ఈ ప్రపంచంలో రెండు విషయాలే సత్యం. ఒకటి గెలవటం. రెండు ఓడిపోవటం. అంతే. మిగతా అంతా మాయే. ఎందుకంటే విజేతలని అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. పరాజితులని అందరూ మర్చి పోతారు. అందుకే విజయం శాశ్వతం. విజేతే అమరత్వానికి అర్హుడు. (ఇక్కడ మన హిందూ సిద్ధాంతంలో అమరత్వం గురించికాడు).
నాకు తెలిసి టెన్నిస్ ని నేను పదహారు సంవత్సరాలుగా చూస్తున్నాను.ఈ కాలం లో జరిగిన దాదాపూ అన్ని మ్యాచులనీ (గ్రాండ్ స్లాంస్ ని) చూసాను లేదా వివరాలని ఫాలో అయ్యాను. ఇంత కాలంలో నేను గమనించినది అదే.
1998 వింబుల్డన్‌లో రన్నెర్-అప్ ఎవరో చెప్పండి. 1994 ఆస్త్రేలియన్ ఓపెన్ లో సాంప్రాస్ చేతిలో ఒడి పాయినది ఎవరో టక్కున చెప్పండి. లేదు మీకు గుర్తు రాదు. మరి ఏడు సార్లు వింబుల్డన్ ని గెలిచినది ఎవరు? గత ఐదు సార్లుగా వింబుల్డన్ ని పురుషులలో గెలిచిన దెవరు? నాలుగేళ్ల గా ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు? హ హ హ ఎవరైనా చెప్పేస్తారు. ఆటతో పరిచయం లేని వాళ్లు కూడా. ఎందుకంటే ఈ పదిహేను రోజుల నుంచీ పేపర్లలో అందరూ చదువుతున్నదేగా.
ఇది నేను టెన్నిస్ గురించి రాస్తున్న బ్లాగు. It's based on my memory. My emotions, My hero(in)s, my villains, True Champions, The winning stories, How Tennis influenced the course of my life, and the effect of Tennis on my Family in a positive way.
ఇందులో మీరు ఒక పిల్లవాడి ఆలోచనలు చూడ వచ్చు. ఒక టీనేజర్ ఆలోచనలూ, ఎమోషన్లు, విశ్లేషణలూ చదవ వచ్చు. ఆతతో మమేకమైన ఒక యువకడి గురించి తెలుసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే It's about the history of Tennis in the last decade and a half. A ballet of emotions, odes to True Champions, and ఇంకంతే. మీరే చూడండి.
వింబుల్డన్ అంటే ఒక విజేత. ఒక గెలుపు. ఒక కల. ఒక జీవిత పాఠం. అందుకే ముందు ఈ క్రింది వాక్యాలు చదవండి.
During his battle with AIDS, one of his fans asked, "Why does God have to select you for such a bad disease?" Ashe replied, "The world over — 50,000,000 children start playing tennis, 5,000,000 learn to play tennis, 500,000 learn professional tennis, 50,000 come to the circuit, 5,000 reach the Grand Slam, 50 reach Wimbledon, 4 to the semifinals, 2 to the finals. When I was holding a cup, I never asked God 'Why me?' And today in pain I should not be asking God, 'Why me?"
అద్భుతమైన మాటలు కదూ. బంగారాన్ని మాటల రూపంలో తెస్తే ఇలాగే ఉంటుందేమో! ప్రతి చిన్న విషయానికీ దేవుడిని తిట్టుకుంటూ, కష్టం వచ్చిన ప్రతిసారీ ఇంకొకళ్ళని బాధ్యులని చేసే ప్రతి ఒక్కరూ ఆగి విని పాటించాల్సిన మాటలు. ఈ మాటలే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తిని రక్షించటం నేను చూశాను. ఆశావహ దృక్పథం వైపు మల్లించటం నాకు తెలుసు.
ఆర్థర్ ఆషే, 1975 వింబుల్డన్ విజేత. విజేత చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుంది. ఇది హనుమాన్ జంక్షన్ సామెత. (సినిమా లోది).
"Start where you are. Use what you have. Do what you can. Then only you are you. Or you are not you Then there will be nothing to be glorified about you because, your story can be told, but the name won't be yours." ఆర్థర్ ఆషే మాటలివి. వింబుల్డన్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఆయనని స్మరించుకుందాం.
Now, getting started.
ఇది చాలా చిరస్మరణీయమైన టోర్నీ. మారత్ సఫిన్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ సమకాలీన టెన్నిస్ లో అద్భుతమైన ఆటగాళ్ళు. అందరూ సెమీ ఫైనల్ కి చేరారు. మహిళలలో విలియమ్స్ సిస్టర్స్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ గెలిచి "Class is permanent, form is temporary." అని నిరూపించారు.
జెంగ్ జీ తన ఆటతీరు తో అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా సానియా మీర్జా పొరపాటున కూడా విలియమ్స్ మీద గెలవలేనని నిరూపించుకుంది. ఇంకో విషయం, "మీరజాల గలదా మన సానియ విమ్బుల్డను నందు రెండో రౌండు." అనిపించుకుంది. ఫెదరర్ లేదా నాదల్ లలో ఎవరు గెలిచినా అది రికార్డే కావటం మరో ముఖ్యాంశం. సఫిన్ వస్తే ఇంకా బాగుండేది. బట్ అత్యుత్తమ ఆటగాళ్లే ఫైనల్ లోకి వచ్చారు.
వింబుల్డన్ సామెత: "ప్రతి ఇవానీసెవిచ్ కీ ఒక వింబుల్డన్ వస్తుంది."
అతను భలే ఆటగాడండీ. అతని నుంచీ మనం సిన్సియర్‌గా కష్ట పడితే ఎప్పటికైనా విజయం వరిస్తుందని నేర్చుకున్నాన్నేను.
ఇకనేం? వింబుల్డన్ విలేజిలో విహరిద్దాం.
ఇప్పటికి సెలవ్. గురువారం నాడు వింబుల్డన్ విలేజిలో మనకి పార్టీ.
Note: All the stories are based on my memory.
మన పంథా: ధైర్యమే ఆయుధం.
July 6, 2008 at 9:48 AM
I was dying to see a blog exclusive on sports. There is so much in this telugu bloggers world, but I'm restless that the sports aren't a vigorous part.
ఏదో ఒకటి చేసి నేనే ఇక ఆటల గురించి బ్లాగాలి అని నిశ్చయించుకుంటున్న వేళ మీరు తారసపడ్డారు. ఇది చాలా మంచి కాంసెప్ట్. మీ ద్వారా మళ్ళీ కొత్తగా టెన్నిస్ అలవాటు పడుతుంది అందరికీ!!
రెగుల్యర్ గా "టపా"యిస్తారు అని ఆశిస్తూ,
పూర్ణిమ
July 6, 2008 at 7:12 PM
బాగుంది. చాలా విషయాలతొ పాటూ అమూల్యమైన కొటేషన్స్ కొన్నింటిని పంచారు.
July 11, 2008 at 3:23 AM
చాలా చక్కగా రాసారు. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది. వింబుల్డన్ అంటే ఒక విజేత. ఒక గెలుపు. ఒక కల. ఒక జీవిత పాఠం. "వింబుల్డన్ అంటే ఒక విజేత. ఒక గెలుపు. ఒక కల. ఒక జీవిత పాఠం. " మనసుతో రాసినట్టున్నారు.
వింబుల్డన్ సామెత: "ప్రతి ఇవానీసెవిచ్ కీ ఒక వింబుల్డన్ వస్తుంది."
వింబుల్డన్ సామెత కాన్సెప్ట్ బాగుంది. మీ నుంచీ మంచి బ్లాగుని ఆశిస్తున్నాను.
ఆషే గురించి మీరు చెప్పిన మాటలు "ఆర్థర్ ఆషే, 1975 వింబుల్డన్ విజేత. విజేత చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుంది." గొప్పగా ఉన్నాయ్.
ఆరంభం అదిరింది. మరి గురువారం దాటినా బ్లాగేది?
July 11, 2008 at 4:10 AM
ప్రియ గారు చెప్పినట్లు మీరు మనసు తో రాశినట్టున్నారు.
'మరీ ముఖ్యంగా సానియా మీర్జా పొరపాటున కూడా విలియమ్స్ మీద గెలవలేనని నిరూపించుకుంది. ఇంకో విషయం, "మీరజాల గలదా మన సానియ విమ్బుల్డను నందు రెండో రౌండు." అనిపించుకుంది.' నిజమే ననిపిస్తున్నది. ఎందుకంటే తన తో పాటే వచ్చిన వారంతా టెన్నిస్ ఆడుకుంటుంటే తను వివాదాలతోనే ఆడుకుంటున్నది.
ఆశే గురించి చెప్పటం నచ్చింది. మంచి బ్లాగుని ఆశిస్తూ.....
సెలవ్.
July 15, 2008 at 5:27 AM
ఆట గురించి(నియమాలు వగైరా)కూడా వివరిస్తే చాలా మందికి ఆసక్తి కలిగించిన వారవుతారు
August 18, 2008 at 9:36 AM
అద్భుతమైన ప్రారంభం. మీరు కొన్ని చోట్ల అద్భుతంగా మరి కొన్ని చోట్ల సాదా సీదాగా రాస్తారని మీ బ్లాగుల్లోనే ఎక్కడో కామెంటాను. ఇక్కడ మాత్రం మీరు తారాస్థాయిలో రాస్తున్నారు. ఎంత ప్రేమ టెన్నిస్ అంటే!
Aurthur Aushe గురించి చెప్పటం చాలా బాగా ఉంది.
"It's based on my memory. My emotions, My hero(in)s, my villains, True Champions, The winning stories," మీ హృదయాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇంత మంచి బ్లాగుని ఎందుకు కొనసాగించటం లేదు?
"A ballet of emotions, odes to True Champions,"
"వింబుల్డన్ అంటే ఒక విజేత. ఒక గెలుపు. ఒక కల. ఒక జీవిత పాఠం"
హాస్యం, ప్రేమ (మీకు ఆటల మీదున్న), కర్తవ్యమ్, ఏమని చెప్పాలి? మాటలు ఆగి పోయాయి. అద్భుతమైన బ్లాగ్. Please start again. Start again.
"ధైర్యమే ఆయుధం."
ఇది నిజం.
Thaaaaanksssssssss.
Post a Comment