ఏక్ నిరంజన్!
Decently Indecent ;-)

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరె, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడూ...ఎహె (వంటరి నైతే కాదు) :-)

కృష్ణస్వామి అల్లాడి ఆటోగ్రాఫ్.

9:53 PM

ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇది. కృష్ణస్వామి అల్లాడి ప్రముఖ నెంబర్ తియరిస్ట్. University of Florida లో Professor and Chair, Department of Mathematics. ఈయన ప్రతి సంవత్సరం SASTRA University కుమ్బకోణంలో నిర్వహించే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి వస్తుంటారు. చాలా influential person. నేను గత రెండు సంవత్సరములుగా ఆ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతున్నాను. అక్కడ నేను శ్రీనివాస రామానుజన్ మీద నేను రాస్తున్న ఆర్టికల్ ని చూపినపుడు ఆయన చాలా impress అయ్యారు.
మార్చిలో అమెరికాలో జరిగన కాన్ఫరెన్స్కి మా కజిన్ వెళ్ళినప్పుడు నేను ఈ షీటు పంపిస్తే ఆయన ఆటోగ్రాఫ్ చేసి పంపారు.
దాన్నే నేను ఈ బ్లాగులో పెడుతున్నాను.
సత్యమేవ జయతే.
Read On 1 comments

వయ్యంటే బిడ్డే

10:41 PM
ఈ రోజు న్యూస్ పేపర్ చూసి నేను షాక్ తిన్నాను. ఇంతలో నాకు ఎవరో పెద్దగా నవ్వటం వినిపించింది. ఆ షాకులో నాకు అది నిజమైన నవ్వో లేక నా చిత్తభ్రాంతో అర్థం కాలేదు.
కాలం సాగిపోయింది. అది నాకు గాలిలో తెలుస్తోంది. నీటిలో తెలుస్తోంది. అలా అయిదువందల సెకనులు గడిచిపోయాయి. THE LORD OF THE RINGS: THE FELLOWSHIP OF THE RING సినిమాలో VOICE OF THE RING తెలుగు డబ్బింగ్ లాగా ఉందా! ఇంతలో మావారు రావటంతో నేను ఈ లోకంలోకి వచ్చాను.
మా ఇంట్లో పనిమనిషిగా చేసిన సుబ్బి హత్య చేసింది. తన మొగుడిని. ఆ న్యూసే నన్ను షాకుకి గురి చేసింది. సెలయిను బాటిల్తో పొడిచి భర్తను చంపిన భార్య. అదే నేను చుసిన హెడ్డింగు.
"భలే కామెడీ కదూ!" మా ఆయన నా ముక్కు పట్టుకుంటూ అడిగారు. నేను ఆయన చేతిని నేట్టేస్తూ కుర్చీలోకూలబడ్డాను.
*** *** ***
నాలుగు రోజుల తర్వాత నేను సుబ్బిని కలిసాను. అప్పుడు జరిగన సంభాషణ ఇదీ.
నన్ను చూడగానే ఆత్మీయంగా నవ్వింది.
"ఏమి జరిగింది?" నేను అడిగాను.
"ఎప్పుడో జరగాల్సింది అమ్మగారూ. ఇప్పుడు జరిగింది." తను అన్నది.
తర్వాత జరిగిందంతా నాకు చెప్పింది.
*** *** ***
సుబ్బి కోన సీమ నుంచీ వచ్చింది. మా ఉద్యోగం నిమిత్తం మేము గుంటూరు వచ్చాము. మా పనిమనిషి గా తననే పెట్టుకున్నాము. చక చక పనులు చేస్తూ మా అభిమానాన్ని పొందింది. ఏడాది క్రితం పెళ్లి అయిన మేము ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో మా అత్తగారికి సహాయంగా ఉండటానికి పనిలో పెట్టుకున్నాము. మా అత్తగారు మంచి మాటకారి. అవతలవారిని తేలికగా ఆకట్టుకుంటుంది. సుబ్బి మా అత్తగారితో మాటల సందర్భంలో తన సంసారం గురించి చెపుతూ తనకి ఇద్దరూ ఆడపిల్లలే అనీ, తనను ఆడపిల్లలను కన్నందుకు తన భర్త ఎన్ని రకాలుగా హింసిస్తాడో చెప్పుకునేది. రోజూ రాత్రి భోజనాల సమయంలో ఆవిడ ఈ విషయాలని మాతో చెప్పేది.
*** *** ***
సాయంకాలాల్లో మేము ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటాము. ఒక రోజు మా ఆయన Human Reproduction గురించి పిల్లలకి చెపుతూ x x chromosomes కలిస్తే ఆడపిల్లలు, x y chromosomes కలిస్తే మగ పిల్లలూ పుడుతారని చెపుతుంటే సుబ్బి ఆయన దగ్గరకు వెళ్ళింది. సుబ్బి ఆయనను ఏదో విషయం అడగటం ఆయన ఏదో చెప్పటం నేను వంట ఇంట్లో నుంచీ గమనించాను.
*** *** ***
కొన్నాళ్ళకు సుబ్బి మళ్ళీ గర్భవతి అయింది. మావారికి విజయవాడలో ఒక కాలేజిలో ఎక్కువ జీతంతో ఉద్యోగం రావటంతో మేము షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ సుబ్బికి భర్త వేధింపుకు ఎక్కువ అయ్యాయి. మా అత్తగారికీ తన గురించి దిగులు ఎక్కువ అయింది. నెలలు నిండటంతో సుబ్బి ఆసుపత్రిలో చేరింది. కానుపుకి రెండు గంటల ముందు తాగి వచ్చిన సుబ్బి మొగుడు ఈసారి మగ పిల్లాడు పుట్టకపోతే నరికేస్తానని అల్టిమేటం ఇచ్చాడు. సుబ్బి బిక్క చచ్చిపోయింది.
*** *** ***
సుబ్బి ఖర్మో ఏమో గానీ ఈసారీ ఆడపిల్ల పుట్టింది. ఇంతలో దాని మొగుడు గదిలోకి వచ్చాడు.
అయితే "రేయ్ నా కొడకా y క్రోమోజోము ని పంపకుండా x క్రోమోజోము ని పంపుతావుట్రా!" అంటూ సుబ్బి పక్కనే ఉన్న సెలయిను బాటిల్ ని పగల కొట్టి దాంతో తననికొట్టటానికి వస్తున్న మొగుడిని పొడిచింది.
*** *** ***
నేను ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. మా ఆయన పెద్దగా నవ్వాడు.
"ఇలాంటి వాడికి తగిన శిక్ష పడింది." మా అత్తగారు అంది. ఆడపిల్లే తనకు మొదటి కానుపులో కావాలనే మా ఆయనతో నేను "x క్రోమోసోముని పంపకపోతే చంపేస్తాను," అన్నా. ఈసారి పెద్దగా నవ్వింది మా అత్తగారు.
Read On 13 comments

అమ్మ

4:29 AM
'అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా' అని అందరూ అంటుంటారు. నిజమే! మనం పుట్టిన అప్పటినుంచీ మనకు అన్నీ చేసేది అమ్మే. మరి అలాంటి అమ్మ గురించి నేను రాద్దాము అనుకుంటున్నాను. అన్నిటికీ మనకి అండగా నిలుస్తుంది అమ్మ. అయితే అన్నీ మంచి సంగతులే కాదు కొన్ని నిజాలూ ఉన్నాయి. మరి నా మాటలు ఆలకిస్తారా?

'దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని పంపిస్తాడు' అని అంటుంటారు. నిజమే! కదిలే దేవత అమ్మ అని ఒక సినీ కవి అన్నాడు. బాగానే ఉంది. ఒకసారి నేను మీకు చెప్పే case వినండి. ఇదికూడా నిజమే అనుకుంటారు.
నవ మాసాలు మోసి కని పెంచినది అమ్మే. ఇది సత్యం.
మనం ఏదయినా ఒక వస్తువుని చాలా ఖర్చు చేసి కొనుక్కుంటాం. దాన్ని ఎలా చూసుకుంటాం? అపురూపంగా. అదే ఏదయినా ఒక చిత్రాన్ని ఒక చిత్రకారుడు కొన్ని నెలల పాటూ నిద్రలేని రాత్రులు గడిపి చిత్రిస్తాడు. మరి దాన్ని ఆటను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు? ఒక క్రీడాకారుడు ఎంతో కష్ట పడి ఒక విజయం సాధిస్తాడు. అది అతనికి ఎలాంటి అనుభూతిని ఇంస్తుంది?
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర సమరయోదులకి ఎంతటి ఆనందం కలుగుతుంది?
ఎంతో కష్ట పడి సాధించిన వాటిని మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో నవమాసాలూ మోసి కన్న బిడ్డను తల్లి కూడా అంటే అపురూపంగా చూసుకుంటుంది. మరి అక్కడ అమ్మ గొప్పతనము ఏమి ఉంది? కష్ట పడి సంపాదించిన ఆస్తిని ఎలా కాపాడుకుంటారో ఇదీ అంతే కదా?
అందుకే అమ్మ అందరూ అనుకునేటంత గొప్పది కాదు.
తన బిడ్డని అదే తను మరణం లాంటి పురుటి నెప్పులని భరించి సంపాదించిన ఆస్తిని తను గొప్పగా చూసుకుంటే అందులో గొప్ప ఏమి ఉన్నది? నా మాటలు విడ్డూరంగా ఉన్నాయా?

ఈ సందేహం నాకు చిన్నతనంలోనే వచింది. ఎందుకు అమ్మ తన పిల్లలనే అపురూపంగా చూసుకుంటుంది? తన పిల్లల మీదే పక్షపాతం చూపుతుంది?
నా సందేహానికి కారణం ఇది.
ఒకసారి మా అమ్మమ్మ మా ఇంటికి వచింది. ఆరోజు మా అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. అందుకోసం మా అమ్మమ్మ ఎన్నో మొక్కులు మొక్కుకుంది. ఎంతో హడావుడి చేసింది. నాలుగు రోజుల తరువాత మా పిన్నికి ఒంట్లో బాగోక ఆరోజు పడుకుంది. మా అమ్మకి ఇంకా నీరసం తగ్గలేదు.మా అమ్మకి ఇంకా నీరసం తగ్గలేదు. తను ఒక్కర్తే ఆరోజు వంట పనులు చూసుకుంటోంది. ఇంతలో వాళ్ల చెల్లెలిగారి ఇంటినుంచీ వచ్చిన అమ్మమ్మ అమ్మకి సాయం చెయ్యటానికి వంటింట్లోకి వెళ్ళింది. నేనూ అక్కడే కూర్చుని ఉన్నాను. మాటల్లో అమ్మమ్మ మా పిన్నిని చూపిస్తూ, "అది దొంగనాటకాలు ఆడుతున్నది. జ్వరం లేదు పాడు లేదు. పని తప్పించుకోవడానికి పడుకుంది," అంది. అప్పుడు నేను అమ్మతో "అమ్మమ్మ అలా మాట్లాడుతున్నదేంటి?" అన్నాను. నా మాటలని అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఆరోజు అంతగా పట్టించుకోలేదు. నా సందేహం మాత్రం మాత్రం అలాగే ఉండిపోయింది. అమ్మమ్మ ఈ ఒక్కసారే కాదు. చాలాసార్లు తన పిల్లలని మాత్రమె మనుషులు అనుకున్నట్లుగా మాట్లాడటం చూసాను. తన చెల్లెళ్ళ పిల్లలిని కానే వేరే వాళ్ల పిల్లలిని కానీ అసలు లెక్క చేయదు. అందరూ తన పిల్లల లాంటి వారే కదా? మరి ఈ తెదాలేంటి?
సినిమాల్లో సవతి తల్లులు తమ పిల్లలని బాగా చూసుకున్టం, సవతి పిల్లలని తక్కువ గా చుసుకున్టం మనం చూస్తూనే ఉంటాం.
ఎందుకీ తేడా? అమ్మ అంతే నిజంగానే గొప్పది. కానీ వేరే వల్ల పిల్లలని తన పిల్లలలాగా కాక పోయినా కనీసం మనుషులుగా చూడవచ్చు. అందరూ అలాంటి వల్లే ఉండరు కానీ, ఈ తేడాలు లేకుండా అందరిని ప్రేమగా చూసుకునే ప్రతి స్త్రీ నిజంగా దేవత. తను గొడ్రాలు అయినా సరే.
అందుకే అమ్మలకి నా విజ్ఞప్తి. పిల్లలు అందరూ ఒకటే. ఈ భావనని కలిగి ఉండండి. పసిమనసులని బాధపెట్టేకండి. ఈ మాటలు అందరు పిల్లలనీ మాలాగే ప్రేమగా చూసుకునే మా అమ్మకి అంకితం. నేను చెప్పింది తప్పయితే నాకు మాత్రమే అంకితం.
సత్యమేవ జయతే.
Read On 10 comments

THEY CAME...

THUS THEY SPAKE...

Followers


The Inquisistor - సత్యాన్వేషి