ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

అమ్మ

'అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా' అని అందరూ అంటుంటారు. నిజమే! మనం పుట్టిన అప్పటినుంచీ మనకు అన్నీ చేసేది అమ్మే. మరి అలాంటి అమ్మ గురించి నేను రాద్దాము అనుకుంటున్నాను. అన్నిటికీ మనకి అండగా నిలుస్తుంది అమ్మ. అయితే అన్నీ మంచి సంగతులే కాదు కొన్ని నిజాలూ ఉన్నాయి. మరి నా మాటలు ఆలకిస్తారా?

'దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని పంపిస్తాడు' అని అంటుంటారు. నిజమే! కదిలే దేవత అమ్మ అని ఒక సినీ కవి అన్నాడు. బాగానే ఉంది. ఒకసారి నేను మీకు చెప్పే case వినండి. ఇదికూడా నిజమే అనుకుంటారు.
నవ మాసాలు మోసి కని పెంచినది అమ్మే. ఇది సత్యం.
మనం ఏదయినా ఒక వస్తువుని చాలా ఖర్చు చేసి కొనుక్కుంటాం. దాన్ని ఎలా చూసుకుంటాం? అపురూపంగా. అదే ఏదయినా ఒక చిత్రాన్ని ఒక చిత్రకారుడు కొన్ని నెలల పాటూ నిద్రలేని రాత్రులు గడిపి చిత్రిస్తాడు. మరి దాన్ని ఆటను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు? ఒక క్రీడాకారుడు ఎంతో కష్ట పడి ఒక విజయం సాధిస్తాడు. అది అతనికి ఎలాంటి అనుభూతిని ఇంస్తుంది?
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర సమరయోదులకి ఎంతటి ఆనందం కలుగుతుంది?
ఎంతో కష్ట పడి సాధించిన వాటిని మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో నవమాసాలూ మోసి కన్న బిడ్డను తల్లి కూడా అంటే అపురూపంగా చూసుకుంటుంది. మరి అక్కడ అమ్మ గొప్పతనము ఏమి ఉంది? కష్ట పడి సంపాదించిన ఆస్తిని ఎలా కాపాడుకుంటారో ఇదీ అంతే కదా?
అందుకే అమ్మ అందరూ అనుకునేటంత గొప్పది కాదు.
తన బిడ్డని అదే తను మరణం లాంటి పురుటి నెప్పులని భరించి సంపాదించిన ఆస్తిని తను గొప్పగా చూసుకుంటే అందులో గొప్ప ఏమి ఉన్నది? నా మాటలు విడ్డూరంగా ఉన్నాయా?

ఈ సందేహం నాకు చిన్నతనంలోనే వచింది. ఎందుకు అమ్మ తన పిల్లలనే అపురూపంగా చూసుకుంటుంది? తన పిల్లల మీదే పక్షపాతం చూపుతుంది?
నా సందేహానికి కారణం ఇది.
ఒకసారి మా అమ్మమ్మ మా ఇంటికి వచింది. ఆరోజు మా అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. అందుకోసం మా అమ్మమ్మ ఎన్నో మొక్కులు మొక్కుకుంది. ఎంతో హడావుడి చేసింది. నాలుగు రోజుల తరువాత మా పిన్నికి ఒంట్లో బాగోక ఆరోజు పడుకుంది. మా అమ్మకి ఇంకా నీరసం తగ్గలేదు.మా అమ్మకి ఇంకా నీరసం తగ్గలేదు. తను ఒక్కర్తే ఆరోజు వంట పనులు చూసుకుంటోంది. ఇంతలో వాళ్ల చెల్లెలిగారి ఇంటినుంచీ వచ్చిన అమ్మమ్మ అమ్మకి సాయం చెయ్యటానికి వంటింట్లోకి వెళ్ళింది. నేనూ అక్కడే కూర్చుని ఉన్నాను. మాటల్లో అమ్మమ్మ మా పిన్నిని చూపిస్తూ, "అది దొంగనాటకాలు ఆడుతున్నది. జ్వరం లేదు పాడు లేదు. పని తప్పించుకోవడానికి పడుకుంది," అంది. అప్పుడు నేను అమ్మతో "అమ్మమ్మ అలా మాట్లాడుతున్నదేంటి?" అన్నాను. నా మాటలని అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఆరోజు అంతగా పట్టించుకోలేదు. నా సందేహం మాత్రం మాత్రం అలాగే ఉండిపోయింది. అమ్మమ్మ ఈ ఒక్కసారే కాదు. చాలాసార్లు తన పిల్లలని మాత్రమె మనుషులు అనుకున్నట్లుగా మాట్లాడటం చూసాను. తన చెల్లెళ్ళ పిల్లలిని కానే వేరే వాళ్ల పిల్లలిని కానీ అసలు లెక్క చేయదు. అందరూ తన పిల్లల లాంటి వారే కదా? మరి ఈ తెదాలేంటి?
సినిమాల్లో సవతి తల్లులు తమ పిల్లలని బాగా చూసుకున్టం, సవతి పిల్లలని తక్కువ గా చుసుకున్టం మనం చూస్తూనే ఉంటాం.
ఎందుకీ తేడా? అమ్మ అంతే నిజంగానే గొప్పది. కానీ వేరే వల్ల పిల్లలని తన పిల్లలలాగా కాక పోయినా కనీసం మనుషులుగా చూడవచ్చు. అందరూ అలాంటి వల్లే ఉండరు కానీ, ఈ తేడాలు లేకుండా అందరిని ప్రేమగా చూసుకునే ప్రతి స్త్రీ నిజంగా దేవత. తను గొడ్రాలు అయినా సరే.
అందుకే అమ్మలకి నా విజ్ఞప్తి. పిల్లలు అందరూ ఒకటే. ఈ భావనని కలిగి ఉండండి. పసిమనసులని బాధపెట్టేకండి. ఈ మాటలు అందరు పిల్లలనీ మాలాగే ప్రేమగా చూసుకునే మా అమ్మకి అంకితం. నేను చెప్పింది తప్పయితే నాకు మాత్రమే అంకితం.
సత్యమేవ జయతే.
10 comments:

అమ్మ అంటూ అమ్మమ్మ గురించి రాసి మెలిక పెట్టేరు మీరు. పాయింట్ బాగుంది ఆలోచించాసిందే.
అలాంటివి నేనూ చూశాను.

"మనం ఏదయినా ఒక వస్తువుని చాలా ఖర్చు చేసి కొనుక్కుంటాం. దాన్ని ఎలా చూసుకుంటాం? అపురూపంగా. అదే ఏదయినా ఒక చిత్రాన్ని ఒక చిత్రకారుడు కొన్ని నెలల పాటూ నిద్రలేని రాత్రులు గడిపి చిత్రిస్తాడు. మరి దాన్ని ఆటను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు? ఒక క్రీడాకారుడు ఎంతో కష్ట పడి ఒక విజయం సాధిస్తాడు. అది అతనికి ఎలాంటి అనుభూతిని ఇంస్తుంది?
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర సమరయోదులకి ఎంతటి ఆనందం కలుగుతుంది?
ఎంతో కష్ట పడి సాధించిన వాటిని మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో నవమాసాలూ మోసి కన్న బిడ్డను తల్లి కూడా అంటే అపురూపంగా చూసుకుంటుంది. మరి అక్కడ అమ్మ గొప్పతనము ఏమి ఉంది?"

పై దాన్లో మరీ ఘాటు ఎక్కువ అయింది. నిజం నిష్టూరంగానే ఉంటుంది అని అనుకుంటే మీరు సరిగ్గానే రాసినట్లు.


చాలా సున్నితమైన విషయం మీద కొన్ని నిజాల్ని చెప్పారు.

కాకపోతే మీరు చెప్పిన స్థాయి విశ్వజనీయమైన ప్రేమది, కానీ అమ్మ ప్రేమకు అంత విశాలత లేదన్నది నిజం.

అమ్మ పేర చేసే సెలెబ్రేషన్లన్నీ పిల్లలు వాళ్ళమ్మకు చేసేవేగానీ ఇంకొకరు,ఇంకొకరి అమ్మకు చేసేవి కాదు.


మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ అమ్మ ప్రేమ అన్నది తన పిల్లల మీద అమ్మ ప్రేమే.

కానీ నిజమైన అమ్మ ఏ పిల్లల్నైనా తన పిల్లల్లా ప్రేమించ గలగాలి.

--ప్రసాద్
http://blog.charasala.com


కంచెం ముందు రాసివుంటే సంకలనంలొ పెట్టేవాణ్ణి.
మళ్ళీ ఎప్పుడైనా సవరణలు చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను


as there is always a second side for every coin, there is always a -ve side for every +ve side.

Yes, it is true that there are mothers that are not as true as others. It doesn't mean that most of the mother are like that.

i dont recollect that either Lenin or Marx mentioned that, "Every human relation is Selfish". It is true from their angle as well as you described. But at the same time, it is not true. if you ask a lady who is labouring for hrs to choose between the lifes of her and her baby .. the surprising answer would be .. her baby .. not she ...

This would just tell the greatness of mom.

Finally, yes, there are moms of dishonor.

a) Moms that do extra-marital affirs ..
b) moms that ditch their own husbands and sleep with other partners..
c) moms who leave their babys on road and disappear .. leaving the babys as orphans..
d) many .. many ..

but when we aggrigate .. we get atleast 51% of good moms when compared to bad moms.. so as the percentage is greater for good moms.. the respect goes to them...

These are my 2 cents of comments.. excuse me if i miss spell any


ఒక తల్లి తన పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలనేదేమీ లేదనేది ఒక సత్యం.
అలాగని తన ప్రేమలో కల్మషముందని తీర్మానించేయలేం.

సాహితీ యానం


తల్లి ప్రేమలో కల్మషం ఉందని అనటం అసలు సిసలైన మూర్ఖత్వం. కానీ... నేను కొన్న కేసెస్ ని ప్రెసెంట్ చేయాలని అనుకుంటున్నాను. నాట్ ఆల్ ఆర్ పాజిటివ్. కానీ అది అమ్మని అగౌరవ పరచటం కాదు. ఎందుకంటే మా అమ్మ చాలా మంచిది. అందరు బిడ్డలూ అలాగే అంటారు కదా అంటే, నేను తన గురించి చెప్పగలను. అప్పుడు అందరికీ తెలుస్తుంది.

అందరూ తన బిడ్డల లాతివారే అనుకునే అమ్మలందరూ గ్రేట్. తన బిడ్డలని ప్రేమించి, మిగతా బిడ్డలని ఆదరించ వచ్చు కదా.


జాన్‌హైడ్ కనుమూరి గారికి, నా టపాని సంకలనం లోకి తీసుకుంటే అది మరింతమందికి చేరుతుంది. గుర్తు పెట్టుకున్తాన్నందుకు థాంక్స్.

చక్రవర్తి గారి వ్యాఖ్యలకి ,
" if you ask a lady who is labouring for hrs to choose between the lifes of her and her baby .. the surprising answer would be .. her baby .. not she ..." That is always true. I'm not saying that mothers are not good. what I was, am about to say is that, there are such cases like the ones I wrote. One has to slowly realize in order for a better society, because Amma is the best architect for any society.

ఈ మధ్య పరిస్థితులు మారి పోతున్నాయి. 51 pc మాత్రమేనా manaki 100pc కాక పోయినా కనీసం 80 pc ఉండొద్దా? లేక పోతే మన ప్రజాస్వామ్యం లాగా కుటుంబపు విలువలు పడిపోతాయి.

మీరు చాలా వివరంగా రాశారు. మీరు చెప్పిన విషయాల వల్ల నేను ఇంకా రాయాలని తెలుసుకున్నాను. :-). నమోవాకాలు.


ఒక పక్క మీ అమ్మ గారిని చూస్తూనే, వేరే అమ్మలను తేడాలు చూపిస్తారనో, లేదా మరోటనో judge చేస్తున్నారే!
ఒక విషయం చెప్తాను! చాలా మంది మగ రచయితలు, చిత్రకారులు ఒక బొమ్మ గీయడం గురించో, ఒక భావాన్ని అందంగా ప్రెజెంట్ చేయడం గురించో పడ్డ కష్టాన్ని చెపుతూ ఆ pain ని పురిటి నొప్పులతో పోలుస్తుంటారు. నిజంగా పురిటి నొప్పులెలా ఉంటాయో తెలిస్తే వాటి దరిదాపుల్లోకి కూడా రారు. ఒక వస్తువును కొని జాగ్రత్తగా చూసుకోడానికి తల్లి బిడ్డను కని పెంచడానికీ తేడా లేదంటున్నారంటే ...హాట్సాఫ్!

'నవమాసాలు మోసి '... తేలిగ్గా వాడేసే మరో మాట! నవ మాసాలూ మోయడం అంటే వూరికే baak paak మోసినంత సులభం కాదు. ఏ క్షణాన చచ్చిపోతామో తెలియని రిస్కు బిడ్డని కనే దాకా ఉంటుంది..తెలుసుకోండి!

అమ్మ కూడా మనిషే! ఆవిడకీ విసుగూ, కోపతాపాలు, భావావేశాలూ ఉంటాయి. ఆవిడేం స్వర్గం నుంచి ఊడిపడిందా!ఒక్కో సమయంలో ఇద్దరు బిడ్డల మధ్య తేడా చూపించొచ్చు, ఈ(నాకు తెలిసి ప్రపంచంలో ఏ తల్లీ పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డల మధ్య తేడా చూపించదు) .అంత మాత్రాన, ఆవిడ ప్రేమలో రంధ్రాలు వెదకడమా! 'అందరూ పిల్లలనీ సమానంగా చూసుకో ' అని నీతులు బోధించే స్థాయికి మనం ఎప్పుడూ ఎదగం! మనమెంత పెద్దైనా అమ్మ ముందు చిన్నే!


What you said in your post is true. But it is not an universal fact.

I see no need in condemning your views. They have to be embraced with open mind.

You said, "Amma is the best architect for any society." Good thing.


Post a Comment

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి