ఎడారిలో నేనొంటరినైతే...
వర్షం నన్ను కౌగిలించుకుంది.
కష్టాల కడలిలో నేనీదుతుంటే...
చిరునవ్వొకటి నన్ను పలకరించింది.
సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...
కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది.
బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...
దైవం నన్ను విముక్తుడిని చేసింది.
భయం నన్ను నీలా చేస్తే...
నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది.
నిరాశ నన్ను మరణించమంటే...
ఆశ నన్ను జీవించమంది.
పగ నన్ను రాక్షసుడిని చేస్తే...
ప్రేమ నున్ను దైవంలా మార్చింది.
ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...
నేనే అందరినీ నాలా చేస్తా...
అందరిలో దైవాన్ని చూస్తా.
Note: వర్షం నన్ను కౌగిలించుకుంది, అనే మాట ఈమధ్య సాక్షిలో ఎం డి యాకూబ్ పాషా గారు వ్రాసిన ఆర్టికల్ లో నన్ను ఆకర్షిచింది. ఆలోచిస్తుంటే ఈ వాక్యాలు తట్టాయి.
సత్యమేవ జయతే!
July 11, 2008 at 3:51 AM
మంచి భావాలు రాశారు. కవిత బాగుంది. "సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...
కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది." ఈ మాటలు బాగున్నాయి. Excellent composition.
July 11, 2008 at 5:21 AM
చాలా చాలా అద్భుతమైన పద్యం.
వర్షం కౌగిలించుకోవటం, చిరునవ్వు పలకరించటం ఎంత అందమైన ఊహలండీ.
చివరన ముగింపు కూడా ఒక విశ్వజనీన భావంతో ముగించారు. నైస్.
బొల్లోజు బాబా
July 11, 2008 at 11:40 AM
వర్షం కౌగిలించుకోవటం.. fantastic!!
July 14, 2008 at 1:08 AM
"భయం నన్ను నీలా చేస్తే...
నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది."
ఏమీ చెప్పలేను.మాటలు రావటం లేదు చెప్పటానికి.
Exceptional. ప్రతిలైనూ బాగుంది. :-)
August 16, 2008 at 11:47 PM
వర్షం కౌగిలించుకోవటం చాలా అందమైన భావన. అందుకు మీ అభినందనలు. ఈ మాటకు మీరు రెఫెరెన్సు ఇచ్చి "సత్యమేవ జయతే" అన్నా మీ లక్ష్యాన్ని నిరూపించుకున్నారు. నేనా ఆర్టికిల్ ని చూశాను. అందులో వాడిన దానికన్నా మీరు వైన సందర్భం హృద్యంగా ఉంది. Hats-Off.
ఒక లైనని కాదు ప్రతి వాక్యం ఆణిముత్యమె.
September 1, 2008 at 1:11 AM
Gr8. That's all I can say.
Post a Comment