుల్డన్ పోస్టులు చదువుతుంటే ఎప్పుడో చిన్నప్పుడు బెకర్, ఎడ్బర్గ్ లు పోటీ పడే అన్ని మాచులూ గుర్తొస్తున్నాయి. ఎన్ని మాచ్ లు చూసినా వింబుల్డన్ అనగానే ఒక రకమైన టెన్షన్! అందుకోసం (అంత చిన్న వయసులో టెన్నిస్ స్కోరు ఎలా చూడాలో తెలియదు కాబట్టి) అన్నయ్య వెంబడే ఉండి, టెన్నిస్ స్కోర్ ఎలా చూడాలో తెలుసుకుని 'లవ్ ' అంటే 0 ఎందుకవుతుందో తెలియక , భలే ఉండేవి ఆ రోజులు!
ఆటల గురించి (క్రికెట్) తప్పించి ఇలా రాసేవాళ్లు ఉండాలి గీతాచార్య గారు, ఇంకా రాయాలి మీరు!


హబ్బా! ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు.

ఈ మధ్య ఎవరో మా బ్లాగులో సుజాత గారి, కట్టి మహేష్ కుమార్ గారి కామెంట్లు లేకుంటే ఏదో పోగొట్టుకున్నట్లున్తుంది అని అన్నారు. నేనూ అదే ఫీలయ్యాను. ఇన్నాళ్ళకి సుజాతగారి కామెంటు పడింది. థాంక్స్.


@ప్రియ గారు:

మీరు ఎంతో ఇంట్రెస్ట్ గా నా బ్లాగ్స్ ని విశ్లేషిస్తూ చెప్పుతున్నారు. మీ బ్లాగ్ లో నన్ను వింబుల్డన్ విలేజ్ రాయట్లేదంటే నేను చెప్పిన సమాధానానికి మీరు ఇచ్చిన ప్రతి సమాధానం నన్ను మళ్ళీ రాసేందుకు పురిగొల్పింది. నెనెర్లు.


@ Srujana and Vaishnavi garu,

Thank you for your interest on my blogs.


@ప్రవీణ్ గార్లపాటి గారు: రాకుమారి స్టిచ్ ఫోటోలోనే ఉంది చూడండి. కామెంటుకు నెనెర్లు. :-}


@పూర్ణిమ గారు:

సిస్టం ప్రాబ్లం తో మొదట తప్పులు వచ్చాయి. మీరు సూచించినందుకు నెనెర్లు. తెలుగులో స్పోర్ట్స్ బ్లాగు రాస్తే చూస్తారా అని నేను ఆలోచిస్తుండగా మీరు "నా ఇంట్లో వాళ్లెఁవరంటే..." లో choottame kaadu.. maato pamchukondi kooda ani annaaru. దాంతో ఒక్కళ్లన్నా చదువుతారని మొదలెట్టాను. ఎందుకంటే నాది అంత high clicked బ్లాగ్ కాదు. నలుగురైదుగురు బ్లాగ్మిత్రులు చదువుతూ ప్రోత్సహించారు.

అందుకనే "ధైర్యమే ఆయుధం" అనుకుంటూ మొదలు పెట్టాను. మరోసారి నెనెర్లు.


Dhana! I have used this name once. Thanks for this comment. Who told you about my blog?


హ హ భలే రాసారు,నేను ఆపేరు వినగానే కప్పలా ఉంది అనుకునేదాన్ని


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి