ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

"నిఝంగా క్రికెట్టేనా??" కి స్పందన.

Labels:
ముందు ఒక విషయం గమనించాలి. మనకి ఐదు వేళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని పొడుగువి. కొన్ని పొట్టివి. కొన్ని లావుగా ఉన్నాయి. మరికొన్ని సన్న గా ఉన్నాయి.

సన్న గా ఉన్న వేళ్ళు లావు వేళ్ళని లావు వేళ్ళు సన్న వేళ్ళని శత్రువులుగా చూస్తే మన చేతి పరిస్తితి ఏమిటి? అలాగే లైం లైట్ లో ఉన్న వాళ్లు ఉన్నవాళ్ళని తిట్టుకుంటే ఏమొస్తుంది?

క్రికెట్ ఆ స్తాయి లో ఉండటానికి కారణం... 1983 ప్రపంచ కప్పు గెలవడమే. అలాంటి విజయాలు ఈ మధ్య కాలం లో ఎవరు సాధించారు ఇతర క్రీడలలో? సానియా టెన్నిస్ లో రాణించినా టెన్నిస్ కి అది చేడుపే అయింది. కొందరు స్ఫూర్తి పొందినా ఎక్కువ గా తన పధ్ధతి తో ఆటకి అగౌరవం తీసుకొచ్చింది. జెండా గొడవ, డ్రెస్సుల గొడవ... ఓడితే గాయాల మాట! (విమర్శించట్లేదు. జరుగుతోంది అదే. నిన్న ఒలింపిక్స్ లో మరో సారి.) హాకీ వాళ్లు గుర్తించలేదని ధర్నాలు చేశారు కానీ ఆ శ్రద్ధ ఆట మీద పెడితే ఒలిమ్ప్క్స్ లో ఆడే వారేమో కదా! ఇతర ఆటలకి అంత ఆదరణ లేక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చెపితే అది కామెంతవాడు. ఒక బ్లాగు అవుతుంది. అసలే మహేష్ గారికి ఒక బ్లాగు బాకీ పడ్డాను.

క్రికెట్ ని మన వాళ్లు ఇష్ట పడటానికి ప్రధానమైన రీజన్... మన వాళ్ల బద్దకమే. నిజం. అలా ఎనిమిది గంటలు చూడొచ్చు కదా ఏ పనీ చేయకుండా. మార్కెటింగ్ కి ఆ ఆటే అనుకూలంగా ఉంది. వికెట్ పడితే ఓ యాడ్, ఓవర్ ఐతే ఒక యాడ్, ఆట ఆగితే మధ్యలో ఒక యాడ్. ఆ సౌకర్యం మరో క్రీడలో లేదు. టెన్నిస్ లో మూడు గేమ్స్ అయితే కానీ యాడ్ వేసేందుకు వీలు లేదు. ఫుట్బాల్ లో కనీసం అరగంట వెయిట్ చేయాలి. ఎవరాగుతారు మన దేశం లో.
క్రికెట్ కి కపిల్ వచ్చినట్లు, ప్రతి ఆటకూ ఎవరో ఒకరు రావాలి. అంట దాకా తప్పాడు మరి.
వీటికి తోడు రాజకీయాలు ఉన్నాయి. "అంగట్లో అన్నీ ఉన్నా హెడ్ రూపం లో గిల్ ఉన్నాడు." హాకీ సామెత.
టెక్నాలజీ ని అన్దోకో లేక పోవడం, మొదటి నుంచీ మన వాళ్లు శ్రద్ధ పెట్టక పోవడం.... ఇలా చెపుతూ పొతే ఎన్నో, ఎన్నో ఉన్నాయి.

కాక పొతే ఇందుకు ఎవరినో అనే బదులు ఆల్రేడి పాపులర్ అయిన ఆటగాళ్ళు తమ తమ ఆటల్ని ప్రొమోట్ చేయ వచ్చు. కరణం మల్లీశ్వరి ఒక కాంస్యం గెలవగానే కోతి తీసుకుని హాయిగా సెటిల్ అయింది. గోపీ చందూ అంతే. కాకపొతే సైనా ని తయారు చేశాడు.

ఉష కి ఉన్న పట్టుదల మిగతా వాళ్ళకి లేదు. తన అకాడెమీ నుంచీ అయినా ఒలింపిక్ హీరో/హీరోయిన్ వస్తుందని ఆశిస్తున్నాను.

ముందున్న వాడిని పడేసి మనం గెలవడం కాదు. వాడికన్నా శక్తివంతంగా తయారు కావాలి. ఈ ఆలోచన ఎవరికీ లేదు.

చెప్పాల్సింది చాలా ఉంది. సిస్టం టైం అయిపోయింది. మరో సారి ఇంకొంచం లాజికల్ గా వ్రాస్తాను. ఇది ఒక కామెంటే. కంప్లీట్ బ్లాగ్ కాదు. అలాగే చూడండి.

కామెంట్ అనుకుని వ్రాస్తే బ్లాగు లెంత్ వచ్చింది అందుకే బ్లాగేస్తున్నాను. లింక్ చూసి మీరు కామెంట్ వ్రాస్తారో లేక బ్లాగుతారో మీ ఇష్టం.

సత్యమేవ జయతే!
10 comments:

Waiting for your full length post!!


mee commente, powerful ga undi. chala baaga chepparu.. u r 100% correct about cricket.


క్రికెట్టు మనదేశంలో ఇంతకా పాతుకు పోవడానికి కారణం, అది ఒక ప్రైవేటు సంస్థ అయిన BCCI చేతిలో ఉండటమే. మిగతావన్నీ మన ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి (నా ఉద్దేశ్యం అన్నింటిని ప్రైవేటు చెయ్యమని కాదు). BCCI మనుగడ సాగించాలంటే ఏం చెయ్యాలి. జనాలకి క్రికెట్టుని అలవాటు చెయ్యాలి. అదే చేసారు. మనవాళ్ళు ఒక విజయం సాధించగానే విశ్రాంతి తీసుకొంటారు, కాని మిగతావాళ్ళు మరొక విజయాన్ని ఎలా సాధించాలా అని చూస్తారు. బహుశా మన రక్తంలోనే ఇటువంటి అలవాటు ఉంటుందేమో.

కొన్ని కారణాలని బాగా విశ్లేషించారు. మీ టపా కోసం ఎదురుచూస్తూ..


సన్న గా ఉన్న వేళ్ళు లావు వేళ్ళని లావు వేళ్ళు సన్న వేళ్ళని శత్రువులుగా చూస్తే మన చేతి పరిస్తితి ఏమిటి? అలాగే లైం లైట్ లో ఉన్న వాళ్లు ఉన్నవాళ్ళని తిట్టుకుంటే ఏమొస్తుంది?

Wonderful.. keep blogging


లైం లైట్ లో ఉన్న వాళ్లు ఉన్నవాళ్ళని తిట్టుకుంటే ఏమొస్తుంది?

లైమ్లైట్ లో లేని వాళ్లు ఉన్న వాళ్ళని తిట్టుకుంటే.... ఇలా ఉండాల్సింది బట్ స్పెల్లింగ్ తప్పు.


"కరణం మల్లీశ్వరి ఒక కాంస్యం గెలవగానే 'కోతి' తీసుకుని హాయిగా సెటిల్ అయింది."
!! అర్ధం కాలేదు...


oka koti, one crore.

sorry spelling mistake. Time n constraint.


Your views are presented well. Even if this is meant as a comment, it is written in an excellent manner. The example of "fingers of a hand" is very apt.

Waiting for a complete blog.

Visit....
http://priyamainamaatalu.blogspot.com/2008/08/blog-post_15.html


బ్లాగినా కామెంటైనా మంచి అభిప్రాయాలు రాశారు. మరి ఫుల్ లెంత్ బ్లాగులో ఏమి చెపుతారు?

కారణం మల్లీశ్వరి కథ ఒక చేదు నిజం. మన వారి attitude లోని లోపాల్ని పట్టిస్తున్నది.

మనవారికి మూడు పతకాలు వచ్చాయి. మరి మీ బ్లాగ్ ఎప్పుడు వస్తుంది?


very good views. write the full blog soon.:-)


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి