మనకి మరీ రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళే అలవాటు. అసలు నేను నాలుగోక్లాసులో జరిగిన రెండొందల డెబ్భై తొమ్మిది రోజుల్లో నూట డెబ్భై ఒక్కరోజులు వెళ్లాను. (171/279). మరీ రెగ్యులర్ కదూ.
కానీ ఏంచేస్తాం? ఇంకొంచం రేగులర్గా వెళితే శర్మా మాస్టారు తో ఇబ్బంది.అసలే ఆయన చందా శాసన ముండావాడు. ఇప్పుడు చదివినా వాయిస్తాదేమోనని భయం.నల్లగా, కొంచం పోట్టేలే, కానీ బుర్ర మీసాలతో చూడగానే భయం వేస్తుంది. ఇంకోవిషయం. చిన్నప్పుడు గండు పిల్లుల గురించి కథలు వినే వాడిని. ఆయన నవ్వితే నాకు గండుపిల్లే గుర్తొచ్చేది.
నాకు పొగరు ఎక్కువ అని ఆయన అభిప్రాయం. నేనేమో ఆయన దగ్గర అతి వినయం గా ఉండేవాడిని. శర్మా మాస్టారు మా నాన్న శిష్యుడు. నాకు ఏ స్కూల్ పడకరెగ్యులర్ గా వెళుతుంటే ఈయన దగ్గర వేశారు. కానీ మన టాలెంట్ ఆ పాచికాలనిపారనివ్వలేదు. ఈ స్కూలు విషయాలని వ్రాయాలంటే మరో టామ్ సాయెర్ ని సృష్టించాలి. ఆసంగతులన్నీ మరో బ్లాగులో వ్రాయవచ్చు.అసలు శీర్షిక విషయానికొద్దాం.
నేను ఐదో క్లాసు చదువుతున్న రోజులవి. తప్పని సరై ఆ ఏడు వరుస గా నేను 15 రోజులు (అక్షరాలా పదునైదు రోజులు) స్కూల్ కి వెళ్లాను. ఆ చారిత్రాత్మకమైన సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఆ ఫలానా రోజున బడికి వెళ్ళ లేదు.
అది శ్రావణ మాసం కావడంతో అమ్మ అమ్మమ్మా వాళ్ల ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. ఇక ఫో! మనకీ తనతో వెళ్లాలని అనిపించింది. రాజూ వెడలె అన్న టైపులో మనకి ఒకసారి ఏదయినా ఆలోచన వచ్చిందంటే అది అమలు జరిగి పోవాల్సిందే. ఆ రోజు మద్యాహ్నం నాన్న కాలేజి నుంచీ రాగానే నేను చినగా ఆయన దగ్గర కూర్చున్నాను. ఫిర్యాదు చేస్తున్నట్లు, "నాన్నా! అమ్మ ముట్టుపల్లి వెళుతోంది," అన్నాను. "ఏం వెళ్ళట్లేదు," నాన్న అన్నాడు.
"కాదు, వెళతానని నాతో అంది."
"వెళ్ళదులే."
"మరి తను వెళితే నేను కూడా వెళ్తాను."
ఇంతలొ అమ్మ వచ్చింది. "అమ్మా నువ్వు ముత్తుపల్లి వెళితే నన్నూ tఈసుకుని వెళ్ళ మంటున్నాడు నాన్న," అన్నాను నేను.
"నువ్వు ఇప్పుడు ఎందుకు?" నాన్న అన్నాడు.
"అమ్మ ఏదో మ్రోక్కుకున్నదిట," అమ్మ అన్నది.
"నాన్నా! నేనూ వెళుతాను."
"నువ్వెందుకయ్యా! బడి పోతుంది."
"లేదు నాన్నా! అమ్మ పదిహేను రోజులుంటుంది. నాకు దిగులు. రెండు రోజులుండి వచ్చేస్తానుగా," అన్నా.
కాకపొతే ఒక విషయం. ఇంట్లో ఉంటే ఒక్క నిమిషం అమ్మ మొహం చూడను. ఎప్పుడూ నాన్న కూచినే. అమ్మ అంటే స్నానం చేయించడానికే. అన్నం కూడా పిన్నులెవరో ఒకళ్ళు పెట్టేవాళ్ళు. నా పనంతా నాన్న ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటం, లేకపొతే ఏదో ఒక కథల పుస్తకం పట్టుకుని కూర్చోవడం. ఎప్పుడూ ఏవో ఆట పాటలతో గడిచి పోయేది.
మన సంగతి తెలుసు కదా. నాన్న అమ్మ కోసం కాకపోయినా నా దెబ్బకి ఒప్పుకున్నాడు. తెల్లారే ముహూర్తం. కాగల కార్యం చంటిగాడే తీర్చా డనుకుని అమ్మ లోలోపల సంతోషించింది.
అమ్మతో నేను ముత్తుపల్లి వెళ్లాను. మన ప్లాను ప్రకారం రెండు రోజులు కాకుండా మొత్తం పదిహేను రోజులూ ఉంది వచ్చాను.
బడి దేముందీ! అది అక్కడే ఉంటుంది గా. అందుకే అంత ఆలోచించక్కరలేదు.
మరునాడు మురళీబాబు బడిలో దింపొచ్చాడు. వెళ్ళ గానే నాగ రాజు గాడు ఎదురొచ్చి "ఇవాళ సెకండ్ యూనిట్ ఉంది గా! అయ్యగారికి డప్పు చికుం డప్పు చికుం," అన్నాడు. మనమేమన్నా తక్కువ తిన్నామా! ఊహుఁ నో ఛాన్స్. భయ పడలేదు. ఇంకో గంట టైం ఉంది. మన అదృష్టం కొద్దీ శర్మా మాస్టరు ఆ రోజు ఊళ్ళో లేదు. నేను చలరేగి పోవొచ్చు.
వెంటనే సత్తి గాడి దేగ్గరకి పరిగెత్తి తెలుగు నోట్స్ తీసుకుని, (నిజం చెప్పాలంటే లాక్కుని) మొత్తం చూసేశాను. ఇంక పెద్ద సమస్య ఏమీ లేదు. పరీక్షని వ్రాసేశాను. మద్యాహ్నం ఇంగ్లీష్. అదీ అంటే బెమ్బాన్డంగా వ్రాసేశాను. తెల్లారితే లెక్కలు. నేను కొత్తవి ఏమన్నా చెప్పారా అని అడగకుండా ఇంటికి పరిగెత్తాను.
ఇక్కడే ఒక చారిత్రాత్మకమైన సంఘటనకి బీజం పడినది. సాయమ్త్రం మురళీబాబు "రాజా విక్రమార్క" సినిమాకి వెళ్తుంటే నేనూ వెంట పడ్డాను. పరీక్షలని ఆయనకీ చెప్పలేదు. ఇంటికొచ్చి పడుకున్నాను. తెల్లారి నింపాదిగా పేపరు చూసి, స్నానం చేసి అమ్మ శ్రావణ శుక్రవారం పూజ చేస్తుంటే ఆగి ప్రసాదం తీసుకుని లేటుగా బడికి వెళ్ళాను. వెళ్ళంగానే question paper చేతిలో పెట్టారు. అన్నీ మనవే గా అనుకుంటూ రాయటం మొదలెట్టాను. ఇంతలో ఒక ఐదు మార్కుల ప్రశ్న దగ్గర నాకు షాక్. అక్కడ ఒక చిన్న వృత్తాన్ని ఇచ్చి, మధ్యలో ఒక చుక్క పెట్టి, వ్యాసార్ధం కొలిచి చుట్టుకొలత గుణిన్చమన్నారు. నేను లేకుండా ఇంత పని చేశారా! అనుకున్నా! ఒక ప్రక్క చెమటలు పడుతున్నాయి. శర్మా మాస్టరు ఇరవై కి తగ్గితే నా తొడకి చిల్లి పెడుతాడు. అది సరే ఐసు కి ఫస్ట్ రాంక్ ఒస్తే నా పరువేం కాను. అందరూ ఇన్స్పెక్టర్ గారు అని ఎక్కిరిస్తారు.
"హతవిధీ! ఏమి కష్టం ఏమి కష్టం! అసలు దేవుడన్న వాడు లేదా! బడికి ఆఫ్ట్రాల్ పదిహేను రోజులు రాక పోతే ఇంత నష్టమా! ఇలా అయితే పిల్లలు ఎలా బాగుంటారు?" అనుకున్నా. చెమటలు కారి పోతున్నాయి. నాగమల్లీశ్వరి టీచర్ ఇంకో ఐదు నిమిషాలే ఉంది అని చెప్పింది. ఇంతలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుండగా నేను తల విదిలించాను. చెమట చుక్కలు ఎగిరి పడ్డాయి. నా బుర్రలో ఒక ఐడియా పుట్టింది.
"ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది." నిజమో కాదో తెలీదు కానీ బడిలో నా ఇమేజ్ ని మార్చేసింది. వెంటనే ఒక వెంట్రుకని తుంచాను. దాన్ని ఆ వృత్తం మీద పెట్టేను. సున్నా కాగానే అంత వరకూ తుంపి ఆ మిగిలిన ముక్క ని స్కేలు మీద పెట్టి కొలిచి రమా రమీ వేశాను. పోన్లే ఆన్సర్ అన్నా వేశాడు అని ఒక మార్కు వేసినా ఇరవై కి తగ్గవు. సమస్య తీరిందిలే అని సంతోష పడ్డాను.
అనుకున్నట్లే ఒక మార్కు పడింది. పేపర్లు ఇచ్చేటప్పుడు శర్మా మాస్టరు నన్ను పిలిచి, "చూసి వేశావా?" అన్నాడు. "లేదు సార్! చూసి వెయ్యలేదుఅన్నా.
"మరి చెప్పినప్పుడు నువ్వు రాలేదు కదా."
అప్పుడు నేను ఒక వెంట్రుక తీసి మనం చేసిన ఘన కార్యం చెప్పాను. ఆయన పెద్దగా నవ్వి ఇంకో మార్కు కలిపి మొత్తం ఇరవై రెండు చేశాడు.
ఇక్కడతో అయిపోతే ఇందులో స్పెషల్ ఏముంది? ఆయన ఈ విషయాన్ని ఇక్కడి తో వదిలెయ్యలేదు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడు ఆయన ఒక విచిత్రం చేశాడు. ఒక తావు పేపర్లో question paper ఉంటుంది. ముందు ప్రశ్నలు, వెనుక అంటే నాలుగో పేజీలో బిట్లూ ఉంటాయి. మధ్యలో తెల్లగా ఉన్న చోట సమాధానాలు వ్రాయాలి. అచ్చోటనే ఆయన ఒక పెద్ద వృత్తాన్ని, (నా వెంట్రుక లాగలేని సైజులో) ఇచ్చి మధ్యలో చుక్క పెట్టి వ్యాసార్ధం కనుక్కోమన్నారు. అది ఒకమార్కు బిట్టు. ప్రశ్న నాకోసమే అని అర్ధమ అయింది.
మనకీ పంతం వచ్చింది. అల్లంత దూరాన ఐసు కనిపించింది. వెంటనే పిలిచాను. ఏంటి అన్నట్లు చూసింది. నేనొక వెంట్రుకని పట్టుకుని సైగ చేశాను. తను వెంట్రుక ఇచ్చింది. మన స్టైల్ లో పని ముగించాను. అహం పొడుచుకు రాగా త్రేడ్ తో పాటూ ఆ వెంట్రుకని కూడా పేపర్‌కి కట్టి ఇచ్చాను.
ముగింపు : ఈసారి పేపర్లు ఇచ్చేటప్పుడు శర్మా మాస్టారు నా పేపర్ ఇవ్వలేదు. నేను "నా పేపర్ ఇవ్వలేదేంటి సార్!" అన్నా అమాయకంగా. "నీ పేపర్ని మీ నాన్న గారికి ఇచ్చాను. నువ్వు బాగా రాశావు." అన్నాడు.
నాకు అర్ధం కాలేదు. ఆ సాయంత్రం మా ఇంటికి మాస్టారు వచ్చారు. నాన్నతో మాట్లాడుతూ నా పేపర్ని ఇచ్చి, "మాస్టరు గారూ! మీ వాడికి పొగరు బాగా ఎక్కింది. ఇది చూడండి." అంటూ వెంట్రుక తో సహా ఆయన ఆ పేపర్ని నాన్న కి ఇచ్చారు. విషయం మొత్తం చెప్పే సరికి ఇంట్లో అందరూ ఒకటే నవ్వులు. (మురళీబాబు మాత్రం అరగంట క్లాసు పీకాడనుకోండీ).
నాన్న పిలిస్తే ఆయన దగ్గరకి వెళ్ళిన నేను "వెంట్రుక వేస్తె కొండ రాదు కానీ మార్కు మాత్రం వస్తుంది." అన్నాను.
ఈ విషయం స్కూల్లో ఎలా తెలిసిందో తెలిసింది. అప్పటి నుంచీ పన్ను ఊడిన టామ్ సాయెర్ లాగా భలే పాపులర్ అయ్యాను.
P. S. : ఎన్ని అయినా మా శర్మా మాస్టరు క్లాసు లంటే భలే ఇష్టం. లెక్కలంటే ఆయనే చెప్పాలి. ఇంగ్లీష్ లెసన్ అంటే ఆయనే. భలే చెప్తాడులే.
ఆ రోజులన్నీ నాకు బాగా గుర్తు. అందుకే ఆ సంగతులన్నీ బ్లాగులుగా వ్ర్యాలని ఉంది.
సత్యమేవ జయతే!
August 4, 2008 at 3:35 PM
బాగుంది. ఇంకా ఏయే గణిత సూత్రాలను కనిపెట్టారో మాకు చెప్పండి.
August 5, 2008 at 1:22 AM
మీ పై వేల్యూ బాగానే ఉంది కానీ, టామ్ సాయెర్ పన్ను తో భలే లింక్ పెట్టారు. స్కూల్ వాటిలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గుడ్ బ్లాగ్.
కొత్త ఫీలింగ్ కలిగింది. మీ రేగ్యులారిటి కి జోహార్లు. వెంట్రుకతో కొండని లాగేటట్టున్నారు మీరు.
August 5, 2008 at 8:29 AM
హహహ.. వెంట్రుకే కదా అని "లైట్" తీసుకోగలరా ఎవరైనా?? ఆ?? ;-)
పెద్దవాళ్ళేదో అలా ముద్దుగా "పొగరు" అంటారు కానీ మనం దాన్ని.. స్మార్టూ అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే పార్లీ జీలో జీ ఫర్ జీనియస్ మీరే!! నిఝం!!
August 6, 2008 at 1:36 AM
చాలా క్రియేటివ్ గా ఉంది మీ పద్ధతి. ఆ అమ్మాయికి నిజం గా అంత పెద్ద పెద్ద వెంట్రుకలు ఉన్నాయా?
అయితే కంగ్రాట్స్.
"మన సంగతి తెలుసు కదా. నాన్న అమ్మ కోసం కాకపోయినా నా దెబ్బకి ఒప్పుకున్నాడు."
భలే ఉంది.
"బడి దేముందీ! అది అక్కడే ఉంటుంది గా. అందుకే అంత ఆలోచించక్కరలేదు."
మీరు నిజంగా......
"హతవిధీ! ఏమి కష్టం ఏమి కష్టం! అసలు దేవుడన్న వాడు లేదా! బడికి ఆఫ్ట్రాల్ పదిహేను రోజులు రాక పోతే ఇంత నష్టమా! ఇలా అయితే పిల్లలు ఎలా బాగుంటారు?"
"(నా వెంట్రుక లాగలేని సైజులో)"
"వెంట్రుక వేస్తె కొండ రాదు కానీ మార్కు మాత్రం వస్తుంది."
"పన్ను ఊడిన టామ్ సాయెర్ లాగా భలే పాపులర్ అయ్యాను."
ఈ లైనులన్నీ మళ్ళీ మళ్ళీ చదివించాయి. ప్రియ గారన్నట్లు స్కూల్ వాటిలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కొత్తగా ఉంది.
August 6, 2008 at 5:49 AM
హ హ చాలా బాగుంది గీతాచార్య గారు...అదరహొ... కొత్త కొత్త గణిత సూత్రాలు ఇంకా ఏమేం కనిపెట్టారో శలవిచ్చేయండీ.
August 18, 2008 at 8:24 AM
అంతటి ఆలోచన ఉంటే ఆహాహా! మంచి బ్లాగు. కానీ చదివించేలా లేదు. జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ఏదయితేనేం, చిన్నప్పటి సరదా కబుర్లలో మీది నిజం గా ఒక భిన్నమైన అనుభవం.
Post a Comment